
కోవిడ్ కల్లోలం..
ఈ సీజన్‌లో ఢిల్లీ కేపిటల్స్ ప్రస్థానం ఆశించిన స్థాయిలో సాగట్లేదు. ఇప్పటివరకు అయిదు మ్యాచ్‌లను ఆడిన రిషభ్ పంత్ టీమ్.. రెండింట్లో మాత్రమే విజయం సాధించింది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో ఎనిమిదో స్థానంలో నిలిచిందీ జట్లు. ఈ పరిస్థితుల్లో కరోనా వైరస్ కలకలం రేపడం.. జట్టు గెలుపోటములపై ప్రభావాన్ని చూపించవచ్చు. మిఛెల్ మార్ష్ సహా అయిదుమంది కరోనా బారిన పడ్డారు. ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యారు. క్వారంటైన్‌లో గడిపిందీ జట్టు. పుణెకు సైతం వెళ్లలేకపోయింది. ఫలితంగా బీసీసీఐ- మ్యాచ్‌ను రీలొకేట్ చేసింది. ముంబైకి తరలించింది.

మార్ష్ అవుట్..
ఢిల్లీ కేపిటల్స్ ఆల్‌రౌండర్ మిఛెల్ మార్ష్.. ఈ మ్యాచ్‌లో ఆడట్లేదు. కోవిడ్ బారిన పడ్డ అతను ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యాడు. రాజస్థాన్ రాయల్స్‌తో జరిగే తరువాతి మ్యాచ్‌కూ అతను దూరం అయ్యాడు. సర్ఫరాజ్ ఖాన్ లేదా టిమ్ సీఫర్ట్ తుదిజట్టులో చేరే అవకాశం ఉంది. మిగిలిన ప్లేయర్లలో పెద్దగా మార్పులు ఉండకపోవచ్చు. చూడ్డానికి బ్యాటింగ్ ఆర్డర్ బలంగానే ఉన్నప్పటికీ.. గ్రౌండ్‌లో ఆ స్థాయిలో రాణించట్లేదు. పృథ్వీ షా, డేవిడ్ వార్నర్, రిషభ్ పంత్ మాత్రమే సత్తా చాటుతున్నారు. బౌలర్ల మీద ఎక్కువగా డిపెండ్ కావాల్సిన పరిస్థితిని ఎదుర్కొంటోంది ఢిల్లీ. ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్, శార్దుల్ ఠాకూర్ ఇంకా గాడిన పడలేదు. కుల్‌దీప్ యాదవ్ ఫర్వాలేదనిపిస్తున్నాడు.

ఆల్‌రౌండర్లతో
పంజాబ్ కింగ్స్ పరిస్థితి దీనికి భిన్నంగా ఏమీ ఉండట్లేదు. శిఖర్ ధవన్, జానీ బెయిర్‌స్టో, షారుఖ్ ఖాన్, ఆల్‌రౌండర్ ఒడియన్ స్మిత్ ఉన్నా బ్యాటింగ్ డిపార్ట్‌మెంట్ ఫుల్ ఎనర్జీతో ఆడట్లేదు. లియామ్ లివింగ్‌స్టొన్ ఒక్కడే దుమ్ము రేపుతున్నాడు. వరుసగా భారీ స్కోర్లు సాధిస్తున్నాడు. మయాంక్ అగర్వాల్ ఈ మ్యాచ్‌లోనూ ఆడటం డౌటే. మడమ గాయంతో అతను బాధపడుతున్నాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆడలేదు. అతను రీ ఎంట్రీ ఇవ్వకపోతే ఈ మ్యాచ్‌కు కూడా శిఖర్ ధవనే సారథ్యాన్ని వహిస్తాడు. హైదరాబాద్ మ్యాచ్‌కీ అతనే కేప్టెన్. ప్రభ్‌సిమ్రన్ సింగ్‌తో కలిసి శిఖర్ ఇన్నింగ్‌ను ఆరంభిస్తాడు.

బౌలింగ్ విభాగానికి లీడ్..
పంజాబ్ కింగ్స్ జట్టు బౌలింగ్ డిపార్ట్‌మెంట్‌ను రబడ లీడ్ చేస్తోన్నాడు. షారుఖ్ ఖాన్, ఆల్‌రౌండర్ ఒడియన్ స్మిత్, హర్‌ప్రీత్ బ్రార్, అర్ష్‌దీప్ సింగ్, రాహుల్ చాహర్‌తో కూడిన బౌలింగ్ విభాగంలో రబడ ఓ లెథల్ వెపన్‌గా మారాడు. బ్యాటర్లు విఫలమైన చోటు.. బౌలింగ్ విభాగం మీదే పంజాబ్ కింగ్స్ భారాన్ని వేస్తోంది. ముస్తాఫిజుర్ రెహ్మాన్, ఖలీల్ అహ్మద్.. అంచనాలకు తగ్గట్లుగా రాణించట్లేదు. శార్దుల్ ఠాకూర్, అక్షర్ పటేల్ పరిస్థితీ దాదాపుగా ఇంతే.

తుదిజట్టు కూర్పు ఇలా..
పంజాబ్ కింగ్స్ తుదిజట్టులో- ప్రభ్‌సిమ్రన్ సింగ్, శిఖర్ ధవన్ (కేప్టెన్), జానీ బెయిర్‌స్టో, లియామ్ లివింగ్‌స్టోన్, జితేష్ శర్మ (వికెట్ కీపర్), మహ్మద్ షారుఖ్ ఖాన్, ఒడియన్ స్మిత్/బెన్నీ హోవెల్/రిషిధవన్/రాజ్ బావా, కగిసొ రబడ, రాహుల్ చాహర్, వైభవ్ అరోరా, అర్ష్‌దీప్ సింగ్ ఆడటం ఖాయంగా కనిపిస్తోంది. ఢిల్లీ టీమ్‌లో- పృథ్వీ షా, డేవిడ్ వార్నర్, సర్ఫరాజ్ ఖాన్/యష్ ధుల్/టిమ్ సీఫర్ట్, రిషభ్ పంత్ (కేప్టెన్, వికెట్ కీపర్), లలిత్ యాదవ్, రౌమన్ పావెల్, అక్షర్ పటేల్, శార్దుల్ ఠాకూర్, కుల్‌దీప్ యాదవ్, ముస్తాఫిజుర్ రెహ్మాన్, ఖలీల్ అహ్మద్ తుదిజట్టులో చోటు దక్కించుకోవచ్చు.


Click it and Unblock the Notifications












