David Miller: గుజరాత్‌కు మిల్లర్.. ప్రత్యర్థికి కిల్లర్, ఐపీఎల్ 2022లో 64సగటు, 141 స్ట్రైక్ రేట్, 449పరుగులు

ఐపీఎల్ 2022 సీజన్ టైటిల్‌కు నయా టీమ్ గుజరాత్ టైటాన్స్ ఒక్క మెట్టు దూరంలో ఉంది. మంగళవారం జరిగిన థ్రిల్లింగ్ క్వాలిఫయర్ 1 మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్‌ను 7వికెట్ల తేడాతో ఓడించిన ఆ జట్టు ఐపీఎల్ 2022లో ఫైనల్ చేరిన తొలి జట్టుగా నిలిచింది. ఇక ఈ మ్యాచ్‌లో మిల్లర్ ది కిల్లర్ డేవిడ్ మిల్లర్(38 బంతుల్లో 3 ఫోర్లు, 5 సిక్స్‌లతో 68 నాటౌట్) గుజరాత్ కు మరపురాని విజయాన్ని అందించాడు. ఆఖరి ఓవర్‌లో 16పరుగులు కావాల్సిన తరుణంలో మిల్లర్ తనలోని పరాక్రమాన్ని చూపాడు. ప్రసీద్ వేసిన చివరి ఓవర్లో తొలి మూడు బంతులకే మూడు సిక్సర్లు బాది.. రాజస్థాన్ రాయల్స్ నుంచి మ్యాచ్‌ను లాగేసుకున్నాడు. ఇక మిల్లర్ ప్రదర్శనపై సర్వత్రా ప్రశంసలు దక్కుతున్నాయి. ఇకపోతే మిల్లర్ ఈ సీజన్లో అత్యుత్తమంగా రాణిస్తూ గుజరాత్ విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాడు.

ఈడెన్ గార్డెన్స్‌లో రెండో అత్యుత్తమ రన్ ఛేజ్ ఇదే

ఈడెన్ గార్డెన్స్‌లో రెండో అత్యుత్తమ రన్ ఛేజ్ ఇదే

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 6వికెట్లకు 188 పరుగులు చేసి 189పరుగుల భారీ టార్గెట్ గుజరాత్ ముందుంచింది. ఈడెన్ గార్డెన్స్ లాంటి వేదికపై ఇది చాలా టఫ్ టార్గెట్. అయినప్పటికీ గుజరాత్ ఛేదించిందంటే అందుకు ప్రధాన కారణం మిల్లరే. 189పరుగుల ఛేదనను విజయవంతంగా పూర్తి చేసిన గుజరాత్ ఈడెన్ గార్డెన్స్‌లో రెండో అత్యుత్తమ ఐపీఎల్ రన్-ఛేజ్‌ను నమోదు చేసింది. అలాగే ఐపీఎల్ ప్లేఆఫ్ మ్యాచ్‌లో మూడో అత్యధిక రన్ ఛేజ్‌ను నమోదు చేసింది. కెప్టెన్ హార్దిక్ పాండ్యా (40నాటౌట్)తో కలిసి నాలుగో వికెట్‌కు డేవిడ్ మిల్లర్ 106పరుగుల భారీ భాగస్వామ్యం నమోదు చేసి గుజరాత్‌కు విజయాన్ని కట్టబెట్టాడు.

కేవలం ఫోర్లు, సిక్సర్లు మాత్రమే కాదు

కేవలం ఫోర్లు, సిక్సర్లు మాత్రమే కాదు

ఇకపోతే గుజరాత్ టైటాన్స్ 189పరుగుల లక్ష్య ఛేదనలో చాలా ఆచితూచి ఆడింది. ఇక మిల్లర్ దిగేసరికి 63బంతుల్లో గెలవడానికి 104పరుగులు చేయాల్సిన పరిస్థితి ఉంది. మిల్లర్ నంబర్ 5స్థానంలో బ్యాటింగ్‌కి దిగాడు. ఇక హార్దిక్ పాండ్యాతో కలిసి ఇన్నింగ్స్ నడిపించిన మిల్లర్.. రిక్వయిడ్ రన్ రేట్‌ను చూసుకుంటూ తన బ్యాటింగ్ చేశాడు. కేవలం బౌండరీల మీద మాత్రమే ఫోకస్ చేయకుండా అవసరమైనన్నీ సింగిల్స్, డబుల్స్ తీయడంతో పాటు హార్దిక్ తో కలిసి మంచి స్ట్రైక్ రొటేట్ చేశాడు. 14బంతుల్లో 30పరుగులు చేయాల్సిన పరిస్థితిలో మిల్లర్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్‌ బౌలింగ్లో సిక్సర్‌ కొట్టి ఈక్వెషన్‌ను ఇంకొంచెం సరళం చేశాడు. అయినప్పటికీ 19వ ఓవర్లో పేసర్ ఒబెడ్ మెక్‌కాయ్ ఏడు పరుగులు మాత్రమే ఇచ్చాడు. దీంతో గుజరాత్ మ్యాచ్ గెలవడానికి ఒక ఓవర్‌లో 16పరుగులు చేయాల్సి వచ్చింది. ఇక ఆ ఓవర్లో వరుసగా మూడు సిక్సర్లు కొట్టి మిల్లర్ మ్యాచ్ ముగించాడు.

వేలంలో మొదటి రోజు ఎవరూ కొనలేదు

వేలంలో మొదటి రోజు ఎవరూ కొనలేదు

ఒకప్పుడు పంజాబ్ కింగ్స్ తరఫున మిల్లర్ ఆడేటప్పుడు ఛేదనలో ఎన్నోసార్లు గొప్ప పోరాటాన్ని మిల్లర్ కనబరిచాడు. అయితే గత రెండు సీజన్లలో మిల్లర్ రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడాడు. ఆ టీంలో అతనికి అడపాదడపా అవకాశాలొచ్చాయి. కన్సిస్టెన్సీ ప్లేయర్ గా అతన్ని తీసుకోకపోవడంతో చాలా పేలవ ప్రదర్శన కనబరిచాడు. ఫాం కూడా కోల్పోయాడు. ఐపీఎల్ 2022 మెగా వేలం కోసం 1కోటి ధర కేటగిరీలో మిల్లర్ నమోదు చేసుకోగా.. మొదటి రోజు అతన్ని ఎవరూ కొనుక్కోలేదు. కానీ ఒంటి చేత్తో మ్యాచ్ ను మలుపు తిప్పే అతని కోసం రెండో రోజు రాజస్థాన్‌తో పోటీ పడి రూ.3కోట్లకు గుజరాత్ కొనుక్కుంది.

గత రెండు సీజన్లలో పేలవం.. ఈ సీజన్లో వరం

గత రెండు సీజన్లలో పేలవం.. ఈ సీజన్లో వరం

ఇక 2020, 2021సీజనల్లో మిల్లర్ 10 మ్యాచ్ లు ఆడి కేవలం 1హాఫ్ సెంచరీతో పాటు 124పరుగులు మాత్రమే చేశాడు. కానీ ఈ సీజన్లో మాత్రం తనలోని సత్తాను మళ్లీ బయటకు తీశాడు. మిడిల్ ఆర్డర్లో ఆడుతూ.. 15 మ్యాచ్‌లలో 449పరుగులు చేశాడు. 64.14 సగటుతో స్ట్రైక్ రేట్ సైతం 141. 19గా మెయింటెన్ చేయడం గమనార్హం. పలు మ్యాచ్‌లలో గుజరాత్ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. ఇకపోతే మిల్లర్ ఐపీఎల్లో 104 మ్యాచ్‌లు ఆడాడు. 2,423పరుగులు చేశాడు. అతని స్ట్రైక్ రేట్ 137.35కాగా సగటు 36.16. నిన్నటి మ్యాచ్‌లో ఈడెన్ గార్డెన్స్‌లో మిల్లర్ హాఫ్ సెంచరీ సాధించగా.. టీ20లో అతనికి ఇది 40వ హాఫ్ సెంచరీ, ఐపీఎల్లో 12వది.


For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
Story first published: Wednesday, May 25, 2022, 10:40 [IST]
Other articles published on May 25, 2022
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X