
ఐపీఎల్ 2022లో నేడు కోల్‌కతా నైట్ రైడర్స్, ఢిల్లీ క్యాపిటల్స్ తలపడనున్నాయి. బ్రబోర్న్ స్టేడియం వేదికగా రాత్రి 7:30 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభంకానుంది. ఇప్పటివరకు ఈ సీజన్‌లో 4 మ్యాచ్‌లు ఆడిన కోల్‌కతా నైట్‌రైడర్స్ 3 విజయాలతో పాయింట్ల పట్టికలో అగ్ర స్థానంలో ఉంది. ఇక ఇప్పటివరకు 3 మ్యాచ్‌లాడిన ఢిల్లీ క్యాపిటల్స్ ఒక విజయంతో పాయింట్ల పట్టికలో ఏడో స్థానంలో ఉంది. అయితే ఈ లీగ్‌లో ఇప్పటివరకు ఈ రెండు జట్లు తలపడిన మ్యాచ్‌ల్లో ఎవరిది పై చేయి అయిందనేది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది.
ఐపీఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ ఇప్పటివరకు 29 మ్యాచ్‌ల్లో తలపడ్డాయి. అయితే ఇందులో కోల్‌కతాదే పై చేయిగా ఉంది. కోల్‌కతా 16 మ్యాచ్‌ల్లో విజయం సాధించగా.. ఢిల్లీ 12 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. ఓ మ్యాచ్‌ల్లో ఫలితం తేలలేదు. ఇక ఇరు జట్లు తలపడినప్పుడు ఓ మ్యాచ్‌లో అత్యధికంగా కోల్‌కతా 210 పరుగులు చేయగా.. ఢిల్లీ 228 పరుగులు చేసింది. ఇక అత్యల్పంగా కోల్‌కతా 97 పరుగులు, ఢిల్లీ 98 పరుగులు చేసింది. చివరి 5 మ్యాచ్‌ల్లో కోల్‌కతా 3, ఢిల్లీ రెండిట్లో విజయం సాధించాయి.
కోల్‌కతా నైట్ రైడర్స్ స్క్వాడ్: శ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్), సామ్ బిల్లింగ్స్ (వికెట్ కీపర్), అజింక్యా రహానే, వెంకటేష్ అయ్యర్, నితీష్ రానా, ఆండ్రీ రస్సెల్, సునీల్ నరైన్, పాట్ కమిన్స్, ఉమేష్ యాదవ్, రసిఖ్ సలామ్, వరుణ్ చక్రవర్తి, టిమ్ సౌతీ, ఆరోన్ ఎఫ్ నజిన్‌బిచ్, ఆరోన్ ఎఫ్. , షెల్డన్ జాక్సన్, చమికా కరుణరత్నే, బాబా ఇంద్రజిత్, రింకూ సింగ్, అనుకుల్ రాయ్, శివమ్ మావి, ప్రథమ్ సింగ్, అభిజీత్ తోమర్, అమన్ హకీమ్ ఖాన్, అశోక్ శర్మ, రమేష్ కుమార్
ఢిల్లీ క్యాపిటల్స్ స్క్వాడ్: రిషబ్ పంత్ (కెప్టెన్ & వికెట్ కీపర్), పృథ్వీ షా, డేవిడ్ వార్నర్, రోవ్‌మన్ పావెల్, సర్ఫరాజ్ ఖాన్, లలిత్ యాదవ్, అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్, ముస్తాఫిజుర్ రెహమాన్, అన్రిచ్ నార్ట్జే, మన్‌దీప్ సింగ్, శ్రీకర్ భరత్, టిమ్ సీఫెర్ట్, ఎల్. ఎన్గిడి, అశ్విన్ హెబ్బార్, ప్రవీణ్ దూబే, ఖలీల్ అహ్మద్, కమలేష్ నాగర్‌కోటి, చేతన్ సకారియా, రిపాల్ పటేల్, యష్ ధుల్, విక్కీ ఓస్త్వాల్