Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

సన్‌రైజర్స్ హైదరాబాద్ బౌలర్‌కు షాక్: ఫాస్టెస్ట్ డెలివరీ అవార్డు మరొకరికి: పూర్తి జాబితా ఇదే

IPL 2022 Final, GT vs RR: Here is the complete list of awards including Orange Cap and Purple Cap
IPL 2022 Final: Gujarat vs Rajasthan | Match Highlights | Oneindia News

అహ్మదాబాద్: కోట్లాదిమంది అభిమానులను కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2022 సీజన్.. 15వ ఎడిషన్ ముగిసింది. గుజరాత్ టైటాన్స్ ఛాంపియన్‌గా ఆవిర్భవించింది. ఐపీఎల్‌లో అడుగు పెట్టిన తొలి సీజన్‌లోనే టైటిల్‌ను సాధించిన జట్టుగా కొత్త చరిత్రను సృష్టించింది. అహ్మదాబాద్ నరేంద్ర మోడీ స్టేడియంలో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో తన ప్రత్యర్థి రాజస్థాన్ రాయల్స్‌ను చిత్తుగా ఓడించింది. ఏడు వికెట్ల తేడాతో విజయఢంకా మోగించింది.

 రూ.20 కోట్ల ప్రైజ్ మనీ..

రూ.20 కోట్ల ప్రైజ్ మనీ..

మ్యాచ్ విన్నర్‌ గుజరాత్ టైటాన్స్ జట్టుకు 20 కోట్ల రూపాయల ప్రైజ్‌మనీ, ట్రోఫీ లభించింది. రన్నరప్‌గా ఉన్న రాజస్థాన్ రాయల్స్‌కు 13.5 కోట్ల రూపాయల ప్రైజ్ మనీ దక్కింది. మూడో స్థానంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు 7, నాలుగో స్థానంలో నిలిచిన లక్నో సూపర్ జెయింట్స్‌కు 6.5 కోట్ల రూపాయల ప్రైజ్ మనీని లభించింది. ఈ సీజన్ మొత్తానికీ అత్యుత్తమ ప్రతిభను ప్రదర్శించిన ఆటగాళ్లకు అవార్డులను అందజేసింది ఐపీఎల్ మేనేజ్‌మెంట్.

ఎక్కువ అవార్డులు జోస్ బట్లర్‌కే..

ఎక్కువ అవార్డులు జోస్ బట్లర్‌కే..

ఈ అవార్డుల జాబితాలో ఎక్కువసార్లు కనిపించిన పేరు.. జోస్ బట్లర్. మొత్తంగా ఆరు అవార్డులను అందుకున్నాడతను. వేర్వేరు కేటగిరీల కింద ప్రకటించిన ఆరు అవార్డులను బట్లర్ సొంతం అయ్యాయి. ఐపీఎల్ సీజన్‌లో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్‌కు ఇచ్చే ఆరెంజ్ క్యాప్ అతనిదే. ఈ సీజన్‌లో 863 పరుగులు చేశాడు. ఇందులో నాలుగు సెంచరీలు, నాలుగు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఓ ఐపీఎల్ సీజన్‌లో అత్యధిక పరుగులు చేసిన రెండో ఆటగాడిగా నిలిచాడు. ఇదివరకు ఈ రికార్డ్ డేవిడ్ వార్నర్ పేరు మీద ఉండేది. తొలి ప్లేయర్ విరాట్ కోహ్లీ.

పర్పుల్ క్యాప్..

పర్పుల్ క్యాప్..

దీనితోపాటు- మోస్ట్ వాల్యుబల్ ప్లేయర్ ఆఫ్ ద సీజన్, మోస్ట్ సిక్సెస్, మోస్ట్ ఫోర్స్, గేమ్ ఛేంజర్ ఆఫ్ ది సీజన్, పవర్ ప్లేయర్ ఆఫ్ ది సీజన్ అవార్డులు జోస్ బట్లర్ వశం అయ్యాయి. అత్యధిక వికెట్లు తీసుకున్న ప్లేయర్‌కు ఇచ్చే పర్పుల్ క్యాప్.. యుజువేందర్ చాహల్‌ సొంతమైంది. ఈ సీజన్‌లో 27 వికెట్లు పడగొట్టాడు. ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు దక్కింది. సన్‌రైజర్స్ బౌలర్ ఉమ్రాన్ మాలిక్ ఈ అవార్డును అందుకున్నాడు.

ఫాస్టెస్ట్ డెలివరీ..

ఫాస్టెస్ట్ డెలివరీ..

సూపర్ స్ట్రైకర్ ఆఫ్ ది సీజన్ పురస్కారాన్ని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు వికెట్ కీపర్ కమ్ లోయర్ మిడిలార్డర్ బ్యాటర్ దినేష్ కార్తీక్ కైవసం చేసుకున్నాడు. ఈ సీజన్‌లో 330 పరుగులు చేశాడు. 10 సార్లు నాటౌట్‌గా నిలిచాడు. కొన్ని మ్యాచ్‌లను ఒంటిచేత్తో గెలిపించాడు కూడా. ఇక ఫాస్టెస్ట్ డెలివరీ ఆఫ్ ది సీజన్ అవార్డు లోకీ ఫెర్గూసన్ చేతికి వెళ్లింది. ఫైనల్‌లో 157.3 కిలోమీటర్ల వేగంతో అతను బంతిని సంధించాడు.

ఉమ్రాన్ మాలిక్ చేయి దాటిన అవార్డ్..

ఉమ్రాన్ మాలిక్ చేయి దాటిన అవార్డ్..

నిజానికి- ఫాస్టెస్ట్ డెలివరీ అవార్డ్ ఉమ్రాన్ మాలిక్‌కు దక్కుతుందని అందరూ ఆశించారు. 157 కిలోమీటర్ల వేగంతో అతను బంతిని సంధించాడు. దీన్ని ఎవరూ అధిగమించలేరని అనుకున్న దశలో ఒక్కసారిగా లోకీ ఫెర్గూసన్ రేసులోకి దూసుకొచ్చాడు. 157.3 కిలోమీటర్ల వేగంతో బంతిని విసిరాడీ న్యూజిలాండ్ ఆల్‌రౌండర్. దీనితో ఈ అవార్డ్ ఫెర్గూసన్‌కు దక్కింది.

క్యాచ్ ఆఫ్ ది సీజన్..

క్యాచ్ ఆఫ్ ది సీజన్..

క్యాచ్ ఆఫ్ ది సీజన్ అవార్డు మాత్రం అందరూ ఊహించిందే. లక్నో సూపర్ జెయింట్స్ ప్లేయర్ ఎవిన్ లెవిస్‌ పేరు తప్ప మరొకరిని ఊహించలేం. కోల్‌కత నైట్‌రైడర్స్‌పై జరిగిన మ్యాచ్‌లో అతను ఈ అద్భుతమైన క్యాచ్‌ను అందుకున్నాడు. రింకూ సింగ్ కొట్టిన షాట్‌ను బౌండరీ లైన్ నుంచి సుమారు 30 గజాల దూరం వరకు పరుగెత్తుకుంటూ వచ్చి.. ఒంటి చేత్తో బంతిని అందుకున్నాడు ఎవిన్ లెవిస్. ఇది- క్యాచ్ ఆఫ్ ది సీజన్‌గా నిలిచింది. ఈ క్యాచ్ అందుకోకపోయి ఉంటే ఈ మ్యాచ్‌లో ఖచ్చితంగా కోల్‌కత నైట్‌రైడర్స్ గెలిచి ఉండేది.

Story first published: Monday, May 30, 2022, 8:50 [IST]
Other articles published on May 30, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+