Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Jos Buttler frustration: వీడియో: హెల్మెట్, గ్లోవ్స్‌ను విసిరికొట్టి..: ఆ మాత్రం అసహనం ఉండదా మరి

IPL 2022 Final, GT vs RR: Frustrated Jos Buttler Throws Away His Helmet and gloves after dismissed

అహ్మదాబాద్: రెండున్నర నెలల పాటు క్రికెట్ ప్రపంచాన్ని ఉర్రూతలూగించిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2022 సీజన్.. 15వ ఎడిషన్ గ్రాండ్ ముగిసింది. గుజరాత్ టైటాన్స్ రూపంలో ఓ కొత్త ఛాంపియన్‌ను అందించింది. ఐపీఎల్‌లో తన ప్రస్థానాన్ని ప్రారంభించిన తొలి సీజన్‌లోనే టైటిల్‌ను సాధించింది. ఓ కొత్త చరిత్రను సృష్టించింది. లో-స్కోరింగ్ ఫైనల్‌లో రాజస్థాన్ రాయల్స్‌ను చిత్తు చేసింది. మ్యాచ్ విన్నర్‌కు 20 కోట్ల రూపాయల ప్రైజ్‌మనీ, ట్రోఫీ లభించింది. రన్నరప్‌‌గా నిలిచిన పింక్ టీమ్‌కు 13.5 కోట్ల రూపాయల ప్రైజ్‌మనీ దక్కింది.

అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో ఆదివారం రాత్రి జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లల్లో తొమ్మిది వికెట్ల నష్టానికి 130 పరుగులు చేయగలిగింది. రాజస్థాన్‌లో ఓపెనర్ జోస్ బట్లర్ ఒక్కడే టాప్ స్కోరర్. 35 బంతుల్లో 39 పరుగులు చేశాడు. అయిదు ఫోర్లు కొట్టాడు. ఒక్క సిక్స్ కూడా అతని బ్యాట్ నుంచి రాలేదు. భారీ స్కోర్ చేస్తాడనుకున్న బట్లర్ ఫైనల్స్‌లో తేలిపోయాడు.

యశస్వి జైస్వాల్-22, కేప్టెన్ సంజు శాంసన్-14, దేవ్‌దత్ పడిక్కల్-2, షిమ్రోన్ హెట్మెయిర్-11, రవిచంద్రన్ అశ్విన్-6, రియాన్ పరాగ్-15, ట్రెంట్ బౌల్ట్-11, ఒబెద్ మెక్‌కే-8.. ఇలా సాగింది రాజస్థాన్ రాయల్స్ బ్యాటింగ్ లైనప్. జోస్ బట్లర్ ఆ మాత్రం స్కోర్ చేయకపోయి ఉంటే..రాజస్థాన్ రాయల్స్ 100 పరుగుల్లోపే చాప చుట్టేసి ఉండేదనడంలో సందేహాలు అక్కర్లేదు. బట్లర్.. ఇదివరకట్లా ఆడలేదనేది మాత్రం ఖచ్చితంగా చెప్పొచ్చు.

ఈ ఐపీఎల్ మొత్తానికి 149.71 స్ట్రైక్ రేట్‌తో ఆడిన జోస్ బట్లర్.. ఫైనల్స్‌లో ఆ స్థాయిలో దూకుడును ప్రదర్శించలేకపోయాడు. 39 పరుగులు చేయడానికి 35 బంతులను తీసుకున్నాడు. అయిదే ఫోర్లు కొట్టాడు. తన మార్క్ షాట్ ఆడలేదు. అనిశ్చితితో కనిపించిందతని బ్యాటింగ్ శైలి. బంతిని ఒక్కసారి కూడా ఫెన్సింగ్‌‌ను దాటించలేకపోయాడు. అలాగని గుజరాత్ టైటాన్స్ బౌలింగ్ భయపెట్టిందా అంటే అదీ లేదు. కాస్త లైన్ అండ్ లెంగ్త్‌కు కట్టుబడి బంతులను సంధించితే షాట్లు కొట్టలేనంత బలహీనుడేమీ కాదు బట్లర్.

జట్టు స్కోరు 179 పరుగుల వద్ద ఉన్నప్పుడు హార్దిక్ పాండ్యా బౌలింగ్‌లో వెనుదిరిగాడీ ఇంగ్లాండ్ డాషింగ్ బ్యాటర్. 13వ ఓవర్ తొలి బంతిని థర్డ్‌మ్యాన్ దిశగా తరలించబోయి టైమింగ్ మిస్ అయ్యాడు. అది కాస్తా బ్యాట్‌ను ముద్దాడుతూ వెళ్లి వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహా చేతుల్లో వాలింది. నాలుగో వికెట్‌గా వెనుదిరిగాడు బట్లర్. అవుట్ అయిన అసహనం అతనిలో స్పష్టంగా కనిపించింది. డగౌట్‌ ఇంకా అంతదూరం ఉందనగానే.. హెల్మెట్‌ను విసిరేశాడు. గ్లోవ్స్‌ను నేలకు విసిరికొట్టాడు.

Story first published: Monday, May 30, 2022, 7:58 [IST]
Other articles published on May 30, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+