IPL 2022: ఢిల్లీ క్యాపిటల్స్‌కు గుడ్ న్యూస్.. డేవిడ్ వార్నర్ వచ్చేశాడు.. వాళ్లు కూడా..


శనివారం జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ చేతిలో ఓడి నిరాశలో ఉన్న ఢిల్లీ క్యాపిటల్స్ గుడ్ న్యూస్ అందింది. ఏకంగా ఆ జట్టులోని ముగ్గురు స్టార్ ఆటగాళ్లు వచ్చేశారు. ఆ జట్టు వేలంలో కొనుగోలు చేసిన ఆస్ట్రేలియా స్టార్ ఆటగాళ్లు డేవిడ్ వార్నర్, సౌతాఫ్రికా స్టార్ పేసర్ అన్రిచ్ నోర్జే ఢిల్లీ జట్టు ఆడబోయే తర్వాతి మ్యాచ్‌కు అందుబాటులో ఉండనున్నారు. ఇక ఆస్ట్రేలియా ఆటగాడు మిచెల్ మార్ష్ కూడా త్వరలోనే జట్టులో చేరబోతున్నాడు. ఈ విషయాన్ని ఢిల్లీ క్యాపిటల్స్ హెడ్ కోచ్ రికీ పాంటింగ్ వెల్లడించాడు.

ముంబైలో అడుగుపెట్టిన వార్నర్
ఆస్ట్రేలియా డ్యాషింగ్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ పాకిస్థాన్ పర్యటన కారణంగా ఇప్పటివరకు ఐపీఎల్ 2022లో అడుగుపెట్టలేదు. కానీ ఇటీవల పాకిస్థాన్ పర్యటన ముగియడంతో డేవిడ్ వార్నర్ ముంబై చేరుకున్నాడు. ఈ క్రమంలో ఢిల్లీ క్యాపిటల్స్ క్యాంపులో చేరాడు. అయితే నిబంధనలు ప్రకారం వార్నర్ 3 రోజులపాటు క్వారంటైన్‌లో ఉండనున్నాడు. అయితే ఢిల్లీ తన తర్వాతి మ్యాచ్‌ను ఈ నెల 7న లక్నో సూపర్ జెయింట్స్‌తో ఆడనున్న నేపథ్యంలో అప్పటివరకు వార్నర్ జట్టులో చేరతాడని ఢిల్లీ హెడ్‌కోచ్ రికీ పాంటింగ్ తెలిపాడు.

అందుబాటులో నోర్జే, మార్ష్
ఇక గాయాల కారణంగా ఇప్పటివరకు ఢిల్లీ జట్టులో చేరని సౌతాఫ్రికా స్టార్ పేసర్ అన్రిచ్ నోర్జే, ఆస్ట్రేలియా ఆటగాడు మిచెల్ మార్ష్ కూడా తర్వాతి మ్యాచ్‌కు అందుబాటులో ఉంటారని పాంటింగ్ తెలిపాడు. నోర్జే గాయం నుంచి కోలుకున్నాడని నెట్స్‌లో బౌలింగ్ కూడా చేస్తున్నట్లు తెలిపాడు. అయితే సౌతాఫ్రికా క్రికెట్ బోర్డు నుంచి క్లియరెన్స్ రాగానే అతను మైదానంలోకి దిగనున్నట్లు చెప్పాడు. ఇక ఆస్ట్రేలియా ఆటగాడు మిచెల్ మార్ష్ కూడా గాయం నుంచి కోలుకున్నట్టు తెలిపాడు. లక్నోతో మ్యాచ్‌కు కాకపోయినా కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో మ్యాచ్ నాటికి మార్ష్ అందుబాటులోకి వస్తాడని ఢిల్లీ క్యాపిటల్స్ హెడ్ కోచ్ రికీ పాంటింగ్ వివరించాడు.

గుజరాత్ గెలుపు
ఇక శనివారం జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌పై గుజరాత్ టైటాన్స్ 14 పరుగుల తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ 6 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది. ఆ జట్టు బ్యాటర్లలో శుభ్‌మాన్ గిల్ 84 పరుగులతో చెలరేగాడు. హార్దిక్ పాండ్యా 31 పరుగులతో పర్వాలేదనిపించగా.. మిల్లర్ 20 పరుగులతో అజేయంగా నిలిచాడు.
ఢిల్లీ బౌలర్లలో ముస్తఫిజర్ రహ్మాన్ 3, ఖలీల్ అహ్మద్ 2, కుల్దీప్ యాదవ్ ఒక వికెట్ తీశారు. అనంతరం లక్ష్య చేధనలో ఢిల్లీ 157 పరుగులకే పరిమితమైంది. ఆ జట్టు బ్యాటర్లలో కెప్టెన్ రిషబ్ పంత్ ఒక్కడే 43 పరుగులతో రాణించాడు. గుజరాత్ బౌలర్లలో ఫెర్గ్యూసన్ 4 వికెట్లతో చెలరేగాడు. షమీ 2, హార్దిక్ పాండ్యా, రషీద్ ఖాన్ తలో వికెట్ తీశారు.

ఢిల్లీ క్యాపిటల్స్ పూర్తి జట్టు
రిషబ్ పంత్, అక్షర్ పటేల్, పృథ్వీ షా, అన్రిచ్ నోర్జే, డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్, శార్దూల్ ఠాకూర్, ముస్తాఫిజుర్ రెహమాన్, కుల్దీప్ యాదవ్, అశ్విన్ హెబ్బర్, అభిషేక్ శర్మ, కమలేష్ నాగర్‌కోటి, కేఎస్ భరత్, మన్‌దీప్ సింగ్, ఖలీల్ సద్కావ్, చేతన్ యాడ్కావ్, చేతన్ యాహ్మద్ , రిపాల్ పటేల్, యష్ ధుల్, రోవ్‌మన్ పావెల్, ప్రవీణ్ దూబే, లుంగి ఎన్‌గిడి, విక్కీ ఓస్త్వాల్, సర్ఫరాజ్ ఖాన్.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications