
ఆర్సీబీదే విజయం..
'ఆర్సీబీకే విజయవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. వాళ్లకు స్టార్ ప్లేయర్లు ఉన్నారు. ఫాఫ్ డుప్లెసిస్ ఐపీఎల్ రికార్డు ఓసారి చూడండి. ప్లే ఆఫ్స్‌లో అతను మరింతగా రెచ్చిపోతాడు. ఇక విరాట్ కోహ్లీ కూడా గేరు మార్చాడు. అనుభవం కలిగిన ఆర్సీబీ జట్టు ఇలాంటి కీలక మ్యాచ్‌ల్లో ఒత్తిడిని అధిగమించి మంచి ప్రదర్శన నమోదు చేయగలదు. కాబట్టి వాళ్లు గెలుస్తారు.'అని అభిప్రాయపడ్డాడు. ఎలిమినేటర్ మ్యాచ్‌లో గెలిచిన జట్టు క్వాలిఫైయర్-1లో ఓడిన రాజస్తాన్ రాయల్స్‌తో తలపడుతుంది. క్వాలిఫైయర్-2లో గనుక గెలుపొందితే గుజరాత్ టైటాన్స్‌తో పాటు ఫైనల్లో అడుగుపెట్టి టైటిల్ రేసులో నిలుస్తుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే మూడుసార్లు వరుసగా ప్లే ఆఫ్స్ చేరిన ఆర్సీబీ, అరంగేట్రంలోనే అదరగొట్టిన లక్నో విజయంపై కన్నేసింది.

కైఫ్ మాత్రం లక్నోకే..
మరోవైపు మాజీ క్రికెటర్ మహమ్మద్ కైఫ్ మాత్రం లక్నో సూపర్ జెయింట్స్నే విజయం వరిస్తుందని తెలిపాడు. ఏ లెక్కన చూసిన ఆర్సీబీ కంటే లక్నో చాలా బలంగా ఉందని చెప్పాడు. 9 విజయాలతో లక్నో ప్లే ఆఫ్స్ చేరితే.. ఆర్సీబీ 8 విజయాలతో లక్కీగా టోర్నీలో ముందడుగు వేసిందన్నాడు. లక్నోతో పోల్చితే ఆర్సీబీ బౌలింగ్ మరీ బలహీనంగా ఉందన్న కైఫ్.. బ్యాటింగ్‌లో కూడా కేఎల్ రాహుల్, క్వింటన్ డికాక్ సూపర్ ఫామ్‌లో ఉన్నారని తెలిపాడు.
'పేలవ బౌలింగ్‌తో మహమ్మద్ సిరాజ్ కూడా జట్టుకు దూరమయ్యాడు. అతని స్థానంలో జట్టులోకి వచ్చిన కౌల్ ధారళంగా పరుగులిచ్చుకున్నాడు. ఈడెన్ పిచ్‌లో హేజిల్ వుడ్ తప్పా మిగతా బౌలర్లు పెద్దగా ప్రభావం చూపే అవకాశం లేదు.

భారీ స్కోర్ చేస్తేనే..
ఈ మ్యాచ్‌లో విజయం సాధించాలంటే ఆర్సీబీ భారీ స్కోర్ చేయాలి. వీలయినన్నీ ఎక్కువ సిక్సర్లు కొట్టాలి. అప్పుడే ఆర్సీబీ మ్యాచ్ గెలిచే వీలుంటుంది. ఇది చాలా టఫ్ ఫైట్, అయితే లక్నో బ్యాటింగ్ లైనప్ ను ఏమాత్రం తక్కువ అంచనా వేయలేం. లక్నో ఓపెనర్లు రాహుల్, క్వింటన్ డి కాక్ మంచి భీకర ఫామ్‌లో ఉన్నారు. కాబట్టి ఆర్సీబీ వారిద్దరిని అడ్డుకట్ట వేయడానికి ఇంకా కష్టపడాలి. అది జరగాలంటే విరాట్ ఫామ్ కొనసాగించడంతో పాటు మ్యాక్సీ ధాటిగా ఆడాలి'అని కైఫ్ పేర్కొన్నాడు.