IPL 2022: ముంబై ఇండియన్స్ ప్లాన్ మాములుగా లేదుగా.. ఆర్చర్ కొనుగోలు వెనుక మాష్టర్ ప్లాన్

బెంగళూరు: ఐపీఎల్ మెగా వేలం ఆసక్తికరంగా సాగింది. ఈ వేలంలో ముఖ్యంగా ముంబై ఇండియన్స్ అనుసరించిన వ్యూహాలపై ఫ్యాన్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు. వేలంలో మొదటి రోజు ఆటగాళ్లను ఎక్కువగా కొనుగోలు చేయని ముంబై అత్యధికంగా డబ్బులను మిగుల్చుకుంది. వేలంలోనే అత్యధిక ధర పలికిన ఇషాన్ కిషన్‌ను దక్కించుకున్నప్పటికీ మొదటి రోజు ముగిసే సమయానికి ఆ జట్టు దగ్గరనే ఎక్కువ డబ్బులు మిగిలి ఉండడాని చూస్తే ముంబై ఓనర్ల వ్యూహాలకు అభిమానులు అద్దం పడుతుంది. ముఖ్యంగా జోఫ్రా ఆర్చర్‌ను ఎందుకు అంత ధర పెట్టి కొనుగోలు చేశారో మొదట చాలా మందికి అర్థం కాలేదు.
గతేడాది ఐపీఎల్‌లో అదరగొట్టిన జోఫ్రా ఆర్చర్ లీగ్‌లో ప్లేయర్ ఆఫ్ ది టోర్నీగా నిలిచాడు. కానీ గాయం కారణంగా ఈ సీజన్‌కు దూరంగా ఉంటున్నాడు. అయినప్పటికీ వేలంలో మాత్రమే పాల్గొన్నాడు. అలాంటి ఆర్చర్‌ను ముంబై ఏకంగా 8 కోట్ల రూపాయలకు వేలంలో కొనుగోలు చేసింది. దీంతో అంతా ఆశ్చర్యపోయారు. సీజన్‌లో ఆడని ఆటగాడిని కోసం అన్ని కోట్లకు కొనుగోలు చేయడం అవసరమా అని ప్రశ్నించారు. కానీ అసలు విషయం తెలుసుకుని నోరేళ్ల బెడుతున్నారు. అది ఏంటంటే ఒక వేళ గాయం కారణంగా ఈ లీగ్ మొత్తానికి ఆర్చర్ దూరం అయితే అతనికి ఒక్క రూపాయి కూడా డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదు. అలాగే తర్వాతి సంవత్సరానికి వేలంలోకి పోకుండా తమ జట్టుకే వస్తాడు. ఈ ఉద్దేశ్యంతో ధర ఎక్కువైనా సరే చెల్లించి 8 కోట్ల రేపాయలకు ఆర్చర్‌ను ముంబై కొనుగోలు చేసింది. ఇక జోఫ్రా ఆర్చర్ సత్తా గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అందుకే అలాంటి స్టార్ ఆటగాడిని వదులు కోకూడదనే ముంబై ముందు చూపుతో కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. దీంతో ముంబై యజమాన్యం ముందు చూపుతో వ్యవహరించిందని అభిమానులతోపాటు క్రీడా విశ్లేషకులు ప్రశంసలు కురిపిస్తున్నారు.
అలాగే తొలి రోజు పెదగా ఆటగాళ్లను కొనుగోలు చేయకుండా డబ్బులను రెండో రోజుకు దాచుకుంది. రెండో రోజు కూడా వెంటనే తొందర పడకుండా తాము అనుకున్న ప్లేయర్లు వచ్చే వరకు ముంబై వేచిచూసింది. తాము టార్గెట్ చేసిన ఆటగాళ్లు వచ్చిన వెంటనే కొనుగోలు చేసింది. అప్పటికే ఇతర టీంలతో డబ్బులు కూడా అయిపోవడంతో పెదగా పోటీ రాలేదు. అయితే అనవసరంగా స్టార్లను ఎక్కువగా కొనుగోలు చేయకుండా సాధారణ ఆటగాళ్లనే కొనుగోలు చేయడం గమనార్హం. ఇలాంటి సాధారణ ఆటగాళ్లతోనే గతంలో ట్రోఫీలు కూడా గెలిచింది. సాధారణ ఆటగాళ్లను సైతం తమ జట్టులోకి తీసుకుని స్టార్లుగా మార్చుకోవడం ముంబైకి అలావాటు అని పలువురు అంటున్నారు. దీంతో ఆ జట్టు వ్యూహాలపై అభిమానులు, క్రికెట్ విశ్లేషకులు ప్రశంసలు కురిపిస్తున్నారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications