
ఢిల్లీ క్యాపిటల్స్ ఓపెనర్ పృథ్వీషాపై ఆ జట్టు హెడ్ కోచ్ రికీ పాంటింగ్ ప్రశంసల వర్షం కురిపించాడు. పృథ్వీషా ఆటను పరిశీలిస్తుంటే తన కంటే ఎక్కువ అతనిలోనే టాలెంట్ ఉందని అనిపిస్తుందని ఆయన కొనియాడాడు. దూకుడుగా ఆడడంలో పృథ్వీషా ఏ మాత్రం వెనుకాడడం లేదని చెప్పాడు. పృథ్వీ షాలో మంచి ప్రతిభ ఉందని, అతను టీమిండియా కోసం కనీసం 100 టెస్టు మ్యాచ్‌లైనా ఆడాలని కోరుకుంటున్నట్లు తెలిపాడు. పృథ్వీ షాను దేశానికి ప్రాతినిధ్యం వహించే ఆటగాడిలా మార్చాలనేదే తన కోరిక అని, కోచ్‌గా తనకు అదొక్కటే ఆనందాన్ని ఇస్తుందని పాంటింగ్ పేర్కొన్నాడు. కాగా ఈ ఐపీఎల్ సీజన్‌లో పృథ్వీషా చెలరేగుతున్నాడు. ఆరంభం నుంచే ధాటిగా పరుగులు చేస్తున్నాడు. ఈ క్రమంలో ఇప్పటివరకు 2 హాఫ్ సెంచరీలతో 160 పరుగులు చేశాడు.
టీ20 లీగ్‌లో కోచ్‌గా బాధ్యతలు చేపట్టడమంటే జాతీయ జట్టుకు ఆటగాళ్లను తయారు చేయడంగానే తాను భావిస్తానని పాంటింగ్ వెల్లడించాడు. గతంలో తాను ముంబై ఇండియన్స్ జట్టుకు హెడ్ కోచ్‌గా ఉన్నప్పుడు కూడా ఇదే చేశానని ఆయన చెప్పాడు. ఆ సమయంలో జట్టులో రోహిత్ శర్మ యువ ఆటగాడని, హార్దిక్ పాండ్యా, కృనాల్ పాండ్యా అప్పటికి ఇంకా జట్టులోకి రాలేదని నాటి సంగతులను పాంటింగ్ గుర్తు చేసుకున్నాడు. తాను ముంబైకి కోచ్‌గా వ్యవహరించిన తర్వాత ఆ జట్టులోని చాలా మంది ఆటగాళ్లు జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించారని తెలిపాడు. తాము కోచింగ్ ఇచ్చిన ఆటగాళ్లు అంతర్జాతీయ క్రికెట్‌లో ఉత్తమ ఆటగాళ్లుగా ఎదిగారనేది కోచ్‌లకు ఆనందాన్ని ఇస్తుందని పాంటింగ్ చెప్పుకొచ్చాడు. కాగా ఐపీఎల్‌లో ప్రస్తుతం పాంటింగ్ ఢిల్లీ క్యాపిటల్స్‌కు కోచ్‌గా వ్యవహరిస్తున్నాడు. పాంటింగ్ కోచింగ్‌లోనే ఢిల్లీ క్యాపిటల్స్ 2020లో ఫైనల్ చేరింది.

ఢీల్లీ క్యాపిటల్స్ పూర్తి జట్టు
రిషబ్ పంత్, అక్షర్ పటేల్, పృథ్వీ షా, అన్రిచ్ నార్ట్జే, డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్, శార్దూల్ ఠాకూర్, ముస్తాఫిజుర్ రెహమాన్, కుల్దీప్ యాదవ్, అశ్విన్ హెబ్బార్, అభిషేక్ శర్మ, కమలేష్ నాగర్‌కోటి, కేఎస్ భరత్, మన్‌దీప్ సింగ్, ఖలీల్ సద్కావ్, చేతన్ యాడ్కావ్, చేతన్ యాహ్మద్ , రిపాల్ పటేల్, యష్ ధుల్, రోవ్‌మన్ పావెల్, ప్రవీణ్ దూబే, లుంగి ఎన్‌గిడి, విక్కీ ఓస్త్వాల్, సర్ఫరాజ్ ఖాన్.