Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

DC vs RR Playing 11: రెండింట్లో కీలక మార్పులు: ఆ ఇద్దరికీ రీప్లేస్..తెలుగోడికి ఛాన్స్

IPL 2022, DC vs RR: Jimmy Neesham or Rassie van der Dussen are likely to replace Hetmyer

ముంబై: ఐపీఎల్‌ 2022 సీజన్‌లో భాగంగా ఢిల్లీ కేపిటల్స్.. ఇవ్వాళ కీలక మ్యాచ్ ఆడబోతోంది. సంజు శాంసన్ నాయకత్వంలోని రాజస్థాన్ రాయల్స్‌తో తలపడబోతోంది. నవీముంబైలోని డీవై పాటిల్ స్టేడియంలో ఈ సాయంత్రం 7:30 గంటలకు మ్యాచ్ ఆరంభమౌతుంది. చెన్నై సూపర్ కింగ్స్‌పై ఓటమితో డీలా పడ్డ రిషభ్ పంత్ టీమ్‌కు ఈ మ్యాచ్ గెలవడం అత్యవసరం. ఇందులో గెలిస్తే 12 పాయింట్లతో ప్లేఆఫ్స్ రేసులో నిల్చోగలుగుతుంది. ప్లేఆఫ్స్‌కు రెండడుగుల దూరంలో ఉంది పింక్ టీమ్. ఢిల్లీపై జెండా ఎగురవేస్తే 16 పాయింట్లను సాధిస్తుంది.

ఒక గెలుపు.. ఒక ఓటమి

ఒక గెలుపు.. ఒక ఓటమి

ఈ సీజన్‌లో ఢిల్లీ కేపిటల్స్ ప్రస్థానం ఆశించిన స్థాయిలో సాగట్లేదు. తన చివరి అయిదు మ్యాచ్‌లల్లో మూడింట్లో ఓడింది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో ఆరో స్థానంలో నిలిచిందీ జట్లు. రాజస్థాన్‌తో ఆడిన చివరి మ్యాచ్‌లో ఓడింది ఢిల్లీ. ఆ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ రెండు వికెట్ల నష్టానికి 222 పరుగులు చేయగా.. ఢిల్లీ చివరి వరకూ పోరాడింది. 207 పరుగులు చేయగలిగింది. నో బాల వ్యవహారం తీవ్ర వివాదానికి దారి తీసిన మ్యాచ్ అది. ఆ ఓటమికి ఢిల్లీ పగ తీర్చుకుంటుందా? లేదా అనేది ఈ రాత్రికి తేలిపోతుంది.

దుమ్ము లేపుతున్న వార్నర్

దుమ్ము లేపుతున్న వార్నర్

ఓపెనర్ డేవిడ్ వార్నర్ దమ్ము దులుపుతున్నాడు. తొమ్మిది మ్యాచ్‌లల్లో 375 పరుగులు చేశాడు. నాలుగు హాఫ్ సెంచరీలను నమోదు చేశాడు. రిషభ్ పంత్ నిలకడగా రాణించట్లేదు. అడపా దడపా మాత్రమే సత్తా చాటుతున్నారు. అక్షర్ పటేల్, శార్దుల్ ఠాకూర్, లలిత్ యాదవ్.. తమ ఆల్‌రౌండర్ ప్రతిభను ప్రదర్శించాల్సి ఉంది. మిడిలార్డర్‌లో రౌమన్ పావెల్.. మ్యాచ్ విన్నర్‌గా నిలుస్తున్నాడు. భారీ షాట్లతో బౌలర్లను బెంబేలెత్తిస్తున్నాడు.

పృథ్వీ షాకు రీప్లేస్

పృథ్వీ షాకు రీప్లేస్

ఢిల్లీ కేపిటల్స్ ఇవ్వాళ్టి మ్యాచ్‌కు ఒక్క మార్పుతో బరిలోకి దిగొచ్చు. జ్వరంతో బాధపడుతున్న పృథ్వీ షాకు బదులుగా తెలుగు కుర్రాడు కేఎస్ భరత్‌ను తుదిజట్టులోకి తీసుకునే అవకాశం ఉంది. ఢిల్లీ చివరి రెండు మ్యాచ్‌లో పృథ్వీ షా అందుబాటులో లేడు. జ్వరం నుంచి రికవరీ అవుతున్నానంటూ సోషల్ మీడియా ద్వారా తెలిపాడు. దీన్ని బట్టి చూస్తే ఈ మ్యాచ్‌లో కూడా ఆడటం అనుమానమే. వికెట్ కీపర్ ప్లస్ బ్యాటర్ కేఎస్ భరత్‌తో అతని స్థానాన్ని భర్తీ చెయ్యొచ్చు.

బట్లర్ జోరుకు..

బట్లర్ జోరుకు..

రాజస్థాన్ రాయల్స్ పరిస్థితి ఢిల్లీ కంటే చాలా బెటర్. 11 మ్యాచ్‌లల్లో ఏడింట్లో నెగ్గింది. మొత్తం 14 పాయింట్లతో మూడో స్థానంలో కొనసాగుతోంది సంజు శాంసన్ సేన. ఓపెనర్ జోస్ బట్లర్.. ఆ జట్టు బ్యాటింగ్‌కు వెన్నెముక. ఈ సీజన్‌లో మూడు సెంచరీలు చేశాడంటే- అతని దూకుడు ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. అతని జోరుకు బ్రేకులు వేయాల్సి ఉంటుంది ఢిల్లీ కేపిటల్స్‌కు. మిడిలార్డర్‌లో విధ్వంసం సృష్టించే షిమ్రోన్ హెట్మెయిర్ ఈ మ్యాచ్ ఆడట్లేదు. అతని స్థానంలో జిమ్మి నీషం లేదా రస్సీ వాన్‌డర్ డుస్సెన్‌ను తుదిజట్టులో తీసుకోవచ్చు.

మిడిలార్డర్‌లో హిట్టర్..

మిడిలార్డర్‌లో హిట్టర్..

రాజస్థాన్ రాయల్స్ టాప్ ఆర్డర్, మిడిల్ ఆర్డర్ బలంగా ఉంది. ఓపెనర్ దేవ్‌దత్ విఫలమైతే.. బట్లర్‌తో కలిసి మిగిలిన బ్యాటర్లు జట్టు ఇన్నింగ్‌ను రీ కన్‌స్ట్రక్షన్ చేస్తోన్నారు. సంజు శాంసన్, రియాన్ పరాగ్, ఆల్‌రౌండర్ రవిచంద్రన్ అశ్విన్.. క్రీజ్‌లో నిలదొక్కుకోగలుగుతున్నారు. ఫలితంగా- అంచనాలకు మించి రాణిస్తోంది పింక్ టీమ్. ఈ మ్యాచ్‌లోనూ విజయం సాధించి.. తన ఆధిపత్యాన్ని నిలుపుకోవాలని భావిస్తోంది.

 తుదిజట్టు కూర్పు ఇలా..

తుదిజట్టు కూర్పు ఇలా..

ఢిల్లీ టీమ్‌లో- డేవిడ్ వార్నర్, పృథ్వీ షా/కేెఎస్ భరత్, మిఛెల్ మార్ష్, రిషభ్ పంత్ (కేప్టెన్, వికెట్ కీపర్), రౌమన్ పావెల్, రిపల్ పటేల్/లలిత్ యాదవ్, అక్షర్ పటేల్, శార్దుల్ ఠాకూర్, కుల్‌దీప్ యాదవ్, ఎన్రిచ్ నోర్ట్జె, ఖలీల్ అహ్మద్ తుదిజట్టులో చోటు దక్కించుకోవచ్చు. రాజస్థాన్ రాయల్స్‌లో- యశస్వి జైస్వాల్, జోస్ బట్లర్, సంజు శాంసన్ (కేప్టన్, వికెట్ కీపర్), దేవ్‌దత్ పడిక్కల్, జిమ్మి నీషం/రస్సీ వాన్ డెర్ డుస్సెన్/డెరిల్ మిఛెల్, రవిచంద్రన్ అశ్విన్, ట్రెంట్ బౌల్ట్, ప్రసిద్ధ్ కృష్ణ, యజువేందర్ చాహల్, కుల్‌దీప్ సేన్ ఆడొచ్చు.

Story first published: Wednesday, May 11, 2022, 7:17 [IST]
Other articles published on May 11, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+