Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ధోనీ వల్లే భారత్‌ 2011 ప్రపంచకప్‌ను గెలిచిందంటే..నవ్వొస్తోంది: ఆ ఘనత అతనిది కాదు: భజ్జీ

IPL 2022, CSK vs RCB: Harbhajan Singh takes a dig at MS Dhoni over World Cup 2011 win

ముంబై: ఏఫ్రిల్ 2, 2011. భారత క్రికెట్ ప్రేమికుల రెండు దశాబ్దాలకు పైగా నిరీక్షణ ఫలించిన రోజు. భారత క్రికెట్ జట్టు రెండోసారి ఐసీసీ ప్రపంచకప్‌ను ముద్దాడింది ఆ రోజే. 28 సంవత్సరాల సుదీర్ఘ కలకు మహేంద్ర సింగ్ ధోనీ సారథ్యంలోని టీమిండియా తెర దించిన సందర్భం అది. ముంబై వాంఖెడె స్టేడియంలో శ్రీలంకను మట్టి కరిపించి ప్రపంచ కప్‌ను సగర్వంగా భుజానికెత్తుకుంది భారత జట్టు. లంకేయులు నిర్దేశించిన 274 పరుగుల లక్ష్యాన్ని అవలీలగా ఛేదించింది.

ధోనీ ఆ షాట్..

ధోనీ ఆ షాట్..

ఈ మ్యాచ్‌లో ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ డకౌట్. సచిన్ టెండుల్కర్ చేసింది 18 పరుగులే. 31 పరుగులకే రెండు వికెట్లను కోల్పోయిన దశలో గౌతమ్ గంభీర్, విరాట్ కోహ్లీ, ఎంఎస్ ధోనీ.. రాణించారు. ఇన్నింగ్‌ను నిలబెట్టారు. గంభీర్-97, విరాట్ కోహ్లీ-35 పరుగులు చేశారు. ఇక ఎంఎస్ ధోనీ 79 బంతుల్లో 91 పరుగులు చేసి.. నాటౌట్‌గా నిలిచాడు. మ్యాచ్ విన్నింగ్ షాట్‌గా ధోనీ కొట్టిన హెలికాప్టర్ షాట్.. ఎన్నేళ్లయినప్పటికీ మరిచిపోలేనిది.

ప్రపంచకప్‌కే కేరాఫ్‌గా..

ప్రపంచకప్‌కే కేరాఫ్‌గా..

ఈ విజయం తరువాత- ఎంఎస్ ధోనీ పేరు మార్మోగిపోయింది. ఇప్పటికీ అదే పరిస్థితి నెలకొని ఉంది. 1983లో కపిల్ దేవ్ సారథ్యంలో ప్రపంచ కప్‌ను గెలిచిన తరువాత మళ్లీ ధోనీ సారథ్యంలోని టీమిండియా అదే ఘనతను సాధించడాన్ని ప్రతి అభిమాని ఆస్వాదించాడు. ధోనీ కీలకమైన ఇన్నింగ్ ఆడటం వల్లే టీమిండియా ప్రపంచ కప్‌ను సాధించిందంటూ కీర్తించారు. ధోనీ అంటే ప్రపంచకప్, ప్రపంచకప్ అంటే ధోనీలా మారిపోయింది.

తప్పుపట్టిన హర్భజన్

ఈ పరిస్థితిని టర్బొనేటర్ హర్భజన్ సింగ్ తప్పు పట్టాడు. ధోనీ వల్లే టీమిండియా ప్రపంచ కప్ గెలిచిందనే విషయాన్ని తాను ఎప్పటికీ అంగీకరించబోనని స్పష్టం చేశాడు. భారత్ ఈ ఘనతను సాధించడానికి ధోనీ ఒక్కడే కారణం అనడం అర్థం లేదని వ్యాఖ్యానించాడు. అది జట్టు సమష్టి కృషి అని చెప్పుకొచ్చాడు. టీమిండియా సమష్టిగా రాణించడం వల్లే ప్రపంచకప్.. భారత్ వశమైందని చెప్పాడు. ఇందులో ఎలాంటి అనుమానాలు లేవని పేర్కొన్నాడు.

మిగిలిన వాళ్లేం కావాలి?

మిగిలిన వాళ్లేం కావాలి?

ఐపీఎల్ 2022 డిబేట్స్‌లో పాల్గొన్న హర్భజన్ సింగ్ తన మనసులో మాటను బయటపెట్టాడు. ధోనీ ఒక్కడే మ్యాచ్ గెలిపించాడంటే.. మిగిలిన ప్లేయర్లు ఏం కావాలి? అంటూ ప్రశ్నించాడు. గౌతమ్ గంభీర్ 97 పరుగులను గుర్తు చేశాడు. జట్టులో ఉన్న మిగిలిన 10 ప్లేయర్లు ఆడలేదా అని నిలదీశాడు. జట్టు మొత్తంగా ఆడినప్పుడే విజయం సిద్ధిస్తుందని చెప్పాడు. ఆ విజయాన్ని ఏ ఒక్క ఆటగాడికో పరిమితం చేయలేమని వ్యాఖ్యానించాడు. ఆస్ట్రేలియా గెలిస్తే.. ఆ జట్టు పేరు చెప్పుకొంటారు.. టీమిండియా కప్ కొడితే.. ధోనీ పేరు చెప్పుకోవడం సరికాదని స్పష్టం చేశాడు భజ్జీ.

Story first published: Wednesday, April 13, 2022, 10:49 [IST]
Other articles published on Apr 13, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+