For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

Stephen Fleming: ఆ పొజిషన్లో అలాగే ఉంటది.. కాస్త కష్టమే అంటూ భలే వెనకేసుకొచ్చాడుగా

Fleming said there was no need to worry about Jadejas form

పూణేలోని మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో బుధవారం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో 13పరుగుల తేడాతో ఓటమి చవిచూసిన చెన్నై సూపర్ కింగ్స్‌కు ఐపీఎల్ 2022సీజన్లో ఇది ఏడో ఓటమి. డెవాన్ కాన్వే, మోయిన్ అలీ మినహా మిగతా బ్యాటర్లు క్రీజులో నిలబడి ఇన్నింగ్స్‌ను నిలబెట్టలేకపోయారు. ఫలితంగా జట్టు 174పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేకపోయింది. ఇక తొలుత ఈ సీజన్లో కెప్టెన్ బాధ్యతలు చేపట్టిన రవీంద్ర జడేజా కెప్టెన్సీని వదులుకున్న తర్వాత కూడా నిరాశజనక ప్రదర్శన చేస్తున్నాడు. నిన్నటి మ్యాచ్‌లోనూ జడ్డూ నిరాశపరిచాడు. బ్యాట్‌తో ఎలాంటి పోరాటం చూపకుండానే పెవిలియన్ బాటపట్టాడు. కీలక టైంలో బ్యాటింగ్‌కు దిగిన జడ్డూ కేవలం మూడు పరుగులు చేసి ఔటయ్యాడు. ఇక జడ్డూ పేలవ ఫామ్ గురించి మ్యాచ్ అనంతరం సీఎస్కే కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ మాట్లాడుతూ.. జడేజా నంబర్ 5 లేదా నంబర్ 6 స్థానంలో వచ్చి బ్యాటింగ్ చేయడం వల్ల ఇన్నింగ్స్ నిర్మించడానికి టైం ఉండదు.. అందువల్ల జడేజా ఫామ్ గురించి ఆందోళన చెందట్లేదని ఫ్లెమింగ్ స్పష్టం చేశాడు.

1
4-2022
నంబర్ 5, 6 పొజిషన్లో బ్యాటింగ్‌కు దిగితే అంతే

నంబర్ 5, 6 పొజిషన్లో బ్యాటింగ్‌కు దిగితే అంతే

ఫ్లెమింగ్ జడేజా ఫామ్ గురించి మాట్లాడుతూ.. 'నేను జడేజా ఫామ్ గురించి కించిత్ ఆందోళన చెందడం లేదు. ఇది టీ20 గేమ్. ఎంతో టఫ్ ఫార్మాట్. టీ20ల్లో మీరు 5వ స్థానంలోనో, 6వ స్థానంలోనో బ్యాటింగ్ చేస్తున్నప్పుడు.. రిథమ్ అందుకోవడానికి ప్లేయర్లకు ఎక్కువ టైం ఉండదు. ఆ పొజిషన్లో బ్యాటింగ్‌కు దిగిన ప్లేయర్లు హిట్టింగ్ చేయాల్సిన అవసరముంటుంది. అందువల్ల జడేజా కుదురైన ఇన్నింగ్స్ ఆడడానికి సరైన స్పేస్ దొరకట్లేదు. మేము ఈ విషయాన్ని పరిశీలించి వర్కవుట్ చేస్తాం. అతని ప్రదర్శన చూసి అతను ఫామ్‌లో లేడని భావించను, అతని ఫామ్ గురించి కూడా ఆందోళన చెందను.' అని ఫ్లెమింగ్ ఓ టీవీకి ఇచ్చిన వర్చువల్ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో తెలిపాడు.

బ్యాట్‌తోనూ, బంతితోనూ అంతంతమాత్రమే

బ్యాట్‌తోనూ, బంతితోనూ అంతంతమాత్రమే

ఇకపోతే ఈ సీజన్‌లో 10‌మ్యాచ్‌లు ఆడిన జడేజా 19.33 సగటుతో కేవలం 116 పరుగులు మాత్రమే చేయగలిగాడు. ఇక బంతితో కూడా జడ్డూ అంతగా రాణించట్లేదు. ఆడిన మ్యాచ్‌లలో 7.52ఎకానమీ రేటుతో జడ్డూ 5వికెట్లు పడగొట్టాడు. ప్రస్తుత సీజన్ గురించి ఫ్లెమింగ్ మాట్లాడుతూ.. 'మేము అన్ని విభాగాల్లో అనుకున్నంత రాణించట్లేదని అనుకుంటాను. అయినప్పటికీ మ్యాచ్‌ల సందర్భంగా భారీ తేడాతో మేము ఓడిపోవట్లే. చాలా గేమ్‌లలో గెలుపు అంచుల వరకు వెళుతున్నాం. కానీ అక్కడ చివర్లో ఉండే ఓ బ్యారియర్‌ను మాత్రం దాటలేకపోతున్నాం.' అని ఫ్లెమింగ్ జట్టు ప్రదర్శన తీరును పేర్కొన్నాడు.

దాదాపు ప్లేఆఫ్ నుంచి ఔట్

దాదాపు ప్లేఆఫ్ నుంచి ఔట్

గత వారం జడేజా సీఎస్కే కెప్టెన్సీని వదులుకున్న సంగతి తెలిసిందే. దీంతో తిరిగి చెన్నై కెప్టెన్సీ పగ్గాలు ధోని అందుకున్నాడు. ధోనీ సారథ్యంలో చెన్నై ఓ మ్యాచ్ గెలిచినప్పటికీ ఆర్సీబీతో మళ్లీ ఓడిపోయి.. దాదాపు ప్లే ఆఫ్ ఆశలను కోల్పోయింది. ప్రస్తుతం ఆడిన 10 మ్యాచ్‌లలో కేవలం మూడింట గెలిచి 6పాయింట్లతో పాయింట్ల పట్టికలో తొమ్మిదో స్థానంలో ఉంది. ఇక సీఎస్కే అన్ని మ్యాచ్‌లు గెలిచినా ప్లేఆఫ్ అవకాశాలు ఆ జట్టు చేతిలో ఏమాత్రం లేవు. మిగతా జట్ల జయాపజయాలే ఆ జట్టు అవకాశాలను ప్రభావితం చేస్తాయి.

Story first published: Thursday, May 5, 2022, 10:28 [IST]
Other articles published on May 5, 2022
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+