Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Sunil Gavaskar: పంజాబ్ కింగ్స్‌ ఈ సారి కూడా టైటిల్ గెల‌వ‌డం క‌ష్ట‌మే.. ఎందుకంటే..

IPL 2022: Former cricketer Sunil Gavaskar says it will be difficult for Punjab Kings to win the title this time too

మ‌రో రెండు రోజుల్లో ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్‌ (ఐపీఎల్) 2022 ప్రారంభం కాబోతున్న నేప‌థ్యంలో పంజాబ్ కింగ్స్ జ‌ట్టుపై టీమిండియా మాజీ కెప్టెన్ సునీల్ గ‌వాస్క‌ర్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. పంజాబ్ కింగ్స్‌లో స‌రైన ఆట‌గాళ్లు ఒక్కరు కూడా లేర‌ని, ఈ సారి కూడా ఆ జ‌ట్టు టైటిల్ గెల‌వ‌డం క‌ష్టమేన‌ని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. అన్ని జ‌ట్ల మాదిరిగానే పంజాబ్ కింగ్స్ కూడా ఈ సారి మెగా వేలంలో కొత్త ఆట‌గాళ్ల‌ను కొనుగోలు చేసిన‌ప్ప‌టికీ మ్యాచ్ ఫలితాన్ని మార్చ‌గ‌లిగే ఒక్క ఆట‌గాడిని కూడా కొనుగోలు చేయ‌లేద‌ని మండిప‌డ్డారు. అయితే అదే స‌మ‌యంలో ఇది జ‌ట్టుకు బ‌లంగా మారే అవ‌కాశాలు కూడా ఉన్నాయ‌ని ఆయ‌న‌ చెప్పుకొచ్చారు. ఎందుకంటే జ‌ట్టులో స్టార్ ఆట‌గాళ్లు లేక‌పోవ‌డం వ‌ల్ల ఎలాంటి ఒత్తిడి ఉండ‌ద‌ని గ‌వాస్క‌ర్ చెప్పారు.

అప్పుడు ఆట‌గాళ్లు మైదానంలో ఎలాంటి ఒత్తిడి లేకుండా స్వేచ్ఛ‌గా ఆడ‌తార‌ని సునీల్ గ‌వాస్క‌ర్ పేర్కొన్నారు. అప్పుడు ఇతర జ‌ట్ల‌కు షాకిచ్చి మ్యాచ్‌లు గెలిచే అవ‌కాశాలు ఉంటాయ‌ని తెలిపారు. అయిన‌ప్ప‌టికీ ట్రోఫీ గెల‌వ‌డం మాత్రం క‌ష్ట‌మ‌ని పేర్కొన్నారు. ఎందుకంటే టీ20 క్రికెట్లో టైటిల్ గెల‌వాలంటే నిల‌క‌డగా రాణించాల్సి ఉంటుంద‌ని ఆయ‌న తెలిపారు. మెగా వేలానికి ముందు ఇద్ద‌రు ఆట‌గాల్ల‌ను మాత్ర‌మే రిటైన్ చేసుకున్న పంజాబ్ కింగ్స్ వేలంలో మాత్రం శిఖ‌ర్ ధావ‌న్, బెయిర స్టో, క‌గిసో రబాడ‌, ఓడియ‌న్ స్మిత్, షారూక్ ఖాన్ వంటి స్టార్ ప్లేయ‌ర్ల‌ను కొనుగోలు చేసింది. వేలానికి ముందు కెప్టెన్ మ‌యాంక్ అగ‌ర్వాల్‌తోపాటు ఆర్ష్‌దీప్ సింగ్‌ను రిటైన్ చేసుకుంది.

పంజాబ్ కింగ్స్ పూర్తి జ‌ట్టు 2022
మయాంక్ అగర్వాల్(రూ.14 కోట్లు), అర్ష్‌దీప్ సింగ్(రూ.4 కోట్లు), కగిసో రబడా(రూ.9.25 కోట్లు), రాహుల్ చాహర్(రూ.5.25 కోట్లు), ప్రభ్ సిమ్రన్ సింగ్(రూ.60 లక్షలు), రిషీ ధావన్(రూ.55 లక్షలు), హర్‌ప్రీత్ బ్రార్(రూ.3.80 కోట్లు), రాజ్ అంగడ్ బావ(రూ.2 కోట్లు), లియామ్ లివింగ్ స్టోన్(రూ.11.50 కోట్లు), వైభవ్ అరోరా(రూ.2 కోట్లు), నాథన్ ఎల్లిస్(రూ.75 లక్షలు), సందీప్ వర్మ(రూ.50 లక్షలు), షారూఖ్ ఖాన్(రూ.9 కోట్లు), శిఖర్ ధావన్ (రూ.8.25 కోట్లు), జానీ బెయిర్ స్టో (రూ.6.75 కోట్లు), ఓడిన్ స్మిత్ (రూ.6 కోట్లు), బాల్‌తేజ్ ధండా (రూ.20 లక్షలు), అన్ష్ పటేల్(రూ.20 లక్షలు), అథర్వ టైడ్, చటర్జీ(రూ.20 లక్షలు), భానుక రాజపక్స(రూ.50 లక్షలు), బెన్ని హోవల్ (రూ.40 లక్షలు), ఇషాన్ పోరెల్(రూ.25 లక్షలు), జితేశ్ శర్మ(రూ.20 లక్షలు), మన్కండ్(రూ.20 లక్షలు).

Story first published: Thursday, March 24, 2022, 19:22 [IST]
Other articles published on Mar 24, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+