12 డబుల్ హెడర్ మ్యాచ్‌లు
ఈ సారి జట్లను ఐదేసి టీంల చొప్పున రెండు గ్రూపులు విడదీసిన సంగతి తెలిసిందే. ప్రతి జట్టు ఆ టీంలోని మిగతా 4 జట్లతోపాటు అవతలి గ్రూపులో ఎదురుగా ఉన్న టీంతో రెండేసి మ్యాచ్‌లు ఆడనుంది. అలాగే అవతలి గ్రూపులోని మిగతా జట్లతో ఒక్కో మ్యాచ్ చొప్పున ఆడనుంది. ఇలా ప్రతి జట్టు లీగ్ దశలో 14 మ్యాచ్‌ల చొప్పున ఆడనుంది. కాగా ఈ సారి 12 డబుల్ హెడర్ మ్యాచ్‌లు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో అభిమానులంతా తమ ఫెవరేట్ జట్లు ఆడబోయే మ్యాచ్‌ల వివరాలను ఆరాతీస్తున్నారు.

ముంబైతో మొదలు
ఐపీఎల్ 2022లో ఢిల్లీ క్యాపిటల్స్.. ముంబై ఇండియన్స్‌తో తమ జర్నీ మొదలుపెట్టనుంది. మార్చి 27న మధ్యాహ్నం 3:30 గంటలకు బ్రబౌర్న్ వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. ఏప్రిల్ 2న జరిగే రెండో మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్, గుజరాత్ టైటాన్స్‌తో తలపడనుంది. పుణేలోని ఎంసీఏ స్టేడియం వేదికగా రాత్రి 7:30 గంటలకు ఈ మ్యాచ్ మొదలవనుంది. ఇక మూడో మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్‌తో తలపడనుంది. ఏప్రిల్ 7న డివై పాటిల్ స్టేడియం వేదికగా రాత్రి 7:30 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది.

కోల్‌కతా, ఆర్సీబీతో ఎప్పుడంటే..
ఏప్రిల్ 10న నాల్గో మ్యాచ్‌లో కోల్‌కతానైట్‌రైడర్స్‌తో ఢిల్లీ క్యాపిటల్స్ తలపడనుంది. బ్రబౌర్న్ వేదికగా మధ్యాహ్నం 3:30 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. ఏప్రిల్ 16న రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో తలపడనుండా.. వాంఖడే స్టేడియం వేదికగా రాత్రి 7:30 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. ఇది ఐదో మ్యాచ్ కాగా.. ఆరో మ్యాచ్‌లో ఏప్రిల్ 20న పంజాబ్ కింగ్స్‌తో తలపడనుంది. పుణేలోని ఏంసీఏ స్టేడియం వేదికగా రాత్రి 7:30 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. ఇక ఏడో మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్‌తో ఎంసీఏ స్టేడియం వేదికగా తలపడనుంది. ఏప్రిల్ 22న రాత్రి 7:30 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. ఇక్కడితో తొలి 7 మ్యాచ్‌లు ముగియనున్నాయి.

సన్‌రైజర్స్‌తో అప్పుడే
ఇక మిగతా 7 మ్యాచ్‌ల్లో ఏప్రిల్ 28న కోల్‌కతా నైట్ రైడర్స్‌తో ఢిల్లీ క్యాపిటల్స్ వాంఖడే స్టేడియం వేదికగా తలపడనుంది. రాత్రి 7:30 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. మే 1న లక్నో సూపర్ జెయింట్స్‌తో తలపడనుండగా ఈ మ్యాచ్ కూడా వాంఖడేలోనే జరగనుంది. మధ్యాహ్నం 3:30 గంటలకు మ్యాచ్ జరుగుతుంది. మే 5న సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో బ్రబౌర్న్ వేదికగా రాత్రి 7:30 గంటలకు ఢిల్లీ క్యాపిటల్స్ తలపడనుంది. ఇక 8, 11, 16వ తేదీల్లో వరుసగా మూడు మ్యాచ్‌లను ఢిల్లీ క్యాపిటల్స్ డివై పాటిల్ స్టేడియంలోనే ఆడనుంది. వరుసగా చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్, పంజాబ్ కింగ్స్‌తో తలపడనుంది. చెన్నైతో మ్యాచ్ మధ్యాహ్నం 3:30 గంటలకు ప్రారంభం కానుండగా.. మిగతా రెండు రాత్రి 7:30 గంటలకు ప్రారంభంకానుంది.

ముంబైతోనే చివరి పోరు
ఇక లీగ్‌లో తన చివరి మ్యాచ్‌ను ఢిల్లీ క్యాపిటల్స్, ముంబై ఇండియన్స్‌తో ఆడనుంది. మే 21న వాంఖడే వేదికగా రాత్రి 7:30 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. ఇక్కడితో లీగ్ దశలోని ఢిల్లీ క్యాపిటల్స్ 14 మ్యాచ్‌లు పూర్తవుతాయి. కాగా మెగా లీగ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ ఆరంభ మ్యాచ్‌ను, చివరి మ్యాచ్‌ను ముంబై ఇండియన్స్‌తోనే ఆడనుండడం గమనార్హం.


Click it and Unblock the Notifications












