
15 కోట్లకు అమ్ముడుపోయేవాడిని
నిజానికి గతంలో అద్భుతంగా ఆడిన దిగ్గజ ఆటగాళ్లకు కూడా ఇప్పటిలాగే ఆ సమయంలో ఐపీఎల్ మెగా వేలం ఉండి ఉంటే వారంతా ఎంత రేటుకు అమ్ముడుపోయే వారనే చర్చ అప్పుడప్పుడు సాగుతుంటుంది. దీనిపై ఒక్కొక్కరు ఒక్కో లెక్క చెబుతుంటారు. సరిగ్గా ఇదే ప్రశ్న రవి శాస్త్రికి ఓ క్రీడా ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఎదురైంది.
ఇప్పటి లెక్క ప్రకారం తాను కచ్చితంగా వేలంలో 15 కోట్ల రూపాయలకు అమ్ముడుపోయేవాడినని ఆయన చెప్పాడు. అంతేకాకుండా ఓ జట్టుకు కెప్టెన్‌గా కూడా ఉండేవాడినని చెప్పుకొచ్చాడు. ఎవరిని అడిగిన ఇదే సమాధానం చెబుతారని రవిశాస్త్రి అన్నాడు.

రవి శాస్త్రి రికార్డులు
మంచి స్పిన్ ఆల్‌రౌండర్ అయినా రవిశాస్త్రి టీమిండియాకు దశాబ్దకాలం పాటు ప్రాతినిధ్యం వహించాడు. ఈ సమయంలో 80 టెస్టు మ్యాచ్‌లాడి 35 సగటుతో 3830 పరుగులు చేశాడు. ఇందులో 11 సెంచరీలు, 12 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఓ సారి డబుల్ సెంచరీ మార్క్ కూడా అందుకున్నాడు. అత్యధిక స్కోర్ 206 పరుగులుగా ఉంది.
ఇక బౌలింగ్‌లో 151 వికెట్లు తీశాడు. అత్యుత్తమ గణాంకాలు 5/75గా ఉన్నాయి. అదే సమయంలో 150 వన్డే మ్యాచ్‌లాడిన రవి శాస్త్రి 29 సగటుతో 3108 పరుగులు చేశాడు. ఇందులో 4 సెంచరీలు, 18 హాఫ్ సెంచరీలు ఉండగా.. అత్యధిక స్కోర్ 109 పరుగులుగా ఉంది. ఈ క్రమంలో బౌలర్‌గా శాస్త్రి 129 వికెట్లు తీశాడు. అత్యుత్తమ గణాంకాలు 5/15గా ఉన్నాయి. టీమిండియా 1983లో ప్రపంచకప్ గెలిచిన జట్టులో రవి శాస్త్రి కూడా సభ్యుడిగా ఉన్నాడు.

హెడ్ కోచ్‌గా రవి శాస్త్రి
క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాక రవి శాస్త్రి కామెంటేటర్‌గా రాణించాడు. అలాగే టీమిండియాకు మొదట డైరెక్టర్‌గా ఆ తర్వాత హెడ్ కోచ్‌గా వ్యవహరించాడు. రవి శాస్త్రి హెడ్‌కోచ్‌గా ఉన్నప్పుడు టీమిండియా ఎన్నో మంచి మంచి విజయాలు సాధించింది. ముఖ్యంగా విదేశాల్లో అద్భుతంగా రాణించింది. రవి శాస్త్రి హెడ్ కోచ్‌గా ఉన్న సమయంలోనే ఆస్ట్రేలియాలో వరుసగా రెండు సార్లు టెస్టు సిరీస్ గెలిచి చరిత్ర సృష్టించింది.
ఇక ఇంగ్లండ్‌లో టెస్ట్ సిరీస్‌లో లీడ్‌లో నిలిచింది. అలాగే రవి శాస్త్రి కాలంలో టీమిండియా స్వదేశంలో ఒక్క టెస్ట్ సిరీస్ కూడా ఓడిపోకపోవడం గమనార్హం. అయితే గత ఏడాది ముగిసిన టీ20 ప్రపంచకప్‌తో హెడ్ కోచ్‌గా రవిశాస్త్రి పదవీ కాలం ముగిసింది. దీంతో తాజాగా ప్రారంభమైన ఐపీఎల్ 2022తో రవి శాస్త్రి కామెంటేటర్‌గా మళ్లీ తన కెరీర్‌ను ప్రారంభించాడు.


Click it and Unblock the Notifications












