
సమవుజ్జీ పోరు..
ఈ పరిస్థితుల మధ్య ఇవ్వాళ మరో ఆసక్తికరమైన మ్యాచ్ సాక్షాత్కరించనుంది. పాయింట్ల పట్టికలో సమవుజ్జీగా నిలిచిన ఢిల్లీ కేపిటల్స్, పంజాబ్ కింగ్స్- తలపడనున్నాయి. ఈ సాయంత్రం 7:30 గంటలకు నవీముంబైలోని డీవై పాటిల్ స్పోర్ట్స్ అకాడమీ స్టేడియంలో మ్యాచ్ జరుగనుంది. ఢిల్లీ కేపిటల్స్, పంజాబ్ కింగ్స్‌కు గెలిచి తీరాల్సిన మ్యాచ్ ఇది. ప్రస్తుతం 12 పాయింట్ల చొప్పున సాధించాయి. పాయింట్లల్లో సమానంగా ఉన్నప్పటికీ- పంజాబ్ కింగ్స్ కంటే ఢిల్లీ కేపిటల్స్ కొంత బెటర్ పొజీషన్‌లో ఉంది. నెట్ రన్‌రేట్ కొద్దిగా మెరుగ్గా ఉంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు- 14 పాయింట్లతో ప్లేఆఫ్స్‌కు మరింత చేరువ అవుతుంది.

పృథ్వీ షా అందుబాటులో..
ఢిల్లీ కేపిటల్స్ డాషింగ్ ఓపెనర్ పృథ్వీ షా జట్టుకు అందుబాటులోకి వచ్చాడు. రెండువారాలుగా అతను థైరాయిడ్ సమస్యతో బాధపడ్డాడు. ఆసుపత్రిలో చికిత్స పొందాడు. ఆరోగ్యం కుదుటపడటంతో ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాడు. ప్రస్తుతం ఢిల్లీ కేపిటల్స్ మెడికల్ టీమ్ పర్యవేక్షణలో ఉన్నాడు. పూర్తి ఫిట్‌నెస్‌తో ఉన్నాడనే సమాచారం ఉంది. తుదిజట్టులోకి తీసుకుంటుందా? లేక విశ్రాంతి ఇస్తుందా? అనేది ఇంకా తేలాల్సి ఉంది.

జట్టులో తీసుకోవడంపై
కీలక మ్యాచ్ కావడం వల్ల అతన్ని జట్టులోకి తీసుకోవడానికే కేప్టెన్ రిషభ్ పంత్, హెడ్ కోచ్ రికీ పాంటింగ్ మొగ్గు చూపుతారని అంటున్నారు. అదే జరిగితే తెలుగు కుర్రాడు కేఎస్ భరత్.. స్థానం కోల్పోయినట్టే. ఈ సీజన్‌లో కేఎస్ భరత్‌కు మ్యాచ్‌ను ఆడే అవకాశం దక్కలేదు. రెండు మ్యాచ్‌లు మాత్రమే ఆడాడు. ఎనిమిది పరుగులే చేశాడు. పేస్ బౌలర్ ఖలీల్ కూడా గాయం వల్ల జట్టుకు అందుబాటులో లేకుండాపోయాడు. తొడ కండరాల గాయంతో అతను సతమతమౌతున్నాడు.

చివరి మ్యాచ్‌లో ఘన విజయంతో..
ఢిల్లీ కేపిటల్స్, పంజాబ్ కింగ్స్ ఒకే తరహాలో సాగుతున్నాయి. చివరి అయిదు మ్యాచ్‌లల్లో మూడింట్లో విజయం సాధించాయి. చివరి మ్యాచ్‌లో ఈ రెండూ ప్రత్యర్థిని ఓడించాయి. రాజస్థాన్ రాయల్స్‌ను ఢిల్లీ కేపిటల్స్, రాజస్థాన్ రాయల్స్‌ను పంజాబ్ కింగ్స్ ఓడించాయి. ఆ గెెలుపు ఇచ్చిన ఉత్సాహంతో తలపడనున్నాయి. 12 చొప్పున మ్యాచ్‌లల్లో ఆరు చొప్పున విజయాలను నమోదు చేశాయి.

బ్యాటర్లే కీలకం..
పంజాబ్ కింగ్స్‌లో శిఖర్ ధవన్, జానీ బెయిర్‌స్టో, లియామ్ లివింగ్‌స్టొన్, మయాంక్ అగర్వాల్ వంటి భారీ షాట్లు ఆడే సత్తా ఉన్న బ్యాటర్లు ఉన్నారు. కగిసొ రబడ, షారుఖ్ ఖాన్, హర్‌ప్రీత్ బ్రార్, అర్ష్‌దీప్ సింగ్, రాహుల్ చాహర్, రిషి ధవన్‌తో కూడిన బౌలింగ్ విభాగం బలంగా ఉంది. ఢిల్లీలో డేవిడ్ వార్నర్ ఏ స్థాయిలో ఆడుతున్నాడనేది మనం చూస్తున్నాం. గెలుపుగుర్రంలా మారాడు. ప్రతి మ్యాచ్‌లోనూ 50 ప్లస్ స్కోర్ చేస్తోన్నాడు. మిఛెల్ మార్ష్, రిషభ్ పంత్, రౌమన్ పావెల్, లలిత్ యాదవ్, అక్షర్ పటేల్ భారీ షాట్లను ఆడే సత్తా ఉన్నవారే.

తుదిజట్టు కూర్పు ఇలా..
పంజాబ్ కింగ్స్ తుదిజట్టులో- శిఖర్ ధవన్, జానీ బెయిర్‌స్టో, భానుక రాజపక్స, లియామ్ లివింగ్‌స్టోన్, మయాంక్ అగర్వాల్ (కేప్టెన్), జితేష్ శర్మ (వికెట్ కీపర్), రిషి ధవన్, హర్‌ప్రీత్ బ్రార్, కగిసొ రబడ, రాహుల్ చాహర్, అర్ష్‌దీప్ సింగ్ ఆడటం ఖాయంగా కనిపిస్తోంది. ఢిల్లీ టీమ్‌లో- పృథ్వీ షా/కేఎస్ భరత్, డేవిడ్ వార్నర్, మిఛెల్ మార్ష్, రిషభ్ పంత్ (కేప్టెన్, వికెట్ కీపర్), రౌమన్ పావెల్, లలిత్ యాదవ్, అక్షర్ పటేల్, శార్దుల్ ఠాకూర్, కుల్‌దీప్ యాదవ్, ఎన్రిచ్ నోర్ట్జె, చేతన్ సకారియా తుదిజట్టులో చోటు దక్కించుకోవచ్చు.


Click it and Unblock the Notifications












