
గుజరాత్ టైటాన్స్ యువ ఓపెనర్ శుభ్‌మన్ గిల్‌పై టీమిండియా మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి ప్రశంసలు కురిపించాడు. అంతర్జాతీ క్రికెట్లో ప్రస్తుతమున్న ఆటగాళ్లలో గిల్ అత్యుత్తమ ఆటగాడని కొనియాడాడు. ఈ సందర్భంగా శుభ్‌మన్ గిల్‌కు గొప్ప నైపుణ్యం ఉందంటూ ఆయన చెప్పుకొచ్చాడు. క్రీజులో కుదురుకుంటే సునాయసంగా పరుగులు చేయగలడని చెప్పాడు. గిల్ షాట్ సెలక్షన్, స్ట్రైక్ రోటేట్ చేసే విధానం బాగుంటుందని రవిశాస్త్రి అన్నాడు. ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్‌లో శుభ్‌మన్ గిల్ ఎదుర్కొన్న 46 బంతుల్లో 6 మాత్రమే డాట్ అయ్యాయని గుర్తు చేశాడు. చెత్త బంతులను వదిలేస్తూ, షార్ట్ పిచ్ బంతులను సమర్ధవంతంగా ఎదుర్కొన్నాడని ఆయన తెలిపాడు. ప్రస్తుతం శుభ్‌మన్ గిల్ చాలా ఆత్మవిశ్వాసంతో కనిపిస్తున్నాడని రవిశాస్త్రి చెప్పాడు.
కాగా లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన ఆరంభ మ్యాచ్‌లో డకౌట్ అయిన శుభ్‌మన్ గిల్.. ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన రెండో మ్యాచ్‌లో మాత్రం హాఫ్ సెంచరీతో చెలరేగాడు. 46 బంతులు ఎదుర్కొని 84 పరుగులతో కెరీర్ బెస్ట్ స్కోర్ సాధించాడు. ఇక ఆ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌పై గుజరాత్ టైటాన్స్ 14 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ 6 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేయగా.. ఢిల్లీ క్యాపిటల్స్ 9 వికెట్ల నష్టానికి 157 పరుగులకే పరిమితమైంది.
గుజరాత్ టైటాన్స్ పూర్తి జట్టు
హార్దిక్ పాండ్యా (కెప్టెన్), రషీద్ ఖాన్, శుభ్‌మన్ గిల్, మహ్మద్ షమీ, జాసన్ రాయ్, లాకీ ఫెర్గూసన్, అభినవ్ సదరంగాని, రాహుల్ తెవాటియా, నూర్ అహ్మద్, సాయి కిషోర్, విజయ్ శంకర్, జయంత్ యాదవ్, డొమినిక్ డ్రేక్స్, దర్శన్ నల్కండే, యశ్‌రీ జోసెఫ్ దయాల్, ప్రదీప్ జోసెఫ్ దయాల్, , డేవిడ్ మిల్లర్, వృద్ధిమాన్ సాహా, మాథ్యూ వేడ్, వరుణ్ ఆరోన్, బి సాయి సుదర్శన్