
బెంగళూరు: ఐపీఎల్ 2022 మెగా వేలంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ మరో ముగ్గురు ఆటగాళ్లను దక్కించుకుంది. కార్తీక్ త్యాగి, శ్రేయస్ గోపాల్, జగదీశ్ సుచిత్‌ను కొనుగోలు చేసింది. 20 లక్షల బేస్ ప్రైజ్‌తో వచ్చిన కార్తీక్ త్యాగిని 4 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసింది. ఇక 20 లక్షల బేస్ ప్రైజ్ ఉన్న శ్రేయస్ గోపాల్‌ను 75 లక్షల రూపాయలకు కొనుగోలు చేసింది. ఇక జగదీశ్ సుచిత్‌ను 20 లక్షల బేస్ ప్రైజ్‌కు దక్కించుకుంది. ఈ ముగ్గురితో కలిపి సన్‌రైజర్స్ హైదరాబాద్ తొలి రోజు 9 మంది ఆటగాళ్లను కొనుగోలు చేసింది. అంతకు ముందు వాషింగ్టన్ సుందర్, భువనేశ్వర్ కుమార్, నికోలస్ పూరన్, నటరాజన్, ప్రియమ్ గార్గ్, అభిషేక్ శర్మను కొనుగోలు చేసింది.
అయితే తొలి రోజు సన్‌రైజర్స్ హైదరాబాద్ కొనుగోలు విధానంలో అనుసరించిన విధానంపై అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. స్టార్ ఆటగాళ్లను వదిలేసి అనామక ఆటగాళ్లను కొనుగోలు చేశారని మండిపడుతున్నారు. అనామక ఆటగాళ్ల కోసం అనవసరంగా కోట్ల రూపాయలు తగేలేశారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అలాగూ ఫాంలో లేని ఆటగాళ్లను కూడా భారీ ధర వెచ్చించి కొనుగోలు చేశారని అంటున్నారు. ఇలా అయితే ఈ సారి లీగ్‌లో నిరాశ తప్పదని చెప్పుకొస్తున్నారు.
కాగా తొలి రోజు వేలంలో టీమిండియా యువ వికెట్ కీపర్ ఇషాన్ కిషన్ అత్యధిక ధర పలికాడు. అతన్ని ముంబై ఇండియన్స్ 15 కోట్ల 25 లక్షల రూపాయలు వెచ్చించి కొనుగోలు చేసింది. 14 కోట్ల రూపాయల ధర పలికి టీమిండియా యువ ఆల్‌రౌండర్ దీపక్ చాహర్ రెండో స్థానంలో ఉన్నాడు. అతన్ని చెన్నైసూపర్ కింగ్స్ 14 కోట్ల రూపాయల భారీ ధర వెచ్చించి కొనుగోలు చేసింది. ఇక మూడో స్థానలో శ్రేయస్ అయ్యర్ ఉన్నాడు. అయ్యర్‌ను కోల్‌కతా నైట్ రైడర్స్ 12 కోట్ల 25 లక్షల రూపాయలకు కొనుగోలు చేసింది. హసరంగను 10 కోట్ల రూపాయలకు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, హర్షల్ పటేల్‌ను 10 కోట్ల 75 లక్షల రూపాయలకు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు కొనుగోలు చేసింది.