IPL 2022: ఈ సారి ట్రోఫీ ఆ జట్టుదే.. ముంబై, చెన్నైకి గెలిచే సత్తా లేదు: సునీల్ గవాస్కర్


ఐపీఎల్ 2022 మరో 2 రోజుల్లో ప్రారంభంకాబోతుంది. దీంతో క్రికెట్ అభిమానులంతా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఇక ఇప్పటిలాగే ఈ సారి కూడా ఐపీఎల్ ట్రోఫీని గెలిచే జట్టు ఏదని పలువురు అంచనా వేస్తున్నారు. పరిస్థితులు చూస్తుంటే మాత్రం ట్రోఫీ గెలవగల సత్తా అన్ని టీంలకు ఉందనే చెప్పుకోవాలి. ఒకటి, రెండు టీంలు మినహా మిగతా జట్లన్నీ అన్ని విభాగాల్లో బలంగా కనిపిస్తున్నాయి. దీంతో ఈ సారి ట్రోఫీ గెలవబోయే జట్టు ఏదని ముందుగానే కచ్చితంగా అంచనా వేయడం కష్టంగా మారిందని చెప్పుకోవాలి. కానీ టీమిండియా దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ మాత్రం ఈ సారి ట్రోఫీ గెలవబోయే జట్టు ఏదో చెప్పేశాడు.

ఢిల్లీదే కప్
రిషబ్ పంత్ కెప్టెన్సీలో బరిలోకి దిగుతున్ను ఢిల్లీ క్యాపిటల్స్ ఈ సారి ఐపీఎల్ ఛాంపియన్‌గా అవతరించబోతుందని టీమిండియా మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ జోస్యం చెప్పాడు. ఇప్పటికే ఐపీఎల్‌లో ఢిల్లీకి కెప్టెన్సీ చేసిన రిషబ్ పంత్ కావాల్సినంత అనుభవం సంపాదించాడని అన్నాడు.
గత సీజన్లో చేసిన తప్పులను ఎలా సరిదిద్దుకోవాలో పాఠాలు నేర్చుకోని ఉంటాడని అభిప్రాయపడ్డాడు. దీనికి తోడు ప్రస్తుతం రిషబ్ పంత్ ఆటగాడిగా సూపర్ ఫామ్‌లో ఉన్నాడని ఆయన చెప్పుకొచ్చాడు. దీంతో ఇదే ఫామ్‌ను కంటిన్యూ చేస్తూ ఢిల్లీ క్యాపిటల్స్‌కు రిషబ్ పంత్ ట్రోఫి అందిస్తాడని సునీల్ గవాస్కర్ ఆత్మవిశ్వాసం వ్యక్తం చేశాడు.

సెలెక్టివ్ మ్యాచ్ విన్నర్లను కొనుగోలు
ఐపీఎల్ 2022 మెగా వేలంలో ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్రాంచైజీ సెలక్టివ్ మ్యాచ్ విన్నర్లనే కొనుగోలు చేసిందని సునీల్ గవాస్కర్ చెప్పాడు. అదే ఢిల్లీని బలమైన టీంగా తీర్చిదిద్దిందని చెప్పుకొచ్చాడు. మెగా వేలంలో శార్దూల్ ఠాకూర్, లుంగి ఇంగిడి, డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్, రోవ్‌మన్ పావెల్ వంటి స్టార్ ఆటగాళ్లను ఢిల్లీ కొనుగోలు చేసిందని ఆయన గుర్తు చేశాడు.
ఐపీఎల్‌లో అత్యంత విజయవంతమైన టీంలు ముంబై ఇండియన్స్, చెన్నైసూపర్ కింగ్స్ కంటే ఈ సారి ట్రోఫీ గెలిచే అవకాశాలు ఢిల్లీ క్యాపిటల్స్‌కే ఎక్కువగా ఉన్నాయని సునీల్ గవాస్కర్ చెప్పారు.

ఢిల్లీ క్యాపిటల్స్ నిరీక్షణకు తెరపడేనా
సునీల్ గవాస్కర్ చెప్పినది నిజమైతే ఐపీఎల్‌లో ఈ సారి కొత్త ఛాంపియన్‌ను చూడొచ్చు. కాగా ఢిల్లీ క్యాపిటల్స్ ఇప్పటివరకు ఒక్క సారి కూడా ట్రోఫి గెలవలేదు. 2020లో ఫైనల్ చేరినప్పటికీ ముంబై ఇండియన్స్ చేతిలో ఓడి రన్నరఫ్‌తోనే సరిపెట్టుకుంది.
ఇక గత ఏడాది ఎలిమినేటర్ మ్యాచ్‌లో ఓడిపోయింది. దీంతో ఈ సారైన ట్రోఫీ గెలిచి తమ నిరీక్షణకు తెర దించాలని ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు పట్టుదలగా ఉంది. కాగా ఈ ఐపీఎల్‌లో ఢిల్లీ తమ తొలి మ్యాచ్‌ను ఈ నెల 27న ముంబై ఇండియన్స్‌తో ఆడనుంది.

ఢిల్లీ క్యాపిటల్స్ పూర్తి జట్టు
రిషభ్ పంత్ (16 కోట్లు), ఆన్రిచ్ నోర్జే (6.50 కోట్లు), అక్షర్ పటేల్ (9 కోట్లు), పృథ్వీషా (7.50 కోట్లు), మిచెల్ మార్ష్ (6.50 కోట్లు), సయ్యద్ ఖలీల్ అహ్మద్ (5.25 కోట్లు), చేతన్ సకారియా (4.20 కోట్లు), రోవ్‌మన్ పావెల్ ( 2.80 కోట్లు), ముస్తాఫిజర్ రెహ్మాన్ (2 కోట్లు), కుల్‌దీప్ యాదవ్ (2 కోట్లు), కేఎస్ భరత్ (2 కోట్లు), కమ్‌లేష్ నగర్‌కోటి (1.10 కోట్లు), మన్‌దీప్ సింగ్ (1.10 కోట్లు), లలిత్ యాదవ్ ( 65 లక్షలు), టిమ్ సీఫెర్ట్ (రూ. 50 లక్షలు), యాష్ ధుల్ (50 లక్షలు), ప్రదీప్ దూబే (50 లక్షలు), ఎంగిడి (50 లక్షలు), అశ్విన్ హెబ్బర్, సర్ఫరాజ్ ఖాన్, రిపల్ పటేల్, విక్కీ ఓత్సవాల్ ( వీరందరికీ 20 లక్షలు).
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications