Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

అంపైరింగ్ పొరపాట్లు ముంబై ఇండియన్స్‌ను మళ్లీ ముంచాయా?: అసహనంలో రోహిత్ శర్మ

IPL 2022, CSK vs MI: Umpiring controversy strikes again as leaving Mumbai Indians players frustrated

ముంబై: ఐపీఎల్ 2022 సీజన్‌లో ముంబై ఇండియన్స్ మరో అవమానకర ఓటమిని మూటగట్టుకుంది. సగం సీజన్ ముగిసినా ఈ మోస్ట్ సక్సెస్‌ఫుల్ ఐపీఎల్ టీమ్.. ఒక్కటంటే ఒక్క మ్యాచ్ కూడా గెలవలేదు. ఇకపై ఆ ఆశ కూడా లేదు. డీవై పాటిల్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ ఏడోసారి ఓడింది. రోహిత్ సేనను ఓడించిన జట్ల జాబితాలో చెన్నై సూపర్ కింగ్స్ కూడా చేరింది. చివరి ఓవర్ వరకూ గెలుపుపై ధీమా ఉన్నప్పటికీ.. దాన్ని పటాపంచలు చేశాడు ఎంఎస్ ధోని. ఒకే ఒక్క ఓవర్‌లో మ్యాచ్ గతిని మార్చేశాడు.

ముంబై ఇండియన్స్ ఇప్పటికే వరుస వైఫల్యాలను సతమతమౌతోంది. బ్యాటింగ్..బౌలింగ్‌లో తన స్థాయికి తగ్గ ఆటతీరును కనపర్చట్లేదు. బ్యాటర్లు బాగా ఆడితే.. బౌలర్లు- బౌలర్లు రాణించిన చోట బ్యాటర్లు విఫలమౌతున్నారు. ఓపెనర్లు రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్‌ల ఫెయిల్యూర్స్ గురించి ఎంత మాట్లాడుకున్నా తక్కువే. 16 కోట్ల రూపాయలు ఇషాన్ కిషన్ మీద ఇన్వెస్ట్ చేసినప్పటికీ.. అతను దానికి తగ్గట్టుగా ఆడట్లేదు. అతనిపై మేనేజ్‌మెంట్ ఉంచుకున్న ఆశలన్నీ నీరుగారుతున్నాయి.

ముంబై ఇండియన్స్ వైఫల్యాలకు అంపైరింగ్ తప్పిదాలు కూడా తోడవుతున్నట్టే కనిపిస్తోంది. చెన్నై సూపర్ కింగ్స్‌ బ్యాటింగ్ చేస్తోన్న సమయంలో చోటు చేసుకున్న ఘటన ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. అప్పటికే చెన్నై జట్టు స్కోరు రెండు వికెట్లకు 50 పరుగులు. క్రీజ్‌లో రాబిన్ ఉతప్ప, అంబటి రాయుడు ఉన్నారు. ఇన్నింగ్ ఎనిమిదో ఓవర్‌ను స్పిన్నర్ హృతిక్ షోకీన్ సంధించాడు. ఆ ఓవర్ నాలుగో బంతిని ఉతప్ప ఎదుర్కొన్నాడు. బాల్‌ను స్ట్రెయిట్ డ్రైవ్‌గా ఆడగా..షోకీన్ దాన్ని అందుకున్నాడు.

అవుట్ అయ్యాడనే ఆనందంతో సెలబ్రేట్ చేసుకుంది జట్టు. అప్పటికి రాబిన్ ఉతప్ప వ్యక్తిగత స్కోరు 21 పరుగులే. రాబిన్ ఉతప్ప మాత్రం క్రీజ్ నుంచి కదల్లేదు. దీనితో అంపైర్ బ్రూస్ ఆక్జెన్‌ఫోర్డ్ కూడా దాన్ని అవుట్‌గా భావించలేదు. థర్డ్ అంపైర్‌కు రెఫర్ చేశాడు. రీప్లేలోనూ అది క్యాచ్‌గా క్లియర్ కట్‌గా కనిపించలేదు. దీనితో థర్డ్ అంపైర్ సైతం దాన్ని నాటౌట్‌గా డిక్లేర్ చేశాడు. ఈ రిజల్ట్ ముంబై ఇండియన్స్ ప్లేయర్లలో తీవ్ర నిరాశను నింపింది.

కేప్టెన్ రోహిత్ శర్మ, బౌలర్ షోకీన్, వికెట్ కీపర్ ఇషాన్ కిషన్ సహా ప్లేయర్లు అసహనానికి గురయ్యారు. రోహిత్ శర్మ కొద్దిసేపు అంపైర్‌తో మాట్లాడటం కనిపించింది. ఆ తరువాతి బంతిని సిక్స్‌గా మలిచాడు ఉతప్ప. ఎక్కువ సేపు క్రీజ్‌లో నిలదొక్కుకోలేకపోయాడు. 30 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద జయదేవ్ ఉనద్కత్ బౌలింగ్‌లో డెవాల్డ్ బ్రెవిస్ క్యాచ్ ఇచ్చి అతను అవుట్ అయ్యాడు.

Story first published: Friday, April 22, 2022, 10:53 [IST]
Other articles published on Apr 22, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+