Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

నాలుగు ఐపీఎల్ ఫైనల్స్‌ ఆడిన హార్దిక్ పాండ్యా.. అన్నింట్లోనూ విజయుడే

IPL 2022 Final, GT vs RR: Hardik Pandya has been part of 4 IPL Finals and he was won all of them

అహ్మదాబాద్: ఐపీఎల్ 2022 సీజన్‌ ఫైనల్ ఈ రాత్రికి ఆరంభం కాబోతోంది. సంజు శాంసన్ సారథ్యంలోని రాజస్థాన్ రాయల్స్-హార్దిక్ పాండ్యా నాయకత్వాన్ని వహిస్తోన్న గుజరాత్ టైటాన్స్ ఇవ్వాళ ఫైనల్‌లో తలపడనున్నాయి. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో ముగింపు ఉత్సవాలను వైభవంగా దీన్ని నిర్వహించడానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా హాజరు కానున్నారు.

హార్దిక్ పేరు మీద అరుదైన రికార్డ్..

హార్దిక్ పేరు మీద అరుదైన రికార్డ్..

ఈ ఐపీఎల్ ఫైనల్‌తో గుజరాత్ టైటాన్స్ కేప్టెన్ హార్దిక్ పాండ్యా ఓ అరుదైన రికార్డును అందుకోనున్నాడు. అయిదోసారి అతను ఫైనల్స్ ఆడబోతోన్నాడు. ఇదివరకు నాలుగుసార్లు ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్‌లను ఆడిన అనుభవం అతనికి ఉంది. అన్నింట్లోనూ విజయం సాధించాడు. అతన భాగస్వామిగా ఉన్న జట్టు అన్ని ఐపీఎల్ ఫైనల్స్‌నూ గెలిచింది. ఆ జట్టే- ముంబై ఇండియన్స్. గుజరాత్ టైటాన్స్ జట్టు కేప్టెన్‌గా పగ్గాలను అందుకోవడానికి ముందువరకూ అతను ముంబై ఇండియన్స్‌లో కొనసాగిన విషయం తెలిసిందే.

2015, 2017లో..

2015, 2017లో..

ముంబై ఇండియన్స్ తరఫున మొత్తం నాలుగుసార్లు ఐపీఎల్ ఫైనల్స్‌లో హార్దిక్ పాండ్యా భాగస్వామి. 2015 నాటి ఐపీఎల్ ఫైనల్స్‌లో చెన్నైై సూపర్ కింగ్స్‌పై విజయం సాధించిన ముంబై ఇండియన్స్ జట్టులో హార్దిక్ పాండ్యా సభ్యుడు. తన నాలుగు ఓవర్ల కోటాలో వికెట్లు తీయలేకపోయాడు. 36 పరుగులు ఇచ్చాడు. 2017లో పుణే సూపర్ జెయింట్స్‌పై ముంబై ఇండియన్స్‌ తరఫున ఫైనల్స్ ఆడాడు హార్దిక్ పాండ్యా. తొమ్మిది బంతుల్లో 10 పరుగులకు ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు.

2019, 2020ల్లో..

2019, 2020ల్లో..

2019 ఐపీఎల్ ఫైనల్స్‌లోనూ తక్కువ వ్యక్తిగత పరుగులకే అవుట్ అయ్యాడు. 19 ఓవర్‌లో దీపక్ చాహర్ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా అవుట్ అయ్యాడు. అతని వ్యక్తిగత స్కోర్ 16. ఈ మ్యాచ్‌ను కూడా ముంబై ఇండియన్స్ గెలిచింది. 2020 ఫైనల్స్‌లో ఢిల్లీ కేపిటల్స్‌పై ముంబై ఇండియన్స్ తరఫున ఫైనల్ ఆడాడు. అయిదు బంతుల్లో మూడు పరుగులే చేసి.. ఎన్రిచ్ నోర్ట్జె బౌలింగ్‌లో పెవిలియన్ దారి పట్టాడు. అతను అవుట్ అయ్యేటప్పటికే ముంబై ఇండియన్స్ గెలుపు వాకిట్లో నిలిచింది.

గుజరాత్‌ను ఛాంపియన్‌గా..

గుజరాత్‌ను ఛాంపియన్‌గా..

ఈ నాలుగుసార్లు కూడా ఆ జట్టు కప్‌ కొట్టింది. మెగా ఆక్షన్ కోసం ముంబై ఇండియన్స్ ఫ్రాంఛైజీ యాజమాన్యం అతన్ని వదులుకుంది. గుజరాత్ టైటాన్స్ ఫ్రాంఛైజీ యాజమాన్యం సీవీసీ కేపిటల్స్ మెగా వేలంపాటలో 15 కోట్ల రూపాయలతో హార్దిక్‌ను సొంతం చేసుకుంది. కేప్టెన్సీ పగ్గాలను అప్పగించింది. దాన్ని సమర్థవంతంగా నిర్వహిస్తూ వస్తోన్నాడీ బరోడా క్రికెటర్. లీగ్ దశలో తన జట్టును టేబుల్ టాపర్‌గా నిలిపాడు. ప్లేఆఫ్స్‌లో తొలి క్వాలిఫయర్‌తోనే గుజరాత్ టైటాన్స్‌ను ఫైనల్స్‌కు చేర్చాడు.

ఫైనల్స్ ఆడిన అనుభవం..

ఫైనల్స్ ఆడిన అనుభవం..

ఈ నాలుగు ఫైనల్స్ ఆడిన అనుభవం అతనికి ఇప్పుడు అక్కరకొచ్చింది. ఆ అనుభవంతో కేప్టెన్‌గా తన జట్టును ఛాంపియన్‌గా నిలుపుతాడా? లేక సంజు శాంసన్ సారథ్యంలోని రాజస్థాన్ రాయల్స్ చేతిలో తలవంచుతాడా? అనేది ఈ రాత్రికి తేలిపోతుంది. ఫైనల్స్‌‌ను గెలిస్తే మాత్రం కొత్త రికార్డును నెలకొల్పినవాడవుతాడు. అతి తక్కువ మ్యాచ్‌లను ఆడి జట్టును ఛాంపియన్‌గా నిలబెట్టినట్టవుతుంది.

Story first published: Sunday, May 29, 2022, 15:35 [IST]
Other articles published on May 29, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+