
ఐపీఎల్ 2022లో తొలి సారి కరోనా కలకలం రేగింది. ఢిల్లీ క్యాపిటల్స్ ఫిజియో పాట్రిక్ ఫర్‌హార్ట్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్దారణ అయింది. ఈ విషయాన్ని ఢిల్లీ క్యాపిటల్స్ మేనేజ్‌మెంట్, బీసీసీఐ అధికారికంగా ధృవికరించాయి. ప్రస్తుతం పాట్రిక్ ఫర్‌హార్ట్‌ను క్వారంటైన్‌కు తరలించారు. అతనితో సన్నిహితంగా ఉన్నవారందరికీ కరోనా పరీక్షలు నిర్వహించగా వారందరికీ నెగెటివ్ ఫలితం వచ్చింది. దీంతో ఢిల్లీ క్యాపిటల్స్ మేనేజ్‌మెంట్ ఊపిరి పీల్చుకుంది. 4 మ్యాచ్‌ల్లో 2 విజయాలతో ప్రస్తుతం పాయింట్ల పట్టికలో ఏడో స్థానంలో ఉన్న ఢిల్లీ క్యాపిటల్స్ శనివారం రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో తలపడనుంది.
కాగా రెండు సంవత్సరాలుగా ఐపీఎల్‌ను కరోనా ఇబ్బంది పెడుతుంది. 2020లో కరోనా కేసులు భారత్‌లో ఎక్కువగా ఉండడంతో ఆ సీజన్ మొత్తాన్ని బీసీసీఐ యూఏఈలో నిర్వహించింది. ఇక 2021లో లీగ్ స్టేజ్‌లో 29 మ్యాచ్‌లు ముగిశాక పలువురు ఆటగాళ్లకు కరోనా సోకింది. కరోనా సోకిన వారిలో వరుణ్ చక్రవర్తి, సందీప్ వారియర్, వృద్ధిమాన్ సాహా, అమిత్ మిశ్రా ఉన్నారు. దీంతో చేసేదేమి లేక ఐపీఎల్ 2021ను బీసీసీఐ అర్ధాంతరంగా నిలిపివేసింది. తర్వాత యూఏఈ వేదికగా మిగతా టోర్నీని నిర్వహించింది. ఇలాంటి ఫలితాలతో అనేక తర్జనభర్జనల నడుమ బీసీసీఐ ఈ సారి ఐపీఎల్‌ను భారత్‌లో నిర్వహిస్తోంది. అది కూడా మహారాష్ట్రలోని 4 వేదికలకే పరిమితం చేసింది. అలాగే అనేక కఠిన నిబంధనలను విధించింది. ఎన్నో జాగ్రత్తలు తీసుకుంది. స్టేడియాల్లోకి ప్రేక్షకులను కూడా పూర్తిగా అనుమతించడం లేదు. అయినప్పటికీ ఢిల్లీ జట్టులో కరోనా సోకడం ఆందోళన కల్గిస్తుంది.
ఢిల్లీ క్యాపిటల్స్ పూర్తి స్క్వాడ్
రిషబ్ పంత్, అక్షర్ పటేల్, పృథ్వీ షా, అన్రిచ్ నార్ట్జే, డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్, శార్దూల్ ఠాకూర్, ముస్తాఫిజుర్ రెహమాన్, కుల్దీప్ యాదవ్, అశ్విన్ హెబ్బార్, అభిషేక్ శర్మ, కమలేష్ నాగర్‌కోటి, కేఎస్ భరత్, మన్‌దీప్ సింగ్, ఖలీల్ సద్కావ్, చేతన్ యాడ్కావ్, చేతన్ యాహ్మద్ , రిపాల్ పటేల్, యష్ ధుల్, రోవ్‌మన్ పావెల్, ప్రవీణ్ దూబే, లుంగి ఎన్‌గిడి, విక్కీ ఓస్త్వాల్, సర్ఫరాజ్ ఖాన్.