For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ప్రతిసారీ సెంచరీ చేయాలని నా కూతుళ్లు సతాయిస్తారు: చేయకపోతే టార్చర్ పెడతారు: డేవిడ్ వార్నర్

IPL 2022: Every time I walk to bat, my daughters expect a hundred from me, says DCs David Warner

క్యాన్‌బెర్రా: రెండునెలల పాటు క్రికెట్ ప్రపంచాన్ని ఉర్రూతలూగించిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2022 సీజన్.. 15 ఎడిషన్ చివరి దశకు వచ్చేసింది. ఆదివారం నాడు అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరిగే ఫైనల్స్‌తో ఈ టోర్నమెంట్ ముగుస్తుంది. విజేత ఎవరనేది ఉత్కంఠతను రేపుతోంది. టైటిల్ కోసం ప్రస్తుతానికి మూడు జట్లు రేసులో ఉన్నాయి. ఇవ్వాళ జరిగే రెండో క్వాలిఫయర్‌తో ఈ మూడింట్లో ఓ జట్టు ఇంటిదారి పడుతుంది. ఇప్పటికే ఫైనల్స్ చేరిన గుజరాత్ టైటాన్స్‌ ప్రత్యర్థి ఎవరనేది ఈ రాత్రికి స్పష్టమౌతుంది.

రెండో క్వాలిఫయర్‌లో రాజస్థాన్ రాయల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తలపడనున్న విషయం తెలిసిందే. ఫైనల్స్ చేరడానికి ఈ రెండూ కఠోరంగా శ్రమించాయి. నెట్స్‌లో ప్రాక్టీస్ చేశాయి. రాయల్ ఛాలెంజర్స్- ఒక్కసారి కూడా టైటిల్‌ను గెలవలేదు. ఐపీఎల్ ఆరంభం నుంచీ ఆడుతున్నప్పటికీ టైటిల్ మాత్రం అందని ద్రాక్షగా మారింది ఆర్సీబీకి. ఐపీఎల్ తొలి సీజన్‌లో ఛాంపియన్‌గా నిలిచింది రాజస్థాన్ రాయల్స్. అప్పటి నుంచి మరోసారి టైటిల్‌ను ముద్దాడే అవకాశం రాలేదు.

ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్, ఢిల్లీ కేపిటల్స్, కోల్‌కత నైట్‌రైడర్స్ వంటి డిఫెండింగ్ ఛాంపియన్ జట్లన్నీ ప్లేఆఫ్స్ కూడా చేరకుండానే ఇంటిదారి పట్టాయి. ఢిల్లీ కేపిటల్స్ చివరి వరకూ శ్రమించినప్పటికీ.. ప్లేఆఫ్స్‌లో మాత్రం ఎంట్రీ ఇవ్వలేకపోయింది. లీగ్ దశలో తన చివరి మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ చేతిలో ఓటమిపాలు కావడంతో ప్లేఆఫ్స్ ద్వారాలు మూసుకుపోయాయి. ఢిల్లీకి బదులుగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ప్లేఆఫ్స్‌ చేరింది. రెండో క్వాలిఫయర్ వరకూ వెళ్లింది.

IPL 2022: Every time I walk to bat, my daughters expect a hundred from me, says DCs David Warner

చివరి లీగ్ మ్యాచ్‌లో డేవిడ్ ఓపెనర్ విఫలం కావడం ఆ జట్టు విజయావకాశాలను దెబ్బతీసిందనడంలో సందేహాలు అక్కర్లేదు. అప్పటివరకూ ప్రతీ మ్యాచ్‌లోనూ 60 ప్లస్ స్కోర్ చేస్తూ వచ్చిన ఈ డాషింగ్ ఓపెనర్- కీలక మ్యాచ్‌లో విఫలం అయ్యాడు. దీని ప్రభావం జట్టు మొత్తం మీదా పడింది. లీగ్ దశ ముగిసిన వెంటనే డేవిడ్ వార్నర్ తన స్వదేశానికి తిరిగి వెళ్లాడు. అక్కడి మీడియాకు తాజాగా ఇంటర్వ్యూ ఇచ్చారు.

కుటుంబ సభ్యులు- ప్రత్యేకించి కూతుళ్లతో తనకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నాడు. వారికి తన బ్యాటింగ్ అంటే ఎంత ఇష్టమో వివరించాడు. తాను బ్యాట్ పట్టుకుని క్రీజ్‌లోకి దిగిన ప్రతీసారీ- సెంచరీ చేయాలని కుమార్తెలు కోరుకుంటారని చెప్పాడు. సెంచరీ చేయలేకపోతే తనను నిలదీస్తారని చెప్పాడు. క్రీజ్‌లోకి దిగిన ప్రతీసారీ సెంచరీ చేయలేమని వారికి వివరించే ప్రయత్నం చేస్తానని, వినిపించుకోరని డేవిడ్ వార్నర్ నవ్వుతూ వ్యాఖ్యానించాడు.

Story first published: Friday, May 27, 2022, 14:44 [IST]
Other articles published on May 27, 2022
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+