Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఇవ్వాళ్టి మ్యాచ్‌లో ఢిల్లీ గెలవాలని ప్రార్థిద్దాం: సన్‌రైజర్స్‌, రాయల్ ఛాలెంజర్స్‌కు అదృష్టం

IPL 2022, DC vs RR: 7 teams including SRH will benefit from Delhi Capitals win tonight against RR

ముంబై: ఐపీఎల్‌ 2022 సీజన్‌లో భాగంగా ఢిల్లీ కేపిటల్స్.. ఇవ్వాళ కీలక మ్యాచ్ ఆడబోతోంది. రాజస్థాన్ రాయల్స్‌తో తలపడబోతోంది. నవీముంబైలోని డీవై పాటిల్ స్టేడియంలో ఈ సాయంత్రం 7:30 గంటలకు మ్యాచ్ ఆరంభమౌతుంది. చెన్నై సూపర్ కింగ్స్‌పై ఓటమితో డీలా పడ్డ రిషభ్ పంత్ టీమ్‌కు ఈ మ్యాచ్ గెలవడం అత్యవసరం. ఇందులో గెలిస్తే 12 పాయింట్లతో ప్లేఆఫ్స్ రేసులో నిల్చోగలుగుతుంది. రాజస్థాన్ రాయల్స్‌కూ ఈ మ్యాచ్ కీలకమే. ప్లేఆఫ్స్‌కు రెండడుగుల దూరంలో ఉంది పింక్ టీమ్. ఢిల్లీపై గెలిస్తే 16 పాయింట్లను సాధిస్తుంది. ప్లేఆఫ్స్‌కు మరింత చేరువ అవుతుంది.

ఒక గెలుపు.. ఒక ఓటమి

ఒక గెలుపు.. ఒక ఓటమి

ఈ సీజన్‌లో ఢిల్లీ కేపిటల్స్ ప్రస్థానం ఆశించిన స్థాయిలో సాగట్లేదు. తన చివరి అయిదు మ్యాచ్‌లల్లో మూడింట్లో ఓడింది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో ఆరో స్థానంలో నిలిచిందీ జట్లు. రాజస్థాన్‌తో ఆడిన చివరి మ్యాచ్‌లో ఓడింది ఢిల్లీ. ఆ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ రెండు వికెట్ల నష్టానికి 222 పరుగులు చేయగా.. ఢిల్లీ చివరి వరకూ పోరాడింది. 207 పరుగులు చేయగలిగింది. నో బాల వ్యవహారం తీవ్ర వివాదానికి దారి తీసిన మ్యాచ్ అది. ఆ ఓటమికి ఢిల్లీ పగ తీర్చుకుంటుందా? లేదా అనేది ఈ రాత్రికి తేలిపోతుంది.

 రాజస్థాన్ గెలిస్తే..

రాజస్థాన్ గెలిస్తే..

ఈ మ్యాచ్‌లో రాజస్థాన్ గెలిస్తే- ప్లేఆఫ్స్‌కు మరింత చేరువ అవుతుంది. 16 పాయింట్లతో లక్నో సూపర్ జెయింట్స్‌తో సమవుజ్జీగా నిలుస్తుంది.ఆ సెకెండ్ స్లాట్ పింక్ టీమ్ వశం అవుతుంది. ప్రస్తుతం ఈ జట్టు పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో ఉంది. గెలిచిన తరువాత పైకి ఎగబాకుతుందా? లేక మూడో స్థానంలోనే కొనసాగుతుందా? అనేది రన్‌రేట్ మీద ఆధారపడి ఉంది. ఆ తరువాత ఇంకొక్క మ్యాచ్ గెలిచినా ఈ రెండు జట్లు కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా నేరుగా ప్లేఆఫ్స్‌కు చేరుకుంటాయి.

ఢిల్లీ గెలిస్తే..

ఢిల్లీ గెలిస్తే..

ఢిల్లీ కేపిటల్స్ గనక గెలిస్తే- రాజస్థాన్ రాయల్స్ ఇంకొద్ది రోజులు ఎదురు చూడక తప్పదు. ఢిల్లీ ఖాతాలో 12 పాయింట్లు చేరుతాయి. ఈ మ్యాచ్‌లో ఓడితే రాజస్థాన్ రాయల్స్ అడ్డు కొంతమేర తొలగినట్టవుతుంది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు. ప్లే ఆఫ్స్‌కు చేరే అవకాశాలు మెరుగుపడతాయి. రాజస్థాన్ గెలిచినా కూడా ఆర్సీబీకి మాత్రం బెనిఫిట్ అవుతుంది. ఢిల్లీ అడ్డు ఉండదు కాబట్టి అది రాయల్ ఛాలెంజర్స్‌కు కలిసి వస్తుంది. పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి చేరే అవకాశాలు ఉంటాయి.

ఢిల్లీ విజయంపై ఏడు జట్లు ఆధారం..

ఢిల్లీ విజయంపై ఏడు జట్లు ఆధారం..

ఢిల్లీ కేపిటల్స్ గెలవడంపై మొత్తం ఏడు జట్లు ఆధారపడి ఉన్నాయి. రాజస్థాన్ రాయల్స్‌ ప్రయాణం ప్రస్తుతానికి 14 పాయింట్ల వద్దే ఆగిపోవడం వల్ల ఢిల్లీ కేపిటల్స్‌తో పాటు పంజాబ్ కింగ్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్, కోల్‌కత నైట్‌రైడర్స్, చెన్నై సూపర్ కింగ్స్‌కు ప్లేఆఫ్స్ అవకాశాలు మెరుగుపడతాయి. సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇంకా మూడు మ్యాచ్‌లను ఆడాల్సి ఉంది. ఆ మూడింట్లో కోల్‌కత నైట్‌రైడర్స్, ముంబై ఇండియన్స్, పంజాబ్ కింగ్స్ ఉన్నాయి. ప్రస్తుతం సన్‌రైజర్స్ ఖాతాలో ఉన్న పాయింట్లు 10. ఈ మూడూ గెలిస్తే 16 పాయింట్లతో ప్లేఆఫ్స్‌కు చేరుకుంటుంది.

Story first published: Wednesday, May 11, 2022, 12:07 [IST]
Other articles published on May 11, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+