Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఐపీఎల్‌లో 500+ ఫోర్లు, 200+ సిక్సులు బాదిన ఆట‌గాళ్లు న‌లుగురే.. వారెవ‌రంటే?

IPL 2022: Four players hit 500+ fours and 200+ sixes in the IPL History

ప్ర‌స్తుతం క్రికెట్‌లో టీ20 ఫార్మాట్ హ‌వా న‌డుస్తుంది. ఈ ఫార్మాట్లో రాణించాలంటే ఫోర్లు, సిక్సులు కొట్టాల్సిందే. అలా అయితేనే బ్యాట‌ర్లు ఈ ఫార్మాట్లో నిల‌దొక్కుకోగ‌ల‌రు. ఇక‌ ఐపీఎల్‌లో ఫోర్లు, సిక్సుల‌కు ఉండే గిరాకీ మామూలుగా ఉండ‌దు. బ్యాట‌ర్లు ఫోర్లు, సిక్సులు బాదుతుంటే అభిమానుల ఆనందానికి అవ‌ధులే ఉండ‌వు. ఈ బౌండ‌రీలే మ్యాచ్ ఫలితాన్ని నిర్ణ‌యిస్తాయి. ఇక ఐపీఎల్‌లో భారీగా ఫోర్లు, సిక్సులు కొట్టిన ఆట‌గాళ్లు రాత్రికి రాత్రే హిరోలు అయిపోవ‌డం చూస్తుంటాం. అయితే ఐపీఎల్‌లో బుధ‌వారం జ‌రిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియ‌న్స్ కెప్టెన్ రోహిత్ శ‌ర్మ ఈ లీగ్‌లో 500 ఫోర్లు పూర్తి చేసుకున్నాడు. హిట్‌మ్యాన్ ఈ లీగ్‌లో ఇప్ప‌టికే 200కు పైగా సిక్సులు కూడా కొట్టిన సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో ఐపీఎల్‌లో 500 ఫోర్లు, 200 సిక్సులు కొట్టిన ఆట‌గాళ్ల జాబితా ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.

ఐపీఎల్‌లో 500కు పైగా ఫోర్లు, 200కు పైగా సిక్సులు కొట్టిన ఆట‌గాళ్ల జాబితాలో న‌లుగురు బ్యాట‌ర్లు మాత్ర‌మే ఉన్నారు. ఈ లీగ్‌లో ఇప్ప‌టివ‌ర‌కు విరాట్ కోహ్లీ, రోహిత్ శ‌ర్మ‌, డేవిడ్ వార్నర్, సురేష్ రైనా 500కు పైగా ఫోర్లు, 200కు పైగా సిక్సులు బాదారు. ఐపీఎల్‌లో ఇప్ప‌టివ‌ర‌కు 212 మ్యాచ్‌లాడిన‌ విరాట్ కోహ్లీ 554 ఫోర్లు, 212 సిక్సులు బాదాడు. ఇక 218 మ్యాచ్‌లాడిన రోహిత్ శ‌ర్మ 502 ఫోర్లు, 233 సిక్సులు కొట్టాడు. ఐపీఎల్‌లో 152 మ్యాచ్‌లాడిన‌ ఆస్ట్రేలియాకు చెందిన డేవిడ్ వార్న‌ర్ 532 ఫోర్లు, 202 సిక్సులు కొట్టాడు. ఐపీఎల్‌లో 205 మ్యాచ్‌లాడిన సురేష్ రైనా 506 ఫోర్లు, 203 సిక్సులు బాదాడు.

IPL 2022: Four players hit 500+ fours and 200+ sixes in the IPL History

ఇక ఐపీఎల్ 2022లో నేడు మ‌రో ఆస‌క్తిర పోరు జ‌ర‌గ‌నుంది. నేటి మ్యాచ్‌లో గుజ‌రాత్ టైటాన్స్‌, రాజ‌స్థాన్ రాయ‌ల్స్ త‌ల‌ప‌డ‌నున్నాయి. రాత్రి 7:30 గంట‌ల‌కు ప్రారంభం కానున్న ఈ మ్యాచ్ డివై పాటిల్ స్టేడియం వేదిక‌గా జ‌ర‌గ‌నుంది. ఇప్ప‌టివ‌ర‌కు ఆడిన 4 మ్యాచ్‌ల్లో 3 విజ‌యాల‌తో రాజ‌స్థాన్ రాయ‌ల్స్ పాయింట్ల ప‌ట్టిక‌లో అగ్ర‌ స్థానంలో ఉంది. గుజ‌రాత్ టైటాన్స్ కూడా ఆడిన 4 మ్యాచ్‌ల్లో 3 గెలిచిన‌ప్ప‌టికీ ర‌న్‌రేట్‌లో తేడా కార‌ణంగా పాయింట్ల ప‌ట్టిక‌లో ఐదో స్థానంలో ఉంది.

Story first published: Thursday, April 14, 2022, 16:09 [IST]
Other articles published on Apr 14, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+