Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IPL 2022: అయ్యో ఎంత ప‌ని చేశావు కోహ్లీ.. నీ వ‌ల్ల నీ ఫ్యాన్‌కు గ‌ర్ల్ ఫ్రెండ్ దూర‌మైపోయిందిగా!

IPL 2022: Fan placard reveals that girl friend left him due to Virat Kohli in KKR vs RCB match

టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీకి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌వ‌స‌రం లేదు. కోహ్లీ ఆడుతున్నాడంటే మైదానం అభిమానుల కేరింత‌ల‌తో మార్మిగిపోతుంది. అభిమానులంతా టీవీల‌కు అతుక్కుపోతారు. అయితే తాజాగా విరాట్ కోహ్లీ వ‌ల్ల ఓ అభిమానికి తీర‌ని క‌ష్టం వ‌చ్చిప‌డింది. అది మామూలు క‌ష్టం కూడా కాదండోయ్‌. కోహ్లీ వ‌ల్ల ఏకంగా అత‌ని గ‌ర్ల్ ఫ్రెండే దూర‌మైపోయింది. ఈ విష‌యాన్ని స‌ద‌రు అభిమాను మైదానంలో ప్ల‌కార్డు ప్ర‌ద‌ర్శించి మ‌రి బ‌య‌ట‌పెట్ట‌డం గ‌మ‌నార్హం. కోల్‌క‌తా నైట్ రైడ‌ర్స్‌, రాయ‌ల్ చాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు మ‌ధ్య జ‌రిగిన మ్యాచ్‌లో ఓ అభిమాని ఒక ప్ల‌కార్డుతో క‌నిపించాడు. ఆ ప్లకార్డుపై ''నా గ‌ర్ల్‌ఫ్రెండ్ న‌న్ను వ‌దిలేసింది. ఎందుకంటే నేను త‌న కంటే కోహ్లీకే ఎక్కువ స‌మయం కేటాయిస్తున్నాన‌ని వ‌దిలేసింది.'' అని రాసి ఉంది. ప్ర‌స్తుతం ఈ ప్ల‌కార్డు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. దీనిపై నెటిజ‌న్లు ర‌క‌ర‌కాలుగా స్పందిస్తున్నారు.

ఇక ఆ మ్యాచ్ విష‌యానికొస్తే కోల్‌క‌తా నైట్ రైడ‌ర్స్‌పై రాయ‌ల్ చాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు విజ‌యం సాధించింది. చివ‌రి వ‌ర‌కు ఉత్కంఠగా సాగిన ఈ లోస్కోరింగ్ మ్యాచ్‌లో బెంగ‌ళూరు 3 వికెట్ల తేడాతో గెలిచింది. మొద‌ట బ్యాటింగ్ చేసిన కోల్‌క‌తా నైట్ రైడ‌ర్స్.. రాయ‌ల్ చాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు బౌల‌ర్ల ధాటికి 128 ప‌రుగుల‌కు ఆలౌటైంది. అనంత‌రం 129 ప‌రుగుల ల‌క్ష్యాన్ని బెంగ‌ళూరు మ‌రో 4 బంతులు మిగిలి ఉండ‌గానే 7 వికెట్లు కోల్పోయి చేధించింది. 4 కీల‌క వికెట్లు తీసి ఆర్సీబీ విజ‌యంలో కీల‌క పాత్ర పోషించిన హ‌స‌రంగ‌కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు ద‌క్కింది.

IPL 2022: Fan placard reveals that girl friend left him due to Virat Kohli in KKR vs RCB match

ఆర్సీబీ పూర్తి జ‌ట్టు
విరాట్ కోహ్లి, గ్లెన్ మాక్స్‌వెల్, మహ్మద్ సిరాజ్, ఫాఫ్ డు ప్లెసిస్, హర్షల్ పటేల్, వనిందు హసరంగా, దినేష్ కార్తీక్, జోష్ హేజిల్‌వుడ్, షాబాజ్ అహ్మద్, అనుజ్ రావత్, ఆకాశ్ దీప్, మహిపాల్ లొమ్రోర్, ఫిన్ అలెన్, షెర్ఫాన్ రూథర్‌ఫోర్డ్, జాసన్ బెహ్రాయ్, ప్రహూద్ సుబ్రాయ్, మిలింద్, అనీశ్వర్ గౌతమ్, కర్ణ్ శర్మ, డేవిడ్ విల్లీ, లువ్నిత్ సిసోడియా, సిద్ధార్థ్ కౌల్.

Story first published: Friday, April 1, 2022, 18:25 [IST]
Other articles published on Apr 1, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+