
ధోనీ కేప్టెన్సీలో..
పుణేలోని మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ 202 పరుగులు చేసింది. మొన్నటిదాకా పరుగులు చేయడానికి కష్టపడ్డ ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ ఒక్కసారిగా విజృంభించాడు. 57 బంతుల్లో 99 పరుగులు చేశాడు. మరో ఓపెనర్ డెవాన్ కాన్వే 55 బంతుల్లో ఎనిమిది ఫోర్లు, ఆరు సిక్సర్లతో 85 పరుగులు చేసి, నాటౌట్‌గా నిలిచాడు. ఈ ఇద్దరి దెబ్బకు స్కోర్ 200లను దాటింది. ధోనీ క్రీజ్‌లోకి వచ్చినా ఎక్కువ సేపు నిలవలేకపోయాడు. ఎనిమిది పరుగులకే వెనుదిరిగాడు.

సొంత నిర్ణయాలు అవసరం..
మ్యాచ్ అనంతరం ధోనీ మాట్లాడాడు. ఘాటు వ్యాఖ్యలు చేశాడు. మాజీ కేప్టెన్ రవీంద్ర జడేజా వైఫల్యానికి గల కారణాలను కూడా బయటపెట్టేశాడు. గత సీజన్‌లో జట్టు అద్భుతంగా రాణించిందని, దాన్ని గుర్తుంచుకుని కేప్టెన్‌గా రవీంద్ర జడేజా తన బాధ్యతలను నిర్వర్తిస్తాడని భావించానని పేర్కొన్నాడు. తొలి రెండు మ్యాచ్‌లల్లో జడేజా పనితీరును గమనించానని, టోర్నమెంట్ సాగుతున్న కొద్దీ రాటుదేలుతాడని అనుకున్నానని చెప్పాడు.

స్పూన్ ఫీడ్ చేయలేం..
కేప్టెన్‌గా రవీంద్ర జడేజా సొంత నిర్ణయాలను తీసుకోవాల్సి ఉంటుందని, ప్రతిదీ స్పూన్ ఫీడింగ్ చేయలేమని అన్నాడు. ఒక్కసారి కేప్టెన్‌గా బాధ్యతలను స్వీకరించిన తరువాత.. ఎన్నో అంచనాలు ఏర్పడటం అత్యంత సహజమని వ్యాఖ్యానించాడు. దాని ప్రభావం ప్లేయర్‌గా అతని వ్యక్తిగత ప్రదర్శనను దెబ్బ తీయొచ్చని చెప్పాడు. రవీంద్ర జడేజా విషయంలో అదే జరిగిందని అన్నాడు. కేప్టెన్సీ భారం జడేజా వ్యక్తిగత ప్రదర్శనను దెబ్బ తీసిందని అన్నాడు.


స్పిన్నర్లు రాణించారు..
కేప్టెన్ మారటం వల్ల జట్టు ప్లేయర్లలో గానీ, డ్రెస్సింగ్ రూమ్ వాతావరణంలో గానీ మార్పు రాదని ధోనీ చెప్పాడు. కేప్టెన్‌గా తాను ఎలాంటి మేజిక్ చేయలేదని అన్నాడు. ఓ భారీ లక్ష్యాన్ని నిర్దేశించి, దాన్ని కాపాడుకోగలిగామని పేర్కొన్నాడు. ఆరో ఓవర్ నుంచి మ్యాచ్‌పై పట్టు బిగించామని చెప్పాడు. స్పిన్నర్లు మ్యాచ్‌ను చేజారనివ్వలేదని అన్నాడు. ఈ మ్యాచ్‌లో రవీంద్ర జడేజా మూడు ఓవర్లు వేసి 15 పరుగులే ఇవ్వడాన్ని ధోనీ పరోక్షంగా ప్రస్తావించాంచాడు. బౌలర్లు సత్తా చాటారని చెప్పాడు.

బౌలర్లకు హితబోధ..
డీప్ మిడ్ వికెట్ ఫీల్డింగ్‌లో అనేక క్యాచ్‌లను జారవిడవాల్సి వచ్చిందని, అది జట్టు విజయావకాశాలను ప్రభావితం చేసిందని ధోనీ చెప్పుకొచ్చాడు. జట్టులో యంగ్ బౌలర్లు ఉన్నారని, వారికి సరైన దిశానిర్దేశం చేయాల్సిన అవసరం ఉందని అన్నాడు. ఒక ఓవర్‌లో బ్యాటర్ నాలుగు సిక్సర్లు కొడితే- మిగిలిన ఆ రెండు బంతులకు పరుగులు ఇవ్వకుండా కాపాడుకోవాలని తాను ఎప్పుడూ వారికి చెబుతుంటానని పేర్కన్నాడు. ఇక ముందు జరిగే మ్యాచ్‌లను ఇదే స్ఫూర్తితో ఆడతామని స్పష్టం చేశాడు.


Click it and Unblock the Notifications
