హైదరాబాద్: ఐపీఎల్ 2022 సీజన్ టైటిల్‌కు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) రెండు అడుగుల దూరంలో నిలిచింది. గత రెండేళ్లు 'ఎలిమినేటర్' మ్యాచ్‌లోనే ఓడి భంగపడిన బెంగళూరు ఈసారి ఆ గండాన్ని దాటింది. బుధవారం జరిగిన పోరులో లక్నో సూపర్ జెయింట్స్‌ను 14 పరుగుల తేడాతో ఓడించి ముందంజ వేసింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఆర్సీబీ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 207 పరుగులు చేసింది. 'ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్' రజత్ పటిదార్ (54 బంతుల్లో 12 ఫోర్లు, 7 సిక్స్‌లతో 112 నాటౌట్) అజేయ శతకంతో చెలరేగగా.. దినేశ్ కార్తీక్ (23 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్‌తో 37 నాటౌట్) మెరుపులు మెరిపించాడు.
‘ఓడిపోయినందుకు సిగ్గుండాలి. కడుపుకు అన్నం తింటున్నారా? గడ్డి తింటున్నారా? క్యాచ్‌లు వదలవద్దని ఒక్కొక్కడికి ముద్దుగా చెప్పాను. ’-గంభీర్#IPL2022 #gautamgambhir #KLRahul pic.twitter.com/Ov4gD32PEZ
— uppala shivaprasad (@shivauppala93) May 26, 2022
అనంతరం లక్నో 20 ఓవర్లలో 6 వికెట్లకు 193 పరుగులకే పరిమితమై టోర్నీ నుంచి నిష్క్రమించింది. కేఎల్ రాహుల్ (58 బంతుల్లో 3 ఫోర్లు, 5 సిక్స్‌లు 79), దీపక్ హుడా (26 బంతుల్లో 1 ఫోర్, 4 సిక్స్‌లతో 45) రాణించినా ఫలితం లేకపోయింది. ఆర్సీబీ బౌలర్లు హర్షల్ పటేల్, హజెల్ వుడ్లు అద్భుత బౌలింగ్‌తో విజయాన్నందించారు. 18వ ఓవర్లో డేంజరస్ మార్కస్ స్టోయినిస్‌ను హర్షల్ పటేల్ ఔట్ చేయగా.. 19వ ఓవర్ వేసిన హజెల్ వుడ్ వరుస బంతుల్లో కేఎల్ రాహుల్, కృనాల్ పాండ్యాలను ఔట్ చేసి మ్యాచ్‌ను మలుపుతిప్పాడు.
అయితే ఈ మ్యాచ్ అనంతరం లక్నో సూపర్ జెయింట్స్ మెంటార్ గౌతమ్ గంభీర్.. తమ కెప్టెన్ కేఎల్ రాహుల్‌తో మాట్లాడాడు. మ్యాచ్ జరుగుతున్నంత సేపు తమ ఆటగాళ్ల ప్రదర్శన పట్ల అసంతృప్తిగా ఉన్న గంభీర్.. ఓటమితో తీవ్ర నిరాశకు గురయ్యాడు. రాహుల్‌తో కూడా చాలా విచారకరంగా మాట్లాడాడు. అయితే రాహుల్‌తో మాట్లాడుతున్న ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. ఈ ఫొటోలో గంభీర్... రాహుల్‌కు చివాట్లు పెడుతున్నట్లుగా కనిపిస్తోంది. దాంతో నెటిజన్లు ఫన్నీ క్యాప్షన్స్తో నవ్వులు పూయిస్తున్నారు. 'ఓడిపోయినందుకు సిగ్గుండాలి. కడుపుకు అన్నం తింటున్నారా? గడ్డి తింటున్నారా? క్యాచ్‌లు వదలవద్దని ఒక్కొక్కడికి ముద్దుగా చెప్పాను'అని గంభీర్ చివాట్లు పెడుతున్నాడని క్యాప్షన్ ఇస్తున్నారు.