Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IPL 2022: ఢిల్లీకి గుడ్‌న్యూస్‌.. స‌ర్ఫ‌రాజ్ ఖాన్ విధ్వంసం.. గ‌త‌ 12 ఇన్నింగ్స్‌ల్లో 100కిపైగా స‌గ‌టుతో ర‌న్స్

IPL 2022: Delhi Capitals batter Sarfaraz Khan runs in Ranji Trophy 2022 with over 100 + average

మ‌రికొన్ని రోజుల్లోనే ఐపీఎల్ 2022 ప్రారంభం కానున్న నేప‌థ్యంలో ఢిల్లీ క్యాపిట‌ల్స్‌కు అదిరిపోయే న్యూస్ వచ్చింది. మెగా వేలంలో కేవ‌లం 20 ల‌క్ష‌ల రూపాయ‌లు మాత్ర‌మే వెచ్చించి ఆ జ‌ట్టు కొనుగోలు చేసిన స‌ర్ఫ‌రాజ్ ఖాన్ రంజీ ట్రోపీ 2022లో విధ్వంసం సృష్టించాడు. రంజీల్లో స‌ర్ప‌రాజ్ ఖాన్ 122 స‌గ‌టుతో బ్యాటింగ్ చేస్తున్నాడంటే అత‌ని ప్ర‌తాపం ఏ స్థాయిలో కొన‌సాగుతుందో అర్థం చేసుకోవ‌చ్చు.

ఓ ట్రిపుల్, రెండు డ‌బుల్‌

రంజీల్లో స‌ర్ఫ‌రాజ్ ఖాన్ ఆడిన గ‌త 12 ఇన్నింగ్స్‌లో 8 సార్లు 50+ స్కోర్లు సాధించాడు. ఇందులో రికార్డు స్థాయిలో ఓ ట్రిపుల్ సెంచ‌రీ, రెండు డ‌బుల్ సెంచ‌రీలు, రెండు సెంచ‌రీలు, మూడు హాఫ్ సెంచ‌రీలు ఉన్నాయి. ఇందులో మూడు సార్లు ఔటే కాలేదు. అత్య‌ధిక స్కోర్ 301* ఉంది. 391 బంతుల్లో ఈ ప‌రుగులు చేశాడు. ఇక రెండు డ‌బుల్ సెంచ‌రీల్లో ఓ సారి 275 ప‌రుగులు (401 బంతులు), ఓ సారి 226* ప‌రుగులు చేశాడు. 226 ప‌రుగుల‌ను కేవ‌లం 213 బంతుల్లోనే బాదేశాడు.

రెండు సెంచ‌రీలు

రెండు సెంచ‌రీలు

ఇక రెండు సార్లు సెంచ‌రీ మార్క్‌ను అందుకున్నాడు. ఓ ఇన్నింగ్స్‌లో 210 బంతుల్లోనే 177 ప‌రుగులు, 181 బంతుల్లోనే 165 ప‌రుగులు చేశాడు. ఇక హాఫ్ సెంచ‌రీల్లో ఓ సారి 78, ఓ సారి 63, ఓ సారి 71* ప‌రుగులను చేశాడు. మొత్తంగా చివ‌రి 12 ఇన్నింగ్స్‌ల్లో స‌ర్ఫ‌రాజ్ ఖాన్ 122 స‌గ‌టుతో 1471 ప‌రుగులు చేశాడు. స‌ర్ఫ‌రాజ్ ఖాన్ చివ‌రి 12 ఇన్నింగ్స్‌ల్లో స్కోర్లు 71*, 36, 301*, 226*, 25, 78, 177, 6, 275, 63, 48, 165గా ఉన్నాయి.

ఢిల్లీ హ్యాపీ

ఢిల్లీ హ్యాపీ

స‌ర్ఫ‌రాజ్ ఖాన్ విధ్వంసంతో ఐపీఎల్ ఫ్రాంచైజీ ఢిల్లీ క్యాపిట‌ల్స్ ఫుల్ హ్యాపీగా ఉంది. సూపర్ ఫామ్‌లో ఉన్న స‌ర్ఫ‌రాజ్ ఖాన్ రానున్న ఐపీఎల్ 2022లోనూ ఇదే ఆట తీరుతో చెల‌రేగాల‌ని ఆశిస్తోంది. ఐపీఎల్‌లోనూ స‌ర్ఫ‌రాజ్ ఇలాగా ఆడితే ఈ సారి త‌మ‌కు తిరుగు ఉండ‌ద‌ని భావిస్తోంది. కాగా మెగా వేలంలో స‌ర్ఫ‌రాజ్ ఖాన్‌ను ఢిల్లీ క్యాపిట‌ల్స్ 20 ల‌క్ష‌ల రూపాయ‌ల బేస్ ప్రైజ్ ధ‌ర‌కు కొనుగోలు చేసింది. ఐపీఎల్‌లో ఇప్ప‌టివ‌ర‌కు 40 మ్యాచ్‌లు ఆడిన స‌ర్ఫ‌రాజ్ ఖాన్ 23 స‌గ‌టుతో 441 ప‌రుగులు చేశాడు. అత్య‌ధిక స్కోర్ 67 ప‌రుగులుగా ఉన్నాయి.

 ఢిల్లీ పూర్తి జట్టు ఇదిగో

ఢిల్లీ పూర్తి జట్టు ఇదిగో

రిషభ్‌ పంత్ (16 కోట్లు), ఆన్రిచ్ నోర్జే(6.50 కోట్లు), అక్షర్‌ పటేల్‌(9 కోట్లు), పృథ్వీషా(7.50 కోట్లు), మిచెల్ మార్ష్ (6.50 కోట్లు), సయ్యద్ ఖలీల్ అహ్మద్(5.25 కోట్లు), చేతన్‌ సకారియా(4.20 కోట్లు), రోవ్‌మన్‌ పావెల్ ( 2.80 కోట్లు), ముస్తాఫిజర్‌ రెహ్మాన్‌(2 కోట్లు), కుల్‌దీప్‌ యాదవ్(2 కోట్లు), కేఎస్ భరత్ (2 కోట్లు), కమ్‌లేష్ నగర్‌కోటి(1.10 కోట్లు), మన్‌దీప్‌ సింగ్(1.10 కోట్లు), లలిత్‌ యాదవ్( 65 లక్షలు), టిమ్‌ సీఫెర్ట్(రూ. 50 లక్షలు), యాష్ ధుల్(50 లక్షలు), ప్రదీప్‌ దూబే(50 లక్షలు), ఎంగిడి(50 లక్షలు), అశ్విన్‌ హెబ్బర్‌, సర్ఫరాజ్‌ ఖాన్‌, రిపల్‌ పటేల్‌, విక్కీ ఓత్సవాల్‌( వీరంద‌రికీ 20 లక్షలు).

Story first published: Saturday, March 5, 2022, 13:49 [IST]
Other articles published on Mar 5, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+