
ఐపీఎల్‌కు మరో రెండు రోజులు మాత్రమే సమయం ఉండడంతో ఆయా ఫ్రాంచైజీల ఆటగాళ్లతోపాటు సపోర్టింగ్ స్టాఫ్ మొత్తం తమ తమ జట్లలో చేరిపోతున్నారు. ఇప్పటికే దాదాపుగా ఆటగాళ్లంతా వారి జట్లలో చేరారు. ఇక సపోర్టింగ్ స్టాప్ కూడా దాదాపు చేరిపోయారు. తాజాగా భారత క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ ముంబై ఇండియన్స్ టీంతో కలిసిపోయాడు.
ఇందుకు సంబంధించిన వీడియోను ముంబై ఇండియన్స్ తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో షేర్ చేసింది. ఇందులో సచిన్ టెండూల్కర్ నడుచుకుంటూ హోటల్ గదిలోకి రావడాన్ని గమనించవచ్చు. కాగా సచిన్ టెండూల్కర్ ముంబై ఇండియన్స్ టీంకు మెంటార్‌గా ఉన్న సంగతి తెలిసిందే.
ఐపీఎల్‌లో తొలి ఆరు సీజన్లు ఆడిన సచిన్ టెండూల్కర్ ఆ సీజన్లన్నింటిలోనూ ముంబై ఇండియన్స్‌కే ప్రాతినిధ్యం వహించాడు. క్రికెట్ నుంచి రిటైర్ అయినప్పటి నుంచి అదే జట్టుకు మెంటార్‌గా వ్యవహరిస్తున్నాడు.
ఈ క్రమంలో ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ జట్టు అత్యంత విజయవంతమైన జట్టుగా నిలవడానికి సచిన్ ఆటగాడిగా, మెంటార్‌గా కీలకపాత్ర పోషించాడు. ఐపీఎల్‌లో ఆటగాడిగా 78 మ్యాచ్‌లాడిన సచిన్ 33 సగటుతో 2334 పరుగులు చేశాడు. ఇందులో 13 హాఫ్ సెంచరీలు, ఒక సెంచరీ ఉండగా అత్యధిక స్కోర్ 100* గా ఉంది. తన కెప్టెన్సీలో ముంబైని సచిన్ ఓ సారి ఫైనల్ చేర్చాడు.
ముంబై ఇండియన్స్ పూర్తి జట్టు
రోహిత్ శర్మ(16 కోట్లు), జస్ప్రీత్ బుమ్రా(12 కోట్లు), కీరన్ పొలార్డ్(6 కోట్లు), సూర్యకుమార్ యాదవ్(8 కోట్లు), ఇషాన్ కిషన్(15.25 కోట్లు), టిమ్ డేవిడ్ (ఓవర్సీస్ - రూ. 8.25 కోట్లు), జొఫ్రా ఆర్చర్ (ఓవర్సీస్ రూ. 8 కోట్లు), డేవిడ్ బ్రెవిస్ (ఓవర్సీస్-3 కోట్లు), డేనియల్ సామ్స్ (ఓవర్సీస్ -రూ. 2.60 కోట్లు), తిలక్ వర్మ(1.70 కోట్లు), మురుగన్ అశ్విన్(1.60 కోట్లు), టైమల్ మిల్స్ (ఓవర్సీస్-1.50 కోట్లు), జయ్‌దేవ్ ఉనద్కత్(1.30 కోట్లు), రిలే మెరెడిత్ (ఓవర్సీస్ కోటి), ఫాబియన్ అలెన్ (ఓవర్సీస్ 75 లక్షలు), మయాంక్ మార్కండే( 65 లక్షలు), సంజయ్ యాదవ్(50 లక్షలు), బసిల్ థంపి(30 లక్షలు), అర్జున్ తెందూల్కర్(30 లక్షలు), ఆర్యన్ జుయల్, హృతిక్ షోకీన్, మహమ్మద్ అర్షద్ ఖాన్, అన్‌మోల్‌ప్రీత్ సింగ్, రాహుల్ బుద్ది, రమణ్ దీప్ సింగ్( వీరందరికీ 20 లక్షలు)