
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్‌పై టీమిండియా మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి ప్రశంసలు కురిపించాడు. ప్రస్తుత క్రికటర్లలోని అత్యంత ప్రతిభావంతులైన ఆటగాళ్లలో సంజూశాంసన్ ఒకడని కొనియాడాడు. అయితే శాంసన్ పెద్ద టోర్నీల్లో రాణించలేకపోతున్నాడని, భారత్ తరఫున అంతర్జాతీయ క్రికెట్లో అంచనాలు అందుకోలేకపోతున్నాడని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ 2022లో సంజూ శాంసన్‌ను గమనిస్తున్నట్లు రవిశాస్త్రి పేర్కొన్నాడు. ఈ లీగ్‌లో శాంసన్ ఎంతో కామ్‌గా ముందుకెళ్తున్నాడని, ఈ సారి స్థిరంగా పరుగులు చేస్తాడని భావిస్తున్నట్లు తెలిపాడు.
నిజానికి సంజూ శాంసన్ తన సహజసిద్ధమైన ఆటతో భారీ స్కోర్లు చేయగలడని, అయితే అతను ప్రత్యర్థి బౌలర్లను చదవడం నేర్చుకోవాలని రవిశాస్త్రి సూచించాడు. టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ప్రత్యర్థులపై అధిపత్యం చెలాయించి ఎన్నో మ్యాచ్‌లను గెలిపించాడని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశాడు. విరాట్ కోహ్లీలా భారీ స్కోర్లు చేయాలంటే సంజూ శాంసన్ మరింత క్రమశిక్షణతో ఆడాలని ఆయన సూచించాడు. ఐపీఎల్ 2022లో సంజూ శాంసన్ నాయకత్వంలోని రాజస్థాన్ రాయల్స్ ఇప్పటివరకు 3 మ్యాచ్‌లు ఆడి రెండు గెలిచింది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో టాప్‌లో ఉంది. ఐపీఎల్‌లో ఇప్పటివరకు 124 మ్యాచ్‌లు ఆడిన శాంసన్ 29 సగటుతో 3161 పరుగులు చేశాడు. ఇందులో 3 సెంచరీలు, 16 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అత్యధిక స్కోర్ 119 పరుగులుగా ఉంది.
రాజస్థాన్ రాయల్స్ పూర్తి జట్టు
సంజూ శాంసన్, జోస్ బట్లర్, యశస్వి జైస్వాల్, ట్రెంట్ బౌల్ట్, రవిచంద్రన్ అశ్విన్, షిమ్రాన్ హెట్మెయర్, దేవదత్ పడిక్కల్, ప్రసిద్ధ్ కృష్ణ, యుజ్వేంద్ర చాహల్, రియాన్ పరాగ్, కేసీ కరియప్ప, నవదీప్ సైనీ, ఒబేద్ మెకాయ్, అరుణయ్ సింగ్, కుల్దీప్ సేన్, కరుణ్ జురెల్, దహ్రూవ్ నాయర్, , తేజస్ బరోకా, శుభమ్ గర్వాల్, డారిల్ మిచెల్, రాస్సీ వాన్ డెర్ డుస్సెన్, నాథన్ కౌల్టర్-నైల్, జేమ్స్ నీషమ్