For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IPL 2022: సీఎస్కే క‌ష్టాలు తీరిన‌ట్టే.. దీప‌క్ చాహ‌ర్ వ‌చ్చేస్తున్నాడు.. ఎప్ప‌టి నుంచి ఆడ‌తాడంటే..

IPL 2022: Deepak Chahar is likely to join the Chennai Super Kings squad by April 25.

ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్‌) 2022లో చెన్నైసూప‌ర్ కింగ్స్ ఇంకా బోణి చేయ‌లేదు. ఇప్ప‌టివ‌ర‌కు ఆడిన రెండు మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. ఆ జ‌ట్టు బౌల‌ర్ల వైఫ‌ల్యంతో గ‌త మ్యాచ్‌లో భారీ స్కోర్‌ను సైతం కాపాడుకోలేక‌పోయింది. అయితే ఈ నేప‌థ్యంలో చెన్నై సూప‌ర్ కింగ్స్ అభిమానుల‌ను సంతోష‌ప‌రిచే వార్త ఒక‌టి బ‌య‌టికి వ‌చ్చింది. అదేటంటే ఆ జ‌ట్టు స్టార్ బౌల‌ర్ దీప‌క్ చాహ‌ర్ గాయం నుంచి కోలుకుని త్వ‌ర‌లోనే సీఎస్కే క్యాంపులో అడుగుపెట్ట‌బోతున్నాడు. ఏప్రిల్ 25న పంజాబ్ కింగ్స్‌తో జ‌రిగే మ్యాచ్ నాటికి దీప‌క్ చాహ‌ర్ అందుబాటులోకి వ‌చ్చే అవ‌కాశాలు ఉన్నాయి. ఆ దిశ‌గా సీఎస్కే మేనేజ్‌మెంట్ సంకేతాలు కూడా ఇచ్చింది. ఇక మ‌రోవైపు దీప‌క్ చాహ‌ర్ ఇప్ప‌టికే ప్రాక్టీస్ కూడా మొద‌లు పెట్టిన‌ట్లు తెలుస్తోంది.

గ‌త సీజ‌న్లో చెన్నై సూప‌ర్ కింగ్స్ ట్రోఫీ గెల‌వ‌డంలో కీల‌క పాత్ర పోషించిన దీప‌క్ చాహ‌ర్‌ను ఈ సారి ఆ జ‌ట్టు మెగా వేలంలో 14 కోట్ల రూపాయ‌ల భారీ ధ‌ర‌కు కొనుగోలు చేసింది. కానీ దుర‌దృష్ట‌వ‌శాత్తూ టోర్నీ ప్రారంభం కావ‌డానికి ముందే చాహ‌ర్ గాయ‌ప‌డ్డాడు. దీంతో అప్ప‌టి నుంచి దీప‌క్ చాహ‌ర్ ఎప్పుడు కోలుకుంటాడా అని అభిమానులు ఎదురు చూస్తున్నారు. ఇక మ‌రోవైపు పంజాబ్ కింగ్స్ నేడు జ‌ర‌గ‌నున్న మ్యాచ్‌లో చెన్నైసూప‌ర్ కింగ్స్ గెలుపే ల‌క్ష్యంగా బ‌రిలోకి దిగుతుంది. ఈ మ్యాచ్‌లో గెలిచి టోర్నీలో బోణీ చేయాల‌ని సీఎస్కే ప‌ట్టుద‌ల‌గా ఉంది.

IPL 2022: Deepak Chahar is likely to join the Chennai Super Kings squad by April 25.

తుది జ‌ట్లు (అంచ‌నా)
చెన్నైసూప‌ర్ కింగ్స్‌: రాబిన్ ఊత‌ప్ప‌, రుతురాజ్ గైక్వాడ్, మొయిన్ అలీ, శివ‌మ్ దూబే, అంబ‌టి రాయుడు, ర‌వీంద్ర జ‌డేజా (కెప్టెన్), మ‌హేంద్ర సింగ్ ధోని (వికెట్ కీప‌ర్), డ్వైన్ ప్రిటోరియస్, డ్వేన్ బ్రావో, తుషార్ పాండే, రాజవర్ధన్ హంగర్గేకర్‌.

పంజాబ్ కింగ్స్‌: మ‌యాంక్ అగ‌ర్వాల్, శిఖ‌ర్ ధావ‌న్, బెయిర్‌స్టో, భానుక రాజ‌ప‌క్స, రాజ్ బవా, షారూక్ ఖాన్‌, హర్‌ప్రీత్ బ్రార్, ఓడియ‌న్ స్మిత్, రాహుల్ చాహ‌ర్, క‌గిసో రబాడ‌, అర్ష్‌దీప్ సింగ్.

Story first published: Sunday, April 3, 2022, 19:03 [IST]
Other articles published on Apr 3, 2022
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+