David Warner: క్షణంలో ప్లాన్ మార్చి.. అదిరిపోయే షాట్‌తో బదులిచ్చి

ఘోరంగా అవమానించిన తన పాత ఫ్రాంచైజీ సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై డేవిడ్ వార్నర్ (58 బంతుల్లో 12 ఫోర్లు, 3 సిక్స్‌లతో 92 నాటౌట్) నిన్నటి మ్యాచ్‌లో కసి తీర్చుకున్నాడు. విధ్వంసకర బ్యాటింగ్‌తో సన్‌రైజర్స్ బౌలర్లపై అటాక్ చేశాడు. స్టేడియం నలుదిక్కులా షాట్లతో పేట్రేగిపోయాడు. తన ఇన్నింగ్స్ ఆసాంతం ఏమాత్రం వికెట్ ఇచ్చుకునే షాట్లు ఆడకుండా ఆడిన ప్రతి షాట్ ఎంతో నైపుణ్యంతో వార్నర్ బౌండరీలుగా మలిచాడు. తను ఎంతటి విలువైన ప్లేయరో సన్ రైజర్స్‌కు కుండబద్ధలు కొట్టినట్లు తన ఇన్నింగ్స్ ద్వారా చూపించాడు. వార్నర్‌కు అండగా రోవ్‌మన్ పొవెల్(35 బంతుల్లో 3 ఫోర్లు, 6 సిక్స్‌లతో 67 నాటౌట్) హాఫ్ సెంచరీతో రాణించడంతో ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20ఓవర్లలో 3 వికెట్లకు 207పరుగులు చేసింది. ఇక ఛేదనలో సన్ రైజర్స్ బ్యాటర్లు పోరాడినా వారి పోరాటం గెలుపు వరకు తీసుకెళ్లలేదు. 21పరుగుల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్ విజయం సాధించి పాయింట్ల పట్టికలో 7వ స్థానం నుంచి 5వ స్థానానికి జంప్ చేసింది.
వెనువెంటనే ప్లాన్ మార్చి షాట్ బాదాడు
ఇక ఈ మ్యాచ్‌లో వార్నర్ కొట్టిన ఓ షాట్ క్రికెట్ అభిమానులను ఆశ్చర్యానికి గురిచేసింది. 18వ ఓవర్ భువనేశ్వర్ కుమార్ బౌలింగ్ చేయడానికి బరిలోకి దిగాడు. ఆ ఓవర్ మొదటి బంతికి స్వీప్ షాట్ కొట్టాలని వార్నర్ నిర్ణయించుకున్నాడు. అయితే భువనేశ్వర్ కుమార్ తెలివిగా వార్నర్ మోకాళ్ల వైపు బౌలింగ్ చేసి బురిడి కొట్టించాలనుకున్నాడు. దీంతో వెంటనే వార్నర్ తన ప్లాన్ మార్చేశాడు. పూర్తి రైట్ హ్యాండర్ స్టైల్లో రైట్ హ్యాండర్ కూడా కొట్టలేనంత పర్ ఫెక్ట్‌గా బంతిని ఎడ్జ్ చేస్తూ వెనకకు షాట్ బాదాడు. అది బౌండరీ చేరింది.

వాటే స్పాంటెనియస్ రియాక్షన్
ఈ షాట్ విషయంపై కామెంటర్ హార్ష బోగ్లే స్పందించాడు. వార్నర్ రైట్ హ్యాండర్‌గా మారడానికి బాటమ్ హ్యాండ్ గ్రిప్‌ను ఉపయోగించి బంతిని ఫైన్-లెగ్ బౌండరీకి పంపించి బౌలర్‌ను భలే అధిగమించాడు. అతను తన షాట్‌ను పరిపరివిధాలా ఒకే టైంలో మార్చాడు. అది చాలా తెలివైన షాట్. ఎందుకంటే అతను నిర్ణయించుకున్నదానికి వ్యతిరేకంగా బంతి పడింది. అంతే స్పాంటెనియస్‌గా తనకు తెలిసిన మరోషాట్‌ను వెంటనే మార్చుకుని బౌండరీకి పంపాడు.' అని హర్షా భోగ్లే పేర్కొన్నాడు.


ఎంత అందమైన షాట్ అది
‘వార్నర్ స్కూప్ ఆడాలని చూశాడు. వాస్తవానికి అతని బ్యాటింగ్ పొజిషన్ స్విచ్ అయిపోయింది. అతని లెఫ్టార్మ్ స్థానంలో రైట్ ఆర్మ్ పవర్ పుచ్చుకుంది. ఒక రైట్ హ్యాండర్‌లాగా మారిపోయి ఎంత అందంగా కొట్టాడు షాట్' అని సునీల్ గవాస్కర్ సైతం వార్నర్ షాట్‌ను మెచ్చుకున్నాడు. ఇక ఈ షాట్ సైతం క్రికెట్ అభిమానులను అలరించింది. నెట్టింటా ఈ షాట్ వీడియో వైరలవుతోంది. వార్నర్ తోపు.. సన్ రైజర్స్ ఉఫ్ అన్నట్లు సన్ రైజర్స్‌కు తనలోని అన్ని వేరియేషన్లు చూపించాడని వార్నర్‌ను అభిమానులు కొనియాడుతున్నారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications