ఆ అయిదు మిస్టేక్స్ మా కొంపముంచాయి.. ఓటమిపై అసహనం వ్యక్తం చేసిన ధోనీ

ఐపీఎల్ 2022సీజన్‌లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య నిన్న పూణేలోని మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ 173పరుగులు చేయగా.. ఇక తర్వాత బ్యాటింగ్‌కు దిగిన చెన్నై 8వికెట్లు కోల్పోయి 160పరుగులు మాత్రమే చేయగలిగింది. దీంతో 13పరుగుల తేడాతో చెన్నై ఓటమి పాలయింది. ఈ మ్యాచ్ అనంతరం చెన్నై కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ మాట్లాడుతూ.. 'మేము వారిని 173పరుగులకే పరిమితం చేయగలగడం ప్లస్ పాయింట్. తరువాత మాకు ఛేదనలో ఎడ్జ్ ఉంటుందని భావించాను. మేము బ్యాటింగ్‌లో మంచి స్టార్టింగ్ పొందాం. అయితే మధ్యలో మా బ్యాటర్లు నిరాశపరిచారు. ఛేజింగ్ టైంలో అసలు బ్యాటింగ్ పరంగా ఎలా ఆడాలో తెలుస్తుంది. కొన్ని సమయాల్లో మన బ్యాటింగ్ ప్రవృత్తిని మార్చుకోవాల్సి ఉంటుంది. షాట్లు ఆడడం కంటే పరిస్థితి ఏమి డిమాండ్ చేస్తుందో చూడాలి. షాట్ ఎంపిక పట్ల చాలా కీన్ అబ్జర్వేషన్ ఉండాలి. క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోయాము. మా బ్యాటర్లు కొన్ని షాట్ల ఎంపికలో ఫెయిల్ అయ్యారు. ఆ విషయంలో మరింత జాగ్రత్తపడాలి. ఛేజింగ్‌లో కాలిక్యులేటివ్ బ్యాటింగ్ చేయాల్సిన అవసరముంటుంది. అది మిస్సయ్యాం.' అని ధోనీ పేర్కొన్నాడు. కాగా ఈ మ్యాచ్‌లో చెన్నై కొంపముంచిన కొన్ని పాయింట్లు..

మ్యాక్స్ వెల్ బౌలింగ్‌ను టార్గెట్ చేయాలనుకోవడం..
ఆర్సీబీ బౌలర్లలో ప్రభావం చూపని బౌలర్‌గా చెన్నై బ్యాటర్లు మ్యాక్స్ వెల్‌ను భావించి అతని బౌలింగ్లో హిట్టింగ్ చేయాలని చూశారు. ఈ క్రమంలో ఉతప్ప మ్యాక్స్ వెల్ బౌలింగ్లో షాట్ ఆడేందుకు ప్రయత్నించి ఔటయ్యాడు. అలాగే అంబటి రాయుడు సైతం మ్యాక్సీ బౌలింగ్లోనే క్లీన్ బౌల్డ్ అయ్యాడు. వీరిద్దరు చాలా తక్కువ స్కోరుకే పెవిలియన్ బాట పట్టడంతో చెన్నై ఇన్నింగ్స్ గాడి తప్పింది.

మళ్లీ నిరాశపర్చిన రవీంద్రా జడేజా
బ్యాటింగ్ పరంగా పేలవ ఫామ్ కనబర్చుతున్న రవీంద్రా జడేజా మరోసారి నిరాశపరిచాడు. కీలక టైంలో బ్యాటింగ్ దిగిన జడ్డూ.. 3పరుగులకే ఔటయ్యి లోయర్ ఆర్డర్ మీద మరింత ప్రెషర్ పెంచేశాడు.

హర్షల్ పటేల్ బౌలింగ్
ఆర్సీబీ బౌలర్లలో హర్షల్ పటేల్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. అతని బౌలింగ్ ఓ స్థాయిలో పడుతుంది. ఇక చెన్నై బ్యాటర్లు హర్షల్ బౌలింగ్‌ను అంచనా వేయడంలో విఫలమయ్యారు. ఊరిస్తూ వేసిన అతని బంతులకు లొంగిపోయారు. ఈ క్రమంలో క్లిక్ అయిన మోయిన్ అలీ అతని బౌలింగ్లో హిట్టింగ్ ప్రయత్నించి ఔటవ్వడంతో చెన్నైకి బ్రేక్ పడింది. హర్షల్ 3వికెట్లు తీశాడు.

రిక్వైర్డ్ రన్ రేట్ చూసుకోకపోవడం
చెన్నై ఓపెనర్లు మంచి శుభారంభం అందించిన అనంతరం తర్వాతి బ్యాటర్లు హిట్టింగ్ చేయాల్సిన అవసరం అంతగా లేదు. రిక్వైర్డ్ రన్ రేట్ సైతం రుతురాజ్ ఔటయ్యే టైంకి 8లోపే ఉంది. ఆ కాలిక్యులేటివ్ అప్రోచ్‌తో చెన్నై బ్యాటర్లు బ్యాటింగ్ చేయలేదు. అనవసర షాట్ల కోసం ప్రయత్నించి ఔటయిపోయారు.

ప్రిటోరియస్ చెత్త బౌలింగ్
తొలుత చెన్నై బౌలింగ్ చేసినప్పుడు ప్రిటోరియస్ ధారాళంగా పరుగులిచ్చుకున్నాడు. అతను 3ఓవర్లు వేసి 42పరుగులు ఇచ్చాడు. ఓవర్‌కు సగటున 14పరుగుల చొప్పున రన్స్ ఇచ్చాడు. దీంతో ఆర్సీబీ స్కోరు ఒక 15పరుగులు ఎక్కువ చేయగలిగింది. అతను 30లోపు పరుగులు ఇచ్చి ఉంటే.. ఆర్సీబీ స్కోరు 160లోపే ఉండేది. అప్పుడు చెన్నై విజయవకాశాలు ఇంకాస్త మెరుగ్గా ఉండేవి.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications