Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

మంగమ్మ శపథం: ఆర్సీబీ కప్ కొట్టేంత వరకూ పెళ్లి చేసుకోదట: పాపం పేరెంట్స్ పరిస్థితేంటో?

IPL 2022, CSK vs RCB: Really worried about her parents, twitter flooded with trolls after seeing this placard

ముంబై: ఐపీఎల్ 2022 సీజన్‌లో భాగంగా హైఓల్టేజ్ మ్యాచ్ మంగళవారం రాత్రి ముగిసింది. చెన్నై సూపర్ కింగ్స్ ఎట్టకేలకు విజృంభించింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును చిత్తు చేసింది. వరుసగా నాలుగు పరాజయాల తరువాత అందిన తొలి గెలుపు ఇది. ఇలాంటి ఓ విజయం కోసం ఇన్ని రోజులూ ఎదురు చూశారు సూపర్ కింగ్స్ ఫ్యాన్స్. ఆకలితో ఉన్న అభిమానులకు ఏకంగా పరమాన్నం పెట్టినట్టయిందీ మ్యాచ్ రిజల్ట్. ఈ గెలుపు ఇచ్చిన ఊపుతో తన తరువాతి మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్‌ను ఢీ కొట్టడానికి సమాయాత్తమౌతోంది.

సునామీ..సునామీనే అది

నవీ ముంబైలోని డీవై పాటిల్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై కళ్లు చెదిరేలా ఆడింది. ఓపెనర్ రాబిన్ ఊతప్ప, టాప్ ఆర్డార్ బ్యాటర్ శివం దుబే ప్రత్యర్థి బౌలర్లపై సునామీలా విరుచుకుపడ్డారు. మూడో వికెట్‌కు 165 పరుగులు భాగస్వామ్యాన్ని అందించారంటే ఆ ఇద్దరి విజృంభణ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఐపీఎల్ మ్యాచ్‌లల్లో ఒక టీమ్ చేసే భారీ స్కోర్ ఇది. దీన్ని వారిద్దరే బాదేశారు.

చివరి వరకు పోరాడినా..

ఊతప్ప 50 బంతుల్లో 88, శివం దుబే 46 బంతుల్లో 95 పరుగులు చేశారు. ఫలితంగా స్కోర్‌బోర్డ్‌పై 216 పరుగులు జమ అయ్యాయి. ఇంత భారీ లక్ష్యాన్ని ఛేదించడానికి రాయల్ ఛాలెంజర్స్ పోరాడింది. చివరి వరకూ శ్రమించింది గానీ.. దాని ప్రయాణం లక్ష్యానికి 23 పరుగులు దూరంలో నిలిచి పోయింది. నిర్ణీత 20 ఓవర్లకు 193 పరుగులు మాత్రమే చేయగలిగింది. గ్లెన్ మ్యాక్స్‌వెల, షాబాజ్ అహ్మద్, సుయాష్ ప్రభుదేశాయ్, దినేష్ కార్తీక్.. పోరాడినప్పటికీ ఫలితం దక్కలేదు.

తొలి ఓటమి..

వరుసగా మూడు విజయాల తరువాత రాయల్ ఛాలెంజర్స్‌కు అందిన తొలి ఓటమి ఇది. అయిదు మ్యాచ్‌‌లల్లో మూడు విక్టరీలతో ప్రస్తుతం పాయింట్ల పట్టికలో అయిదో స్థానంలో నిలిచిందీ ఫాఫ్ టీమ్. ఇకపై ఆటతీరు ఎలా ఉంటుందో తెలియదు గానీ ఇప్పటివరకు ఈ జట్టు ప్రస్థానం అంచనాలకు అనుగుణంగానే సాగుతోంది. ఈ సాల కప్ నమ్దే అనే తరహాలో టీమ్ పోరాడుతోంది. కప్ కొట్టాలనే కలను నెరవేర్చుకోవడానికి శ్రమిస్తోంది.

నో మ్యారెజ్..

ఈ మ్యాచ్ సందర్భంగా స్టేడియంలో కనిపించిన ఓ ప్లకార్డ్.. హైలైట్. సోషల్ మీడియాను ఓ ఊపు ఊపేస్తోంది ఇది. వైరల్‌గా మారింది. రాయల్ ఛాలెంజర్స్ కప్ కొట్టేంత వరకూ పెళ్లి చేసుకోను- అనేది దీని సారాంశం. దీనిమీద విపరీతమైన కామెంట్స్ పడుతున్నాయి. ట్రోల్స్ పేలుతున్నాయి. దీన్ని మంగమ్మ శపథంలా అభివర్ణిస్తున్నారు. ఇప్పటికే ఆంటీలా తయారయ్యావు అంటూ బాడీ షేమింగ్‌కూ దిగుతున్నారు. ఆమె తల్లిదండ్రుల పరిస్థితేమిటోనని, ఈ జన్మకు పెళ్లవుద్దో.. లేదోనంటూ ఆందోళన వ్యక్తం చేసే నెటిజన్లు కూడా లేకపోలేదు.

Story first published: Wednesday, April 13, 2022, 7:57 [IST]
Other articles published on Apr 13, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+