Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

వైడ్ కోసం డీఆర్ఎస్: అంపైర్ల చేత కావట్లేదట మరి

IPL 2022: Former cricketers Daniel Vettori and Imran Tahir wants DRS use for wides call also

ముంబై: ఇదివరకు ఎప్పుడూ లేనంతగా ఈ ఐపీఎల్ 2022 సీజన్‌లో అంపైర్ల తప్పిదాలు చోటు చేసుకుంటోన్నాయి. అలాంటిలాంటి తప్పిదాలు కావవి. ఒక్కోసారి మ్యాచ్ ఫలితాలను తారుమారు చేస్తోన్నాయి. సన్‌రైజర్స్ హైదరాబాద్ కేప్టెన్ కేన్ విలియమ్సన్ క్యాచ్ అవుట్ తరువాత ఒకదాని వెంట ఒకటి పుట్టుకొస్తూనే ఉన్నాయి. రాజస్థాన్ రాయల్స్‌పై మ్యాచ్ సందర్భంగా అంపైర్ తప్పుడు నిర్ణయానికి కేన్ విలియమ్సన్ బలి అయ్యాడు. ఇప్పుడు అదే అంపైరింగ్ తప్పిదాలకు అదే రాజస్థాన్ రాయల్స్.. మూల్యం చెల్లించుకున్నట్టయింది.

కోల్‌కతా నైట్‌రైడర్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య సోమవారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో కూడా అంపైరింగ్ తప్పిదాలు వెలుగు చూశాయి. క్యాచ్‌ అవుట్‌ను సైతం వైడ్‌గా ప్రకటించారు అంపైర్లు. రాజస్థాన్ రాయల్స్ బౌలర్ ట్రెంట్ బౌల్ట్ వేసిన 13వ ఓవర్‌లో చోటు చేసుకున్న ఘటన అంపైరింగ్ తప్పిదాలకు అద్దం పట్టింది. బౌల్ట్ సంధించిన షాట్ బాల్‌ను కోల్‌కత నైట్ రైడర్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ పుల్ షాట్ ఆడే ప్రయత్నం చేశాడు. 140 కిలోమీటర్ల వేగంతో దూసుకొచ్చిన బంతిని అతను అంచనా వేయలేకపోయాడు. టైమింగ్ మిస్ అయ్యాడు.

IPL 2022: Former cricketers Daniel Vettori and Imran Tahir wants DRS use for wides call also

బంతిని సరిగ్గా కనెక్ట్ చేయలేకపోయాడు. ఆ బంతి శ్రేయాస్ అయ్యర్ గ్లోవ్స్‌ను తాకుతూ వెళ్లి వికెట్ కీపర్ సంజూ శాంసన్ చేతిలో వాలింది. దీనితో సంజు, ట్రెంట్ బౌల్ట్ సంబరాలు చేసుకోబోతోండగా.. అంపైర్ డిఫరెంట్‌గా రియాక్ట్ అయ్యాడు. అది వైడ్ బాల్ అంటూ ఫీల్డ్ అంపైర్ సిగ్నల్ ఇచ్చాడు. అంపైర్ నిర్ణయాన్ని సంజు గట్టిగా వ్యతిరేకించాడు. వెంటనే రివ్యూ తీసుకున్నాడు. రివ్యూలో అది క్యాచ్ అవుట్‌గా తేలింది. ఇంత క్లియర్‌గా ఉన్నప్పటికీ ఫీల్డ్ అంపైర్.. వైడ్ ఇవ్వడం వివాదాస్పదమైంది.

ఓ కొత్త డిమాండ్ కూడా పుట్టుకొచ్చింది. ఇకపై వైడ్ బాల్స్‌ను గుర్తించడానికి డీఆర్ఎస్ విధానాన్ని అనుసరించడం మేలంటూ న్యూజిలాండ్ మాజీ క్రికెటర్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మాజీ కేప్టెన్ డేనియల్ వెటోరి అన్నాడు. వైడ్ బాల్స్ విషయంలో అంపైర్ల నిర్ణయాలను పునఃసమీక్షించడానికి డీఆర్ఎస్ విధానాన్ని వర్తింపజేయడమే మంచిదని చెప్పాడు. ప్రస్తుతం డీఆర్ఎస్ విధానాన్ని బ్యాటర్ అవుట్ అయిన సందర్భంలో వినియోగిస్తోన్నారు.

ఇప్పుడు వైడ్ బాల్స్‌కు కూడా వర్తింపజేయాల్సిన అవసరం ఏర్పడిందని అన్నారు. చెన్నై సూపర్ కింగ్స్ మాజీ స్పిన్నర్ ఇమ్రాన్ తాహిర్.. ఈ విషయంపై వెటోరీతో ఏకీభవించాడు. ఐసీసీ రూల్స్ 22.4.1 ప్రకారం వైడ్ బాల్స్‌ను గుర్తించడానికి స్పష్టమైన విధానం ఉందని, అంపైరింగ్ తప్పిదాలు మళ్లీ మళ్లీ చోటుచేసుకుంటూనే ఉంటున్నాయని వ్యాఖ్యానించాడు. అందుకే- డీఆర్ఎస్ విధానాన్ని వైడ్ బాల్స్‌కు కూడా వర్తింపజేయడం వల్ల పరిష్కారం దొరుకుతుందని అన్నాడు.

Story first published: Tuesday, May 3, 2022, 14:25 [IST]
Other articles published on May 3, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+