చెన్నై సూపర్ కింగ్స్ తొందరపాటు: రవీంద్ర జడేజా కేప్టెన్సీ ధ్వంసం: ఆ నిర్ణయంతో అప్‌సెట్

ముంబై: ఐపీఎల్ 2022 సీజన్‌.. చెన్నై సూపర్ కింగ్స్‌ ఓ పీడకలేననడంలో ఎలాంటి సందేహాలు అక్కర్లేదు. ఏ రకంగా కూడా ఈ సీజన్ ఆ ఫ్రాంఛైజీకి మేలు చేయలేదు. కావాల్సినన్ని విమర్శలు, ట్రోల్స్‌ను ఎదుర్కొందీ జట్టు. అవమానకరంగా ఈ సీజన్ నుంచి నిష్క్రమించింది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వేదికగా ఐపీఎల్ 2020 తరహా పరిస్థితులను చవి చూసింది. ఈ శుక్రవారం రాజస్థాన్ రాయల్స్‌తో తన చిట్టచివరి మ్యాచ్‌ను ఆడనుంది ధోనీ సేన. ఇందులో గెలిచి విజయంతో తన ప్రస్థానాన్ని ముగించాలని భావిస్తోంది.

ముందు నుంచీ ఎదురుదెబ్బలే..

ముందు నుంచీ ఎదురుదెబ్బలే..

ఈ సీజన్ ఆరంభం నుంచీ చెన్నై సూపర్ కింగ్స్ అన్నీ అవాంతరాలే ఎదురయ్యాయి. ఎదురుదెబ్బలే తగిలాయి. మహేంద్ర సింగ్ ధోనీ వారసుడిగా చెన్నై సూపర్ కింగ్స్ కేప్టెన్సీ పగ్గాలను రాత్రికి రాత్రే అందుకున్నాడు రవీంద్ర జడేజా. చివరి నిమిషంలో అతను సారధ్య బాధ్యతలను స్వీకరించాడు. టోర్నమెంట్ ఆరంభానికి ముందు ఆయనను కేప్టెన్‌గా ప్రకటించింది ఫ్రాంఛైజీ. సరిగ్గా రెండు రోజుల ముందు ఈ పరిణామాల చోటు చేసుకున్నాయి. తాను కెప్టెన్సీ నుంచి తప్పుకున్నట్లు ధోనీ ప్రకటించడం.. తన వారసుడిగా రవీంద్ర జడేజాను ఎంపిక చేయాలని ఫ్రాంఛైజీకి సూచించడం.. దానికి మేనేజ్‌మెంట్ అంగీకరించడం చకచకా సాగిపోయాయి.

అనుభవం లేకున్నా..

అనుభవం లేకున్నా..

అంతకుముందు కెప్టెన్‌ వ్యవహరించిన అనుభవం రవీంద్ర జడేజాకు లేదు. తన కెరీర్‌లో ఏ రోజు కూడా అతను జట్టును ముందుండి నడిపించన సందర్భాలు లేవు. కనీసం వైస్ కేప్టెన్‌గా అయినా.. స్టాండ్ బైగా అయినా కేప్టెన్‌గా రవీంద్ర జడేజా పని చేయలేదు. అలాంటిది రాత్రికి రాత్రి సెకెండ్ మోస్ట్ సక్సెస్‌ఫుల్ జట్టుకు కేప్టెన్సీ బాధ్యతలను స్వీకరించడం అంటే మాటలు కాదు. జట్టును ముందుండి నడిపించడం అనేది అసలు సిసలు సవాల్‌. దీన్ని సమర్థవంతంగా నిర్వహించలేకపోయాడనేది ఈ ఐపీఎల్ సీజన్ స్పష్టం చేసింది.

కేప్టెన్సీ ఒత్తిళ్లు..

కేప్టెన్సీ ఒత్తిళ్లు..

సాధారణంగా ఏ కేప్టెన్‌ అయినా తీవ్ర ఒత్తిడిని ఎదుర్కోవడం సాధారణమే. ఈ బాధ్యతల వల్ల తన వ్యక్తిగత ప్రదర్శనను కూడా కొన్ని సందర్భాల్లో పణంగా పెట్టాల్సి వస్తుంది. జడేజా విషయంలో అదే జరిగింది. ఒక్క రోజు కూడా కేప్టెన్‌గా వ్యవహరించని ప్లేయర్‌కు ఒక్కసారిగా ఓ మెగా ఈవెంట్‌లో మోస్ట్ సక్సెస్‌ఫుల్ జట్టు బాద్యతలను అప్పగించడం- అతని వ్యక్తిగత ప్రదర్శనను సైతం దెబ్బతీసింది. బ్యాటింగ్ చేయలేక.. బౌలింగ్ వేయలేక తీవ్రంగా సతమతం అయ్యాడు.

చెన్నై ఫ్రాంఛైజీ తొందరపాటు నిర్ణయంగా..

చెన్నై ఫ్రాంఛైజీ తొందరపాటు నిర్ణయంగా..

తనను అప్పటికప్పుడు చెన్నై సూపర్ కింగ్స్ కేప్టెన్‌గా నియమించడం.. టోర్నమెంట్ కొనసాగుతుండగానే మళ్లీ తొలగించడం వంటి చర్యలు రవీంద్ర జడేజను తీవ్ర మనస్తాపానికి గురి చేసిందని అతని సన్నిహితులు చెబుతున్నారు. కొంత సమయం ఇచ్చి అతనికి కేప్టెన్సీ పగ్గాలు అందించి ఉంటే మెరుగ్గా ఉండేదని జడేజా భావిస్తున్నాడని అంటున్నారు. అంతా అప్పటికప్పుడు, రాత్రికి రాత్రి జరిగిపోవడం వల్ల- కేప్టెన్‌గా ఎదురైన సవాళ్లను జడేజ అధిగమించలేకపోయాడని స్పష్టం చేస్తోన్నారు.

అన్‌ఫాలో చేయడం కూడా..

అన్‌ఫాలో చేయడం కూడా..

కేప్టెన్సీ బాధ్యతలను ధోనీకి అప్పగించడం, గాయం వల్ల టోర్నమెంట్ నుంచి అర్ధాంతరంగా రూల్డ్ అవుట్ కావడం, చెన్నై సూపర్ కింగ్స్ మేనేజ్‌మెంట్ తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌ను అన్ ఫాలో చేయడం వంటి పరిణామాలు రవీంద్ర జడేజను మరింత బాధ పెట్టాయని సన్నిహితులు చెబుతున్నారు. కేప్టెన్సీ బాధ్యతల వల్ల సాధారణంగా తనలో ఉండే కిల్లింగ్ గుణాన్ని జడేజా కోల్పోయాడని, ఈ సీజన్‌లో అతను అన్ని రంగాల్లోనూ విఫలం కావడానికి అదే కారణమని స్పష్టం చేస్తోన్నారు.

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
Story first published: Tuesday, May 17, 2022, 15:43 [IST]
Other articles published on May 17, 2022
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X