
ఐపీఎల్ 2022 మరో 2 వారాల్లో ప్రారంభంకాబోతుంది. దీంతో జట్లన్నీ మెగా లీగ్ కోసం సిద్దమవుతున్నాయి. అలాగే తమ టీంల అప్‌డేట్‌లను కూడా అందిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే రిషబ్ పంత్ నేతృత్వంలోని ఢిల్లీ క్యాపిటల్స్ ఈ సీజన్‌కు తమ నూతన జెర్సీని విడుదల చేసింది. దీంతో ఢిల్లీ క్యాపిటల్స్ నూతన జెర్సీ ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు తమ అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా నూతన జెర్సీని ఒక వీడియో రూపంలో విడుదల చేసింది. 43 సెకన్లపాటు ఉన్న ఈ వీడియోలో మొత్తం జెర్సీని రివీల్ చేయగా అది అభిమానులను ఆకట్టుకుంటుంది.
జెర్సీపై టైగర్ ప్రింట్‌ను హైలేట్ చేశారు. ప్రాథమికంగా నీలం రంగు ఉండగా.. పై భాగంలో ఉన్న ఎరుపు కూడా ఆకట్టుకుంటుంది. జెర్సీ కింది భాగమంతా నీలం రంగుతో నిండి ఉంది. కాలర్, ఎడమ చేయ్యి భుజంపై ఎరుపు రంగు ఉంది. అలాగే జెర్సీపై సాధారణంగా ఉండే ఫ్రాంచైజీ పేరు, ప్రకటనలకు సంబంధించినవి ఉన్నాయి. గతంతో పోలిస్తే ఈ సారి జెర్సీలో ఎరుపు రంగు మోతాదు పెంచారు. మొత్తానికి ఈ నూతన జెర్సీ ఆకట్టుకుంటుంది.
ఐపీఎల్ 2022 ఈ నెల 26 నుంచి మే 29 వరకు జరగనుంది. దీనికి సంబంధించిన పూర్తి షెడ్యూల్‌ను బీసీసీఐ ఇప్పటికే అధికారికంగా ప్రకటించింది. లీగ్ స్టేజ్‌లో 70 మ్యాచ్‌లు, ప్లేఆఫ్స్‌లో 4 మ్యాచ్‌లతోపాటు కలిపి ఈ లీగ్‌లో మొత్తం 74 మ్యాచ్‌లు జరగనున్నాయి. ఇందుకోసం జట్లు మ్యాచ్‌లు జరగనున్న మహారా: చఏరుకుంటున్నాయి. ఇక ఢిల్లీ క్యాపిటల్స్ తమ తొలి మ్యాచ్‌ను మార్చి 27న ముంబై ఇండియన్స్‌తో ఆడనుంది.
ఢిల్లీ క్యాపిటల్స్ పూర్తి జట్టు
రిషబ్ పంత్, అక్షర్ పటేల్, పృథ్వీ షా, అన్రిచ్ నార్ట్జే, డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్, శార్దూల్ ఠాకూర్, ముస్తాఫిజుర్ రెహమాన్, కుల్దీప్ యాదవ్, అశ్విన్ హెబ్బార్, అభిషేక్ శర్మ, కమలేష్ భరత్ నాగర్‌కోటి, కెఎస్‌ఎల్ ఖ్‌మద్ నగర్‌కోటి , చేతన్ సకారియా, లలిత్ యాదవ్, రిపాల్ పటేల్, యష్ ధుల్, రోవ్‌మన్ పావెల్, ప్రవీణ్ దూబే, లుంగి ఎన్‌గిడి, విక్కీ ఓస్త్వాల్, సర్ఫరాజ్ ఖాన్.