IPL 2022: ఐపీఎల్‌లోకి స్టార్ ఆల్‌రౌండర్ షేన్ వాట్సన్ రీఎంట్రీ.. ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులో కీ రోల్

ఆస్ట్రేలియా మాజీ ఆల్‌రౌండర్ షేన్ వాట్సన్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లోకి మళ్లీ అడుగుపెట్టబోతున్నాడు. అయితే ఈ సారి ఆటగాడిగా కాకుండా అసిస్టెంట్ కోచ్ పాత్రలో వాట్సన్ ఐపీఎల్‌లో మెరవనున్నాడు. ఈ మేరకు త్వరలోనే ఢిల్లీ క్యాపిటల్స్ మేనేజ్‌మెంట్ నుంచి అధికారిక ప్రకటన రానుందని సమాచారం.

అసిస్టెంట్ కోచ్‌గా
ఢిల్లీ క్యాపిటల్స్‌కు హెడ్‌కోచ్‌గా ఉన్న ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్.. తన దేశానికే చెందిన షేన్ వాట్సన్‌ను జట్టుకు అసిస్టెంట్ కోచ్‌గా తీసుకోవాలని మేనేజ్‌మెంట్‌కు సిఫార్సు చేశాడట. దీంతో పాంటింగ్ సిఫార్స్‌కు ఢిల్లీ క్యాపిటల్స్ మేనేజ్‌మెంట్ అంగీకరించిందని సమాచారం. త్వరలోనే దీనికి సంబంధించిన పూర్తి వివరాలను ఢిల్లీ మేనేజ్‌మెంట్ అధికారికంగా ప్రకటింనుందని తెలుస్తోంది. మరోవైపు టీమిండియా మాజీ బౌలర్ అజిత్ అగార్కర్ కూడా ఢిల్లీ క్యాపిటల్స్‌కు అసిస్టెంచ్ కోచ్‌గా వ్యవహరించనున్నాడు. ఇప్పటికే దీనికి సంబంధించిన సమాచారాన్ని ఢిల్లీ క్యాపిటల్స్ మేనేజ్‌మెంట్ అగార్కర్‌కు తెలియచేసినట్లు తెలుస్తోంది.

అత్యంత విజయవంతమైన ఆటగాడు
కాగా ఐపీఎల్‌లో అత్యంత విజయవంతమైన ఆటగాళ్లలో షేన్ వాట్సన్ ఒక్కడు. ఈ స్టార్ ఆల్‌రౌండర్ ఐపీఎల్‌లో ప్రతి సీజన్లో ఆడాడు. ఐపీఎల్ ప్రారంభ సీజన్ నుంచి 2019 వరకు రెగ్యూలర్‌గా ఆడాడు. అయితే 2020లో క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. ఈ క్రమంలో వాట్సన్ ఆల్‌రౌండర్‌గా అనేక రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. ఐపీఎల్ ప్రారంభ సీజన్లో రాజస్థాన్ రాయల్స్‌కు ప్రాతినిధ్యం వహించిన వాట్సన్ ఆ జట్టు టైటిల్ గెలవడంతో కీలక పాత్ర పోషించాడు. ఇక 2018 ఐపీఎల్ ఫైనల్‌లో అజేయ సెంచరీతో చెన్నై సూపర్ కింగ్స్‌కు ట్రోఫి అందించాడు. అలాగే ఐపీఎల్‌లో ఓ సారి హ్యాట్రిక్ వికెట్లు తీశాడు. పలు సీజన్లపాటు రాజస్థాన్ రాయల్స్‌కు కెప్టెన్‌గా కూడా వ్యవహరించి ఆ జట్టును విజయవంతంగా నడిపించాడు.

వాట్సన్ రికార్డులు
ఐపీఎల్‌లో 145 మ్యాచ్‌లు ఆడిన షేన్ వాట్సన్ 31 సగటుతో 3874 పరుగులు చేశాడు. ఇందులో ఏకంగా 4 సెంచరీలు ఉన్నాయి. 21 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అత్యధిక స్కోర్ 117 పరుగులు. ఈ క్రమంలో 376 ఫోర్లు, 190 సిక్సులు బాదాడు. అలాగే బౌలర్‌గా 92 వికెట్లు తీశాడు. అత్యుత్తమ గణాంకాలు 4/29.

ఢిల్లీ క్యాపిటల్స్ పూర్తి స్క్వాడ్
రిషబ్ పంత్ (కెప్టెన్), ఆన్రిచ్ నోర్జే, అక్షర్ పటేల్, పృథ్వీషా, మిచెల్ మార్ష్, సయ్యద్ ఖలీల్ అహ్మద్, చేతన్ సకారియా, రోవ్‌మన్ పావెల్, ముస్తాఫిజర్ రెహ్మాన్, కుల్‌దీప్ యాదవ్, కేఎస్ భరత్, కమ్‌లేష్ నగర్‌కోటి, మన్‌దీప్ సింగ్, లలిత్ యాదవ్, టిమ్ సీఫెర్ట్, యాష్ ధుల్, ప్రదీప్ దూబే, ఎంగిడి, అశ్విన్ హెబ్బర్, సర్ఫరాజ్ ఖాన్, రిపల్ పటేల్, విక్కీ ఓత్సవాల్.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications