
రెండో క్వాలిఫయర్‌లో..
రెండో క్వాలిఫయర్ జరిగిందిక్కడే. టైటిల్ హాట్ ఫేవరెట్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టును రాజస్థాన్ రాయల్స్ మట్టి కరిపించిందిక్కడే. ఆ రకంగా చూసుకుంటే- నరేంద్ర మోడీ స్టేడియం పిచ్ రాజస్థాన్ రాయల్స్‌కు బాగా అచ్చొచ్చినట్టే అవుతుంది. పైగా శుక్రవారమే రెండో క్వాలిఫయర్ ముగిసింది. రాజస్థాన్ రాయల్స్ క్యాంప్‌లో ఆ ఊపు..ఇంకా తగ్గట్లేదు. రాయల్ ఛాలెంజర్స్‌పై ఘన విజయం సాధించిన పాజిటివ్ వైబ్రేషన్స్ ఇంకా అలానే ఉన్నాయి. అదే వేడితో గుజరాత్ టైటాన్స్‌ను ఎదుర్కొనబోతోంది.

గుజరాత్ టైటాన్స్ మైనస్ పాయింట్ అదే..
అదే ఇప్పుడు గుజరాత్ టైటాన్స్ మైనస్ పాయింట్‌గా మారింది. లీగ్ దశలో గానీ, ప్లేఆఫ్స్‌లో గానీ హార్దిక్ పాండ్యా టీమ్.. నరేంద్ర మోడీ స్టేడియంలో మ్యాచ్ ఆడలేదు. సొంత రాష్ట్రానికి చెందిన పిచ్ అయినప్పటికీ- ఇప్పటివరకు ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదిక్కడ. ఈ సీజన్లో ఆ జట్టుకు ఇదే తొలి మ్యాచ్ కావడం వల్ల పిచ్‌పై అంచనాలను వీలైనంత వేగంగా అలవర్చుకోవాల్సి ఉంటుందా లోకల్ టీమ్‌కు. తొలి క్వాలిఫయర్‌ను కోల్‌కత ఈడెన్ గార్డెన్స్‌లో ఆడింది. రాజస్థాన్‌కు మాత్రం ఇక్కడి పిచ్.. కొట్టినపిండి. రెండో క్వాలిఫయర్‌లో పింక్ టీమ్‌కు ఘన విజయాన్ని అందించిన పిచ్ ఇది.

వాతావరణం ఎలా ఉంది..?
వర్షం పడే సూచనలేవీ ప్రస్తుతానికి అహ్మదాబాద్‌లో లేవు. వాతావరణం పొడిగా ఉంది. పగటి ఉష్ణోగ్రత గరిష్ఠంగా 42 డిగ్రీల వరకు ఉండొచ్చు. సాయంత్రం తరువాత ఆకాశం పాక్షికంగా మేఘావృత్తం అయినప్పటికీ..వర్షం పడే అవకాశాలు దాదాపు లేవు. గాలి వేగం గంటకు 19 కిలోమీటర్లతో వీస్తుందని భారత వాతావరణ కేంద్రం అంచనా వేసింది. రాత్రి ఉష్ణోగ్రత 29 డిగ్రీల సెల్సియస్‌గా నమోదవుతుందని తెలిపింది. గాలిలో తేమశాతం సాధారణంగానే ఉంటుంది. పగటిపూట గాలిలో తేమ 65 శాతం, రాత్రివేళ 58 శాతంగా ఉంటుందని పేర్కొంది.

బ్యాటింగ్‌కు అనుకూలంగా..
నరేంద్ర మోడీ స్టేడియానిది ఫ్లాట్ పిచ్..క్విక్ అవుట్‌ఫీల్డ్. బ్యాటర్ల మధ్య భారీ భాగస్వామ్యం నెలకొనడానికి అవకాశం ఉంటుందిక్కడ. ఫ్లాట్ సర్ఫేస్ కావడం వల్ల పేసర్లు విజృంభించే అవకాశం ఉంది. టార్గెట్‌ను ఛేదించడం అనేది ఈ పిచ్‌పై సవాల్‌తో కూడుకుని ఉంటుంది. తొలి ఇన్నింగ్ బ్యాటింగ్ యావరేజ్ 174 పరుగులు కావడం దీనికి నిదర్శనం. రెండో ఇన్నింగ్ బ్యాటింగ్ యావరేజ్ 166.