Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ధోనీ 200వ మ్యాచ్.. అయినా శిష్యుడే ముందున్నాడు

IPL 2022, CSK vs RCB: MS Dhoni will be playing his 200th match for Chennai Super Kings

ముంబై: ఐపీఎల్ 2022 సీజన్‌లో భాగంగా ఈ సాయంత్రం మరో కీలక మ్యాచ్ జరుగనుంది. చెన్నై సూపర్ కింగ్స్- ఫాఫ్ డుప్లెసిస్ సారథ్యంలోని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో తలపడనుంది. పుణేలోని మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో ఈ సాయంత్రం 7:30 గంటలకు మ్యాచ్ ఆరంభమౌతుంది. రెండు జట్లకూ కీలకమైన మ్యాచ్ ఇది. ఈ మ్యాచ్ రాయల్ ఛాలెంజర్స్‌కు అగ్నిపరీక్షలాంటిది. గెలవక తప్పని పరిస్థితిని ఎదుర్కొంటోంది.

చెన్నై సూపర్ కింగ్స్‌ తరఫున మహేంద్ర సింగ్ ధోనీ ఓ మైలురాయిని అందుకోబోతోన్నాడీ మ్యాచ్‌తో. రాయల్ ఛాలెంజర్స్‌తో జరిగే మ్యాచ్ నంబర్ 200. ఐపీఎల్‌ మొత్తానికీ ధోనీ ఇప్పటివరకు 229 మ్యాచ్‌లు ఆడాడు. ఇందులో చెన్నై తరఫున ఆడినవి 199. మిగిలినవి రైజింగ్ పుణే సూపర్ జెయింట్స్ తరఫున ఆడినవి. ఒక ఫ్రాంఛైజీ తరఫున ఇప్పటివరకు 200 మ్యాచ్‌ల మార్క్‌ను అందుకున్న ప్లేయర్ ఒకే ఒక్కడు. అతనే విరాట్ కోహ్లీ. రాయల్ ఛాలెంజర్స్ తరఫున 200 మ్యాచ్‌ల మైల్‌స్టోన్‌‌ను అందుకున్నాడు. 217 మ్యాచ్‌లను ఆడాడు.

IPL 2022, CSK vs RCB: MS Dhoni will be playing his 200th match for Chennai Super Kings

దీనితో పాటు ధోనీ ఇంకొన్ని వ్యక్తిగత రికార్డులను నెలకొల్పడానికి, కొన్ని మైలురాళ్లను అధిగమించడానికి అవకాశం ఉంది. 200 సిక్సుల క్లబ్‌లో చేరడానికీ చేరువయ్యాడు ధోనీ. దీనికి కావాల్సింది ఇంకో ఆరు సిక్సులే. ఇక్కడా అతని కంటే కోహ్లీనే ముందున్నాడు. ఈ క్లబ్‌లో విరాట్ కోహ్లీ ఎప్పుడో జాయిన్ అయ్యాడు. ఆరు ఫోర్లు కొడితే ధోనీ 500 క్లబ్‌లో చేరుతాడు. ఐపీఎల్‌లో ఇప్పటివరకు అతను బాదిన ఫోర్ల సంఖ్య 494.

ఐపీఎల్‌తో పాటు టీ20 ఫార్మట్‌లో దినేష్ కార్తీక్ 200 మైల్‌స్టోన్‌ను అందుకోవడానికి చేరువ అయ్యాడు. ఇంకో క్యాచ్ పడితే టీ20 ఫార్మట్‌లో 200 మంది బ్యాటర్లను అవుట్ చేసిన రెండో వికెట్ కీపర్ అవుతాడు. ఇదివరకు ఈ ఘనతను ధోనీ సాధించాడు. రవీంద్ర జడేజా కోసం కూడా ఓ రికార్డ్ ఎదురు చూస్తోంది అతను ఒక్క రన్ చేస్తే- ఐపీఎల్‌లో 2,500 పరుగులు పూర్తవుతాయి. బౌలర్‌గా 100కు పైగా వికెట్లు తీయడం, బ్యాటర్‌గా 2,500 పరుగులు చేసిన ప్లేయర్ అతనొక్కడే అవుతాడు.

ఈ మ్యాచ్ అటు రెండు జట్లకూ కీలకమైనదే. మొదటి నుంచీ చెన్నై ఓటములను ఎదుర్కొంటోండగా.. టోర్నమెంట్ కీలక దశకు చేరుకున్న సమయంలో ఆర్సీబీ విఫలమౌతోంది. వరుసగా మూడు మ్యాచ్‌లల్లో ఓటమి తరువాత చెన్నై సూపర్ కింగ్స్‌ను ఢీ కొట్టబోతోంది. ఇప్పటివరకు ఆడిన 10 మ్యాచ్‌లల్లో అయిదింట్లో ఆర్సీబీ ఓడింది. 10 పాయింట్లతో ఆరో స్థానంలో నిలిచింది. ప్లేఆఫ్స్ ఆశలు సజీవంగా ఉంచుకోవాలనుకుంటే చెన్నైపై గెలవడం అత్యవసరం. ఈ హర్డిల్‌ను దాటుకోగలిగితే తన స్థానాన్ని మరింత మెరుగుపర్చుకోగలుగుతుంది.

Story first published: Wednesday, May 4, 2022, 13:33 [IST]
Other articles published on May 4, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+