For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ప్లేఆఫ్స్‌ ముంగిట్లో మరో ఫ్లాప్ షో: పింక్ టీమ్ పరాజయానికి అయిదు కారణాలివే

IPL 2022, DC vs RR: 5 reasons why Rajasthan Royals lost the match against Delhi Capitals

ముంబై: ఐపీఎల్ 2022 ప్లేఆఫ్స్ ముంగిట్లో లక్నో సూపర్ జెయింట్స్‌ తరహాలోనే మరో టీమ్ పల్టీ కొట్టింది. వరుస విజయాలతో నిలకడగా రాణిస్తోన్న రాజస్థాన్ రాయల్స్.. కీలక మ్యాచ్‌లో తత్తరపడింది. తన ప్రత్యర్థి ఢిల్లీ కేపిటల్స్ చేతిలో ఓటమి పాలైంది. నవీముంబైలోని డీవై పాటిల్ స్పోర్ట్స్ అకాడమీ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో చిత్తయింది. ఎనిమిది వికెట్ల తేడాతో ఢిల్లీ కేపిటల్స్ చేతిలో మట్టి కరిచింది. ఈ మ్యాచ్‌లో ఘన విజయంతో కేపిటల్స్- తన ప్లేఆఫ్స్ ఆశలను సజీవంగా ఉంచుకోగలిగింది. ప్లేఆఫ్స్‌కు చేరుకోవాలంటే కనీసం ఇంకో మ్యాచ్ వరకైనా రాజస్థాన్ రాయల్స్ ఎదురు చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది.

భారీ స్కోరింగ్‌కు స్కోప్ ఉన్నా..

భారీ స్కోరింగ్‌కు స్కోప్ ఉన్నా..

తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న రాజస్థాన్ రాయల్స్.. 20 ఓవర్లల్లో ఆరు వికెట్ల నష్టానికి 160 పరుగులు చేసింది. ఓపెనర్లు జోస్ బట్లర్-యశస్వి జైస్వాల్ భారీ భాగస్వామ్యాన్ని అందించలేకపోయారు.ఫస్ట్‌డౌన్‌లోకి దిగిన రవిచంద్రన్ అశ్విన్.. తన పని తాను చేసుకుంటూ పోయాడు. 38 బంతుల్లో సరిగ్గా అర్ధసెంచరీ చేసి వెనుదిరిగాడు.

దేవ్‌దత్ పడిక్కల్ 48 పరుగులతో రాణించాడు. అయినప్పటికీ ప్రత్యర్థిని భయపెట్టేంత భారీ స్కోర్ మాత్రం చేయలేకపోయింది రాజస్థాన్ రాయల్స్.

జోస్ బట్లర్ త్వరగా అవుట్..

జోస్ బట్లర్ త్వరగా అవుట్..

ఈ సీజన్‌లో అద్భుతంగా రాణిస్తూ.. జోరు మీదున్న జోస్ బట్లర్‌ను త్వరగా పెవిలియన్ దారి పట్టించడంతోనే ఢిల్లీ కేపిటల్స్‌కు సగం విజయం సాధించినట్టయింది. ఏడు పరుగులకే అవుట్ అయ్యాడీ ఆరెంజ్ క్యాప్‌ధారి. హాఫ్ వ్యాలీగా లెగ్‌స్టంప్ మీదికి సకారియా సంధించిన మూడో ఓవర్ అయిదో బంతి జోస్ బట్లర్‌ను బలి తీసుకుంది. మిడాన్ మీదుగా షాట్ ఆడగా ఆ బంతి నేరుగా వెళ్లి శార్దుల్ ఠాకూర్ చేతుల్లో వాలింది. అప్పటికి రాజస్థాన్ స్కోర్ 11 పరుగులే.

భారీ స్కోర్ చేసే అవకాశం ఉన్నా..

భారీ స్కోర్ చేసే అవకాశం ఉన్నా..

జట్టు స్కోర్ 54 పరుగుల వద్ద యశస్వి జైస్వాల్ అవుట్ అయిన తరువాత రవిచంద్రన్ అశ్విన్-దేవ్‌దత్ పడిక్కల్ ఇన్నింగ్‌ను రీకన్‌స్ట్రక్ట్ చేశారు గానీ.. అది భారీ స్కోర్‌కు దారి తీయలేకపోయింది. 38 బంతుల్లో నాలుగు ఫోర్లు, రెండు సిక్సర్లతో రవి అశ్విన్ 50, 30 బంతుల్లో ఆరు ఫోర్లు, రెండు సిక్సర్లతో పడిక్కల్ 48 పరుగులు చేశారు గానీ అది సరిపోలేదు. సంజు శాంసన్, రియాన్ పరాగ్ త్వరగా అవుట్ కావడం ఇన్నింగ్‌కు సడన్ బ్రేకులు వేసింది. చివరి ఓవర్‌లో శార్దుల్ ఠాకూర్ ఆరు పరుగులే ఇచ్చాడు.

ముంచిన బౌలర్లు..

ముంచిన బౌలర్లు..

రాజస్థాన్ రాయల్స్ బౌలర్లు అట్టర్ ఫ్లాప్ కావడం ఆ జట్టు పరాజయానికి ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. ఇన్నింగ్ మొత్తం మీద రెండు వికెట్లే పడగొట్టారు. ఇన్నింగ్ తొలి ఓవర్ రెండో బంతికే ఓపెనర్ శ్రీకర్ భరత్‌ను పెవిలియన్ పట్టించగలిగారు గానీ.. ఆ ప్రెషర్‌ను కంటిన్యూ చేయలేకపోయారు బౌలర్లు. స్కోర్ బోర్డు మీద పరుగులేవీ చేరకముందే వికెట్‌ను తీసుకున్న రాజస్థాన్ బౌలర్లు.. మరో బ్యాటర్‌ను అవుట్ చేయడానికి 144 పరుగులను ఇచ్చుకోవాల్సి వచ్చింది.

ఆటలు సాగలేదు..

ఆటలు సాగలేదు..

అపారమైన క్రికెట్ ఆడిన అనుభవం ఉన్న కేపిటల్స్ ఓపెనర్ డేవిడ్ వార్నర్, ఫస్ట్‌డౌన్ బ్యాటర్ మిఛెల్ మార్ష్ ముందు రాజస్థాన్ బౌలర్ల పప్పులు ఉడకలేదు. వీరిద్దరూ తుక్కు రేగ్గొట్టారు. ప్రత్యేకించి- మార్ష్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. 62 బంతుల్లో 89 పరుగులు చేశాడు. ఇందులో ఏడు సిక్సర్లు, అయిదు ఫోర్లు ఉన్నాయి. జట్టు స్కోర్ 144 పరుగుల వద్ద అవుట్ అయ్యాడు. డేవిడ్ వార్నర్ పద్ధతిగా ఆడాడు. 41 బంతుల్లో ఒక సిక్సర్, అయిదు ఫోర్లతో మరో హాఫ్ సెంచరీని తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ విజయంతో 12 పాయింట్లతో కేపిటల్స్.. ప్లేఆఫ్స్ రేసులో నిలిచింది.

Story first published: Thursday, May 12, 2022, 9:55 [IST]
Other articles published on May 12, 2022
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+