IPL 2022 final: ఆ విషయంలో కోహ్లీని కాపీ కొట్టిన శుభ్‌మాన్ గిల్.. కోహ్లీని, గిల్‌ను పోల్చుతూ పోస్టులు


ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2022 ఫైనల్లో విన్నింగ్ సిక్సర్ కొట్టిన అనంతరం శుభ్‌మాన్ గిల్ సెలబ్రేషన్స్ ఓ రేంజులో ఉన్నాయి. రాజస్థాన్ రాయల్స్ బౌలర్ ఒబెడ్ మెక్‌కాయ్ బౌలింగ్లో డీప్ స్క్వేర్ లెగ్ మీదుగా సిక్స్ కొట్టడంతో గుజరాత్ ఫైనల్ గెలుపు సొంతమైంది. ఇక గెలిచిన సంబరంలో శుభ్ మాన్ గిల్ అచ్చం కోహ్లీలాగే సెలబ్రేట్ చేసుకున్నాడు.
విరాట్ కోహ్లీ విన్నింగ్ షాట్ కొట్టినప్పుడుగానీ, సెంచరీలు చేసినప్పుడు గానీ హెల్మెట్ తీసి.. బాడీ కాస్త వెనక్కి వంచి.. కేకలు వేస్తూ సెలబ్రేట్ చేసుకుంటాడు. ఇక శుభ్ మాన్ గిల్ కూడా నిన్న అలాగే సెలబ్రేట్ చేసుకున్నాడు. ఇక శుభమాన్ గిల్ సెలబ్రేషన్లు ట్విట్టర్లో వైరల్ అవుతున్నాయి.
హెల్మెట్ తీసి సింహ గర్జన
విన్నింగ్ షాట్ కొట్టిన తర్వాత గిల్ తన హెల్మెట్ తీసి సింహగర్జన చేశాడు. ఇక అనంతరం అవతలి ఎండ్‌లో ఉన్న తన సహచరుడు డేవిడ్ మిల్లర్‌ను కౌగిలించుకుని వేడుకలు జరుపుకున్నాడు. ఈ మ్యాచ్‌లో గిల్ అద్భుతంగా ఆడాడు. 43బంతుల్లో 45పరుగులతో కడవరకు క్రీజులో నిలిచాడు. ఇక హార్దిక్ పాండ్యాతో కలిసి మూడో వికెట్ కు 63పరుగుల విలువైన భాగస్వామ్యాన్ని నమోదు చేశాడు. అనంతరం డేవిడ్ మిల్లర్ (19 బంతుల్లో 32 పరుగులు)తో కలిసి మ్యాచ్ ముగిసేదాకా క్రీజులో నిలబడ్డడాడు. వీరిద్దరు మ్యాచ్ విన్నింగ్ భాగస్వామ్యం (29బంతుల్లో 47పరుగులు) నమోదు చేశారు.
చాహల్ లైఫ్ ఇచ్చాడు
131 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్ టైటాన్స్‌కు శుభారంభం దక్కలేదు. బౌన్సీ పిచ్ కావడంతో బంతులు ఎక్స్ ట్రా బౌన్స్ అవుతు బ్యాటర్లు సరిగా అంచనా వేయడానికి వీలులేకుండా ఉంది. ఈ క్రమంలో బౌల్ట్ వేసిన తొలి ఓవర్‌లో శుభ్‌మన్ గిల్ ఇచ్చిన క్యాచ్‌ను యుజ్వేంద్ర చాహల్ నేలపాలు చేశాడు. గోల్డెన్ డక్ అవుట్ నుంచి తప్పించుకున్న శుభ్ మాన్ గిల్ ఇచ్చిన లైఫ్ ను పూర్తిగా సద్వినియోగం చేసుకున్నాడు. తర్వాత ఏమాత్రం తొందరపడకుండా ఆడుతూ హార్దిక్ తో కలిసి విలువైన భాగస్వామ్యాన్ని నమోదు చేశాడు. ఇక చివరి వరకు క్రీజులో పాతుకుపోయి ఆఖరికి విన్నింగ్ షాట్ కొట్టాడు.
ఈ సీజన్లో మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడిన గిల్
ఐపీఎల్ 2022 సీజన్లో శుభ్ మాన్ గిల్ పలు మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడాడు. ఈ సీజన్లో 16 మ్యాచ్‌లు ఆడిన గిల్ 483పరుగులు చేశాడు. నాలుగు హాఫ్ సెంచరీలు చేశాడు. అతని స్ట్రైక్ రేటు 132.33గా ఉంది. సగటు 34గా ఉంది. లో స్కోరింగ్ మ్యాచ్‌లలో శుభ్ మాన్ గిల్ చాలా అద్భుతంగా ఆడగలడు. ఇక ఫైనల్లో ముందుగా బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 130 పరుగులు చేసింది.
జోస్ బట్లర్(35 బంతుల్లో 5 ఫోర్లతో 39) మినహా అంతా విఫలమయ్యారు. అనంతరం గుజరాత్ టైటాన్స్ 18.1 ఓవర్లలో 3 వికెట్లకు 133 పరుగులు చేసి 7వికెట్ల తేడాతో గెలుపొందింది. శుభ్‌మన్ గిల్(43 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్‌తో 45 నాటౌట్), డేవిడ్ మిల్లర్(19 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్‌తో 32 నాటౌట్), హార్దిక్ పాండ్యా(30 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్‌తో 34) రాణించారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications