ఆక్షన్‌లో పట్టించుకోలేదు..ఇప్పుడు బొట్టు పెట్టి మరీ పిలిచారు: రోహిత్ సేనలో చేరిన కొత్త పేసర్

ముంబై: ఐపీఎల్ 2022 సీజన్.. ముంబై ఇండియన్స్‌కు కలిసి రావట్లేదు. అన్నీ అపజయాలే. ఏ ఒక్క మ్యాచ్‌లోనూ గెలవలేదు. అత్యంత అవమానకరంగా ఓడిపోతూ వస్తోంది. అయిదు సార్లు ఛాంపియన్ ఆవిర్భవించి- మోస్ట్ సక్సెస్‌ఫుల్ టీమ్‌గా గుర్తింపు పొందిన ఈ జట్టు.. ఇప్పుడు తన మనుగడ కోసం పోరాడాల్సిన దుస్థితిని ఎదుర్కొంటోంది. ప్లేఆఫ్స్‌కు చేరకుండానే ఇంటిముఖం పట్టడం దాదాపుగా ఖాయమైంది.

జీరో పాయింట్లతో..
ఇప్పటివరకు ఆడిన ఎనిమిది మ్యాచ్‌లల్లో ఒక్కదాంట్లోనూ గెలవలేదు. ఎనిమిదికి ఎనిమిదీ ఓడిపోయింది. పాయింట్ల పట్టికలో అట్టుడుగు స్థానంలో నిలిచింది. ముంబై ఇండియన్స్ పరాజయాల్లో బ్యాటర్ల పాత్ర ఎంత ఉందో.. బౌలర్ల రోల్ కూడా అంతే ఉందనడంలో సందేహాలు అక్కర్లేదు. బౌలింగ్ వెన్నుముక జస్‌ప్రీత్ బుమ్రా చేతులెత్తేశాడు. బౌలింగ్ గతి తప్పింది. డెత్ ఓవర్లలో పరుగులను అదుపు చేయట్లేదు. యార్కర్లు పడట్లేదు. ఎనిమిది మ్యాచ్‌లల్లో అతను పడగొట్టింది అయిదంటే అయిదు వికెట్లే. 229 పరుగులను ప్రత్యర్థులు పిండుకున్నారు.

బౌలర్ల వైఫల్యం..
జయదేవ్ ఉనద్కత్ పరిస్థితీ ఇంతే. అయిదు మ్యాచ్‌లను ఆడిన అతను ఆరు వికెట్లే తీసుకున్నాడు. 190 పరుగులను సమర్పించుకున్నాడు. చెన్నైతో జరిగిన మ్యాచ్‌లో చివరి ఓవర్‌లో 17 పరుగులను నియంత్రించలేకపోయాడు జయదేవ్ ఉనద్కత్. మహేంద్ర సింగ్ ధోనీ బ్యాటింగ్ ప్రతాపానికి బలయ్యాడు.
ఆ ఓవర్‌లో స్కోర్ కంట్రోల్ చేసి ఉంటే.. బహుశా ఆ ఒక్క మ్యాచ్ అయినా మిగిలేది. ఈ ఇద్దరితో ఇక డేనియల్ సామ్స్ పోటీ పడుతున్నాడు. అయిదు మ్యాచ్‌లల్లో 209 పరుగులు ఇచ్చి.. అయిదు వికెట్లే పడగొట్టాడు.

బౌలింగ్ బలోపేతం కోసం..
టైమల్ మిల్స్ కూడా అయిదు మ్యాచ్‌ల్లో అయిదు వికెట్లే తీసుకున్నాడు. 152 పరుగులు ఇచ్చాడు. బాసిల్ థంపీ, రిలే మెరెడిత్ కూడా పెద్దగా ప్రభావాన్ని చూపట్లేదు. ఈ పరిణామాల మధ్య ముంబై ఇండియన్స్ కీలక నిర్ణయాన్ని తీసుకుంది. ముంబై రంజీ ట్రోఫీ ప్లేయర్ ధవల్ కులకర్ణిని జట్టులోకి తీసుకుంది. ముంబై ఇండియన్స్‌తో కలిసి ఆడిన అనుభవం ధవల్ కులకర్ణికి ఉంది. రాజస్థాన్ రాయల్స్, గుజరాత్ లయన్స్ ఫ్రాంఛైజీలకూ ప్రాతినిథ్యాన్ని వహించాడీ 33 సంవత్సరాల వయస్సున్న వెటరన్ ఫాస్ట్ బౌలర్.

92 ఐపీఎల్ మ్యాచ్‌లల్లో..
2020లో 75 లక్షల రూపాయలకు ముంబై ఇండియన్స్ అతణ్ని జట్టులోకి తీసుకుంది. గత సంవత్సరం కూడా అతను ముంబైలోనే కనిపించాడు. ఒక్క మ్యాచ్ మాత్రమే ఆడాడు. ప్రస్తుతం కామెంటేటర్‌గా వ్యవహరిస్తున్నాడు. మొత్తంగా 92 ఐపీఎల్ మ్యాచ్‌లను ఆడిన ధవల్ కులకర్ణి 86 వికెట్లను పడగొట్టాడు. 14 పరుగులు ఇచ్చి నాలుగు వికెట్లు తీసుకోవడం అతని బెస్ట్ బౌలింగ్ ఫిగర్. అతణ్ని టీమ్‌లోకి తీసుకోవడానికి కేప్టెన్ రోహిత్ శర్మ ఆసక్తిగా ఉన్నాడని, ఫ్రాంఛైజీని ఒప్పించాడనీ అంటున్నారు.

ముంబై పిచ్‌లపై పట్టు..
ధవల్ కులకర్ణి ముంబై ఇండియన్స్ జట్టుతో చేరాడు. ప్రస్తుతం బయో బబుల్‌లో ఉంటున్నాడు. మూడు రోజుల క్వారంటైన్ కాలాన్ని అతను పూర్తి చేసుకోవాల్సి ఉంది. దీని తరువాత అతను తుదిజట్టు కోసం అందుబాటులోకి వస్తాడు. ముంబై స్టేడియం పిచ్‌లపై అతనికి మంచి గ్రిప్ ఉండటం, రంజీల్లో నిలకడగా రాణిస్తోండటాన్ని దృష్టిలో ఉంచుకుని రోహిత్ శర్మ ధవల్ కులకర్ణిని జట్టులోకి తీసుకోవడానికి ఆసక్తి చూపాడు. తన మాట నెగ్గించుకున్నాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications