Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

LSG vs DC: డేవిడ్‌ వార్న‌ర్ అట్ట‌ర్ ఫ్లాప్‌.. ఫుల్ ఖుషీలో SRH.. కొనందే మంచిదైదంటున్న నెటిజ‌న్స్‌

IPL 2022: David Warner Failure Against LSG Brings Happiness In SRH Fans

ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్) 2022లో కాస్త‌ లేట్‌గా అడుగుపెట్టిన ఢిల్లీ క్యాపిట‌ల్స్ ఓపెన‌ర్ డేవిడ్ వార్న‌ర్ తొలి మ్యాచ్‌లో అట్ట‌ర్ ఫ్లాప్‌ అయ్యాడు. ల‌క్నో సూప‌ర్ జెయింట్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో టెస్ట్ క్రికెట్ త‌ర‌హాలో బ్యాటింగ్ చేసిన వార్న‌ర్ చివ‌రికి సింగిల్ డిజిట్‌కే ప‌రిమిత‌మ‌య్యాడు. వార్న‌ర్ ఆట చూసిన స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ అభిమానులు ఈ సారి అత‌డిని జ‌ట్టులోకి తీసుకోనిదే మంచిదైంటున్నారు.

 వార్న‌ర్ అట్ట‌ర్ ఫ్లాప్‌

వార్న‌ర్ అట్ట‌ర్ ఫ్లాప్‌

క్రీజులోకి అడుపెట్టిన‌ప్ప‌టి నుంచే వార్న‌ర్ త‌డ‌బడుతూ బ్యాటింగ్ ప్రారంభించాడు. ఒక వైపు యువ ఓపెన‌ర్ పృథ్వీ షా అటాకింగ్ గేమ్‌తో సునాయ‌సంగా బౌండ‌రీలు బాదుతూ స్కోర్ బోర్డును ప‌రుగులు పెట్టిస్తుంటే వార్న‌ర్ మాత్రం సింగిల్స్ తీయ‌డానికే నాన తంటాలు ప‌డ్డాడు. అవి కూడా స‌రిగ్గా తీయ‌లేక‌పోయాడు. మొత్తంగా 12 బంతులు ఎదుర్కొని కేవ‌లం 4 ప‌రుగులే చేసి ఔట‌య్యాడు. స్పిన్న‌ర్ ర‌వి బిష్ణోయ్ బౌలింగ్‌లో ఆఫ్ సైడ్ షాట్ ఆడే క్ర‌మంలో ఫీల్డ‌ర్ ఆయుష్ బ‌దోనికి దొరికిపోయాడు.

స‌న్‌రైజ‌ర్స్ హ్యాపీ

స‌న్‌రైజ‌ర్స్ హ్యాపీ

డేవిడ్ వార్న‌ర్ అట్ట‌ర్ ఫ్లాప్ అవ‌డంతో స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్‌ మేనేజ్‌మెంట్‌తోపాటు అభిమానులు పుల్ ఖుషీ అవుతున్నారు. ఎందుకంటే గ‌త సీజ‌న్ వ‌ర‌కు వార్న‌ర్ స‌న్‌రైజ‌ర్స్‌కే ఆడాడు. కానీ గ‌త సీజ‌న్లో స‌న్‌రైజ‌ర్స్ మేనేజ్‌మెంట్‌తో వార్న‌ర్‌కు విబేధాలు వ‌చ్చాయి. అదే స‌మ‌యంలో వార్న‌ర్ స్థాయికి త‌గ్గ‌ట్టుగా ఆడలేక‌పోయాడు. దీంతో అత‌డిని స‌న్‌రైజ‌ర్స్ మేనేజ్‌మెంట్ జ‌ట్టు నుంచి తప్పించింది. వేలంలోనూ కొనుగోలు చేయ‌లేదు. ఇక అత‌న్ని 6 కోట్ల రూపాయ‌ల‌కు పైగా వెచ్చించి ఢిల్లీ క్యాపిట‌ల్స్‌కు కొనుగోలు చేసింది. అప్ప‌ట్లో వార్న‌ర్‌కు ఇది త‌క్కువ ధ‌ర అనే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌య్యాయి. కానీ తాజాగా వార్న‌ర్ ఆట చూసిన నెటిజ‌న్లు అదే చాలా ఎక్కువ అని సోష‌ల్ మీడియాలో రాసుకొస్తున్నారు. అలాగే వార్న‌ర్‌ను కొనుగోలు చేయ‌కుండా స‌న్‌రైజ‌ర్స్ మంచి ప‌ని చేసింద‌ని అభిమానులు, నెటిజ‌న్లు అంటున్నారు.

 త‌డ‌బ‌డుతున్న ఢిల్లీ

త‌డ‌బ‌డుతున్న ఢిల్లీ

టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ క్యాపిట‌ల్స్ 13 ఓవ‌ర్లు ముగిసే స‌మ‌యానికి 3 వికెట్ల న‌ష్టానికి 87 ప‌రుగులు చేసింది. క్రీజులో రిషబ్ పంత్, స‌ర్ప‌రాజ్ ఖాన్ ఉన్నారు. అంతకుముందు ఓపెన‌ర్ పృథ్వీ షా ఢిల్లీ స్కోర్ బోర్డును ప‌రుగులు పెట్టించాడు. కానీ అత‌ను ఔట‌య్యాక స్కోర్‌లో వేగం త‌గ్గింది. ఢిల్లీ బ్యాట‌ర్ల‌లో పృథ్వీ షా 61, డేవిడ్ వార్న‌ర్ 4, రోవ్‌మాన్ పావెల్ 3 ప‌రుగులు చేశారు.

 తుది జ‌ట్లు

తుది జ‌ట్లు

ఢిల్లీ క్యాపిటల్స్: పృథ్వీ షా, డేవిడ్ వార్నర్, రిషబ్ పంత్ (వికెట్ కీప‌ర్/ కెప్టెన్‌), రోవ్‌మన్ పావెల్, సర్ఫరాజ్ ఖాన్, లలిత్ యాదవ్, అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్, ముస్తాఫిజుర్ రెహమాన్, అన్రిచ్ నార్టే

లక్నో సూపర్ జెయింట్స్: కెఎల్ రాహుల్ (కెప్టెన్), క్వింటన్ డి కాక్ (వికెట్ కీప‌ర్), ఎవిన్ లూయిస్, దీపక్ హుడా, ఆయుష్ బడోని, కృనాల్ పాండ్యా, జాసన్ హోల్డర్, కృష్ణప్ప గౌతమ్, ఆండ్రూ టై, రవి బిష్ణోయ్, అవేష్ ఖాన్.

1
53619
Story first published: Thursday, April 7, 2022, 20:53 [IST]
Other articles published on Apr 7, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+