For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

CSK vs MI Playing 11: బ్లాక్ బస్టర్ గేమ్: ధోనీసేన తలరాత రోహిత్ శర్మ చేతిలో: ఒక్క మార్పుతో

IPL 2022, CSK vs MI Playing 11: Here is the details of the both team, whos secured in bottom of the table

ఐపీఎల్ 2022 సీజన్‌.. ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్‌కు చేదు జ్ఞాపకాలను మిగిల్చేదే. ఐపీఎల్ చరిత్రలో మోస్ట్ సక్సెస్‌ఫుల్ జట్లుగా పేరున్న ఈ రెండూ ఈ సీజన్‌లో ఘోరంగా విఫలం అయ్యాయి. భారత క్రికెట్ జట్టు మాజీ కేప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ, ప్రస్తుత కేప్టెన్ రోహిత్ శర్మ నాయకత్వాన్ని వహిస్తోన్న జట్లవి. ఈ రెండు టీమ్స్ కలిసి తొమ్మిదిసార్లు ఐపీఎల్ ఛాంపియన్స్ టైటిల్‌ను ఎగరేసుకెళ్లాయి. ఇందులో ముంబై ఇండియన్స్ వాటా.. అయిదు. ఇప్పటివరకు ఏ జట్టు కూడా ఇన్నేసి సార్లు టైటిల్ గెలవలేదు.

వాంఖెడెలో బ్లాక్ బస్టర్ మ్యాచ్..

వాంఖెడెలో బ్లాక్ బస్టర్ మ్యాచ్..

ఈ సీజన్‌లో రెండు జట్లు కూడా కూడబలుక్కున్నట్టు అధ్వాన్నంగా ఆడుతున్నాయి. ఇప్పుడీ రెండు జట్లు తలపడనున్నాయి. ముంబైలోని వాంఖెడె స్టేడియం ఈ బ్లాక్ బస్టర్ మ్యాచ్‌కు వేదిక. సాయంత్రం 7:30 గంటలకు గేమ్ ఆరంభమౌతుంది. ముంబై ఇండియన్స్‌తో పోల్చుకుంటే చెన్నై సూపర్ కింగ్స్ పరిస్థితి కొంతలో కొంత బెటర్. 11 మ్యాచ్‌ల్లలో నాలుగింట్లో విజయాలను అందుకుంది. అదే 11 మ్యాచ్‌లను ఆడిన ముంబై ఇండియన్స్ గెలిచింది రెండే.

చెన్నైపై ఆశలు మిణుకు

చెన్నైపై ఆశలు మిణుకు

ఈ రెండు టీమ్స్ ప్లేఆఫ్స్‌కు చేరుతాయనే ఆశల్లేవు. తన చివరి మ్యాచ్‌లో ఢిల్లీ కేపిటల్స్‌పై ఏకంగా 91 పరుగుల తేడాతో విజయం సాధించిన అనంతరం చెన్నై సూపర్ కింగ్స్ ప్లేఆఫ్స్ ఆశలు కొంత మెరుగుపడ్డాయి. ముంబై ఇండియన్స్‌తో పాటు మిగిలిన మ్యాచ్‌లల్లో గుజరాత్ టైటాన్స్, రాజస్థాన్ రాయల్స్‌పై అదే రేంజ్ రన్‌రేట్‌తో విజయం సాధించగలిగితే అద్భుతం జరిగే అవకాశాలు లేకపోలేదు. ఈ మూడింట్లో నెగ్గడంతో మొత్తం 10 పాయింట్లు ప్లస్ మెరుగైన రన్‌రేట్‌తో సీఎస్‌కే ప్లేఆఫ్స్‌లో చేరొచ్చనే అంచనాలు ఉన్నాయి.

ఓపెనర్లు గాడిన పడటం..

ఓపెనర్లు గాడిన పడటం..

ఇవ్వాళ్టి మ్యాచ్‌ కోసం చెన్నై సూపర్ కింగ్స్ ఎలాంటి ప్రయోగాలు చేయట్లేదు. ఢిల్లీ కేపిటల్స్‌ను ఓడించిన జట్టుతోనే ముంబై ఇండియన్స్ సంగతేంటో తేల్చనుంది. ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ ఫామ్‌ను అందిపుచ్చుకోవడం ధోనీసేనకు బిగ్ రిలీఫ్. డీసీపై మ్యాచ్‌లో 41, అంతకుముందు సన్‌రైజర్స్‌పై 99 పరుగులు చేశాడు. మరో ఓపెనర్ డెవాన్ కాన్వే.. నిలకడగా ఆడుతున్నాడు. చివరి మూడు మ్యాచ్‌ల్లలో 85,56,87 పరుగులు ఊది పడేశాడు. ఈ మూడు మ్యాచ్‌లల్లో ఓపెనింగ్ భాగస్వామ్యం అదిరింది. 110,54,182 పార్ట్‌నర్‌‌షిప్ అందించారు.

మిడిలార్డర్..బలహీనం

మిడిలార్డర్..బలహీనం

మిడిలార్డర్‌లో రాబిన్ ఉతప్ప, అంబటి రాయుడు, శివందుబే నిలకడను కోల్పోయారు. మొదట్లో అదరగొట్టిన రాబిన్ ఉతప్ప.. రానురాను నీరసించాడు. చివరి రెండు మ్యాచ్‌ల్లలో అతను చేసింది 1,0 పరుగులు. అంబటి రాయుడిదీ అదే పరిస్థితి. ఆరంభంలో సత్తాచాటినప్పటికీ.. ఆ తరువాత నిలకడను కోల్పోయాడు. వీరిద్దరితో పాటు శివందుబే కూడా క్రీజ్‌లో నిలదొక్కుకోవాలని భావిస్తోంది చెన్నై సూపర్ కింగ్స్. ఆల్‌రౌండర్ మొయిన్ అలీ ఆటతీరు గాడినపడటం ఆ జట్టుకు ఊరటనిస్తోంది.

బౌలింగ్ ఫుల్ స్వింగ్..

బౌలింగ్ ఫుల్ స్వింగ్..

చెన్నై సూపర్ కింగ్స్ బౌలింగ్ విభాగం బలంగా ఉంది. ఢిల్లీ కేపిటల్స్‌ను 117 పరుగులకే కట్టడం ఆ జట్టు బౌలింగ్ డిపార్ట్‌మెంట్ పదునుకు అద్దం పట్టింది. మహీష్ తీక్షణ, డ్వేన్ బ్రావో, డ్వైన్ ప్రిటోరియస్, ముఖేష్ చౌదరి.. నిప్పుల్లాంటి బంతులను సంధిస్తున్నారు. ఆల్‌రౌండర్ మొయిన్ అలీ స్పిన్ బౌలింగ్‌తో మేజిక్ చేస్తోన్నాడు. టోర్నమెంట్ సాగుతున్న కొద్దీ బౌలర్లు రాటుదేలారు. అదే ఫామ్ ఈ మ్యాచ్‌లోనూ కంటిన్యూ చేస్తే.. మరో విజయం చెన్నై ఖాతాలో పడుతుంది.

భిన్నంగా ముంబై..

భిన్నంగా ముంబై..

దీనికి పూర్తి భిన్నంగా ఉంది ముంబై ఇండియన్స్ పరిస్థితి. ఇప్పటివరకు ఆడిన 11 మ్యాచ్‌లల్లో రెండింటినే గెలిచింది. చివరి మ్యాచ్‌లో కోల్‌కత నైట్‌రైడర్స్ చేతిలో మరీ అధ్వాన్నంగా ఓడింది. కేకేఆర్ నిర్దేశించిన 165 పరుగులను కూడా ఛేదించలేకపోయింది. 113కే కుప్పకూలింది. ఒక్క ఇషాన్ కిషన్ మినహా మరెవరూ భారీ స్కోర్ చేయలేకపోయారు. బౌలింగ్ విభాగం కూడా ఆశించిన స్థాయిలో ఉండట్లేదు.

రోహిత్ శర్మ నుంచి

రోహిత్ శర్మ నుంచి

ఓపెనర్ కమ్ కేప్టెన్ రోహిత్ శర్మ బ్యాట్ నుంచి ఇప్పటివరకు భారీ స్కోర్ జాలువారలేదు. తన మార్క్ బ్యాటింగ్, తన మార్క్ భారీ షాట్లను ఆడటాన్ని మర్చిపోయాడా అనిపించేలా తయారయ్యాడు రోహిత్ శర్మ. ఇషాన్ కిషన్‌లో నిలకడ ఉండట్లేదు. సూర్యకుమార్ యాదవ్ గాయం వల్ల జట్టుకు దూరం కావడం దెబ్బకొట్టింది. తిలక్ వర్మ ఫర్వాలేదనిపించుకుంటున్నప్పటికీ.. మ్యాచ్‌ విన్నింగ్ నాక్ ఆడలేదు. కీరన్ పొల్లార్డ్‌దీ అదే పరిస్థితి. కాగా ఈ మ్యాచ్‌లో ఒక్క మార్పు చేసే అవకాశం ఉంది ముంబై ఇండియన్స్. రమణ్‌దీప్ లేదా ట్రిస్టన్ స్టబ్స్‌ను తుదిజట్టులోకి తీసుకునే అవకాశం ఉంది.

తుదిజట్ల అంచనాలివే..

తుదిజట్ల అంచనాలివే..

చెన్నై సూపర్ కింగ్స్‌లో- రుతురాజ్ గైక్వాడ్, డెవాన్ కాన్వే, మొయిన్ అలీ, రాబిన్ ఉతప్ప, శివం దుబే, అంబటి రాయుడు, ఎంఎస్ ధోనీ (కేప్టెన్, వికెట్ కీపర్), డ్వేన్ బ్రావో, సిమర్‌జిత్ సింగ్, మహీస్ తీక్షణ, ముఖేష్ చౌదరి ఆడే అవకాశం ఉంది. ముంబై ఇండియన్స్ తుదిజట్టులో- రోహిత్ శర్మ (కేప్టెన్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), తిలక్ వర్మ, ట్రిస్టన్ స్టబ్స్/రమణ్‌దీప్ సింగ్, టిమ్ డేవిడ్, కీరన్ పొల్లార్డ్, డేనియల్ సామ్స్, హృతిక్ షోకీన్, కుమార్ కార్తికేయ, జస్‌ప్రీత్ బుమ్రా, బాసిల్ థంపీ/రిలే మెరిడిత్‌ను తీసుకోవచ్చు.

Story first published: Thursday, May 12, 2022, 7:27 [IST]
Other articles published on May 12, 2022
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+