అడ్డుకున్న ధోనీ..
ఈ మ్యాచ్‌లో ధోనీ ఆల్‌రౌండర్ సత్తా చాటాడు. బ్యాటర్‌గా జట్టును గెలిపించడానికే అతను పరిమితం కాలేదు. షాడో కేప్టెన్‌గా పని చేశాడు. కీలక సమయాల్లో బుర్రకు పదును పెట్టాడు. తన అనుభవాన్ని ఉపయోగించి ఫీల్డింగ్‌ను సెట్ చేశాడు. దాని ఫలితంగా- కీరన్ పొల్లార్డ్ తక్కువ స్కోరుకే అవుట్ కావాల్సి వచ్చింది. చెన్నై సూపర్ కింగ్స్ ముందు భారీ లక్ష్యాన్ని నిర్దేశించలేకపోయింది ముంబై. 156 పరుగుల లక్ష్యాన్ని చెన్నై ఛేదించింది. చివరి ఓవర్ వరకూ వెళ్లిన హైఓల్టేజ్ మ్యాచ్ ఇది.
టాప్ ఆర్డర్ మళ్లీ ఫెయిల్..
రోహిత్ శర్మ వరుస వైఫల్యాల నుంచి గట్టెక్కలేకపోయాడీ మ్యాచ్‌లో కూడా. ఈ దఫా డకౌట్ అయ్యాడు. ఇన్నింగ్ తొలి ఓవర్ రెండో బంతికే వెనుదిరిగాడు. ఇషాన్ కిషన్‌దీ అదే పరిస్థితి. అతనిది గోల్డెన్ డకౌట్. ఎదుర్కొన్న తొలి బంతికే క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఈ రెండు వికెట్లను ముఖేష్ చౌదరి పడగొట్టాడు. మిడిల్ ఆర్డర్‌లో తిలక్ వర్మ భారీ ఇన్నింగ్ ఆడాడు. 43 బంతుల్లో 51 పరుగులు చేశాడు. ఇందులో ఒక సిక్సర్, మూడు ఫోర్లు ఉన్నాయి. సూర్యకుమార్ యాదవ్ మరోసారి 30 ప్లస్ స్కోర్ చేశాడు. 21 బంతుల్లో 32 పరుగులు సాధించాడు. హృతిక్ షోకీన్ 25 బంతుల్లో మూడు ఫోర్లతో 25 పరుగులు చేశాడు.
రోహిత్ ఏం చెప్పాడు..?
మ్యాచ్ ముగిసిన అనంతరం రోహిత్ శర్మ మాట్లాడాడు. జట్టు ఓటమికి గల కారణాలను విశ్లేషించాడు. జట్టు ఓటమికి కారణాలను వెతుక్కోవట్లేదని పేర్కొన్నాడు. ఓపెనింగ్ పార్ట్‌నర్‌షిప్ ఆశించిన స్థాయిలో ఉండట్లేదని, దాన్ని పునర్నిర్మించుకోవాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించాడు. ప్రారంభ ఓవర్లల్లో బౌలర్లపై ఎదురుదాడిని చేయలేకపోతున్నామని అంగీకరించాడు. వారిపై ఒత్తిడిని తీసుకుని రాలేకపోయామని చెప్పాడు.
బౌలింగ్ బెటర్..
ఈ మ్యాచ్ ఆద్యంతం బౌలర్లు రాణించారని రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు. డెత్ ఓవర్లలో చెన్నై బ్యాటర్లు మ్యాచ్‌ను లాగేసుకున్నారని అంచనా వేశాడు. టాప్ ఆర్డర్ ఫెయిల్యూర్ గురించి చెప్పడానికి తనవద్ద ఏమీ మిగల్లేదని అన్నాడు. మొదట్లోనే రెండు, మూడు వికెట్లను పోగొట్టుకుంటే.. మళ్లీ గాడిన పడటం కష్టమేనని అన్నాడు. మొత్తానికి తాము పోరాడదగ్గ స్కోర్‌ను ప్రత్యర్థికి ఇచ్చామని, బౌలింగ్‌లో ప్రత్యర్థిపై ఒత్తిడిని తీసుకుని రావాలనేది తమ ప్లాన్‌గా పేర్కొన్నాడు.
చివరి ఓవర్ వరకు అంతా అనుకున్నట్టే..
ఇన్నింగ్ చివరి ఓవర్ వరకు అంతా తాము అనుకున్నట్టే జరిగిందని, ఆ తరువాతే తమ అంచనాలు తప్పాయని రోహిత్ శర్మ చెప్పాడు. ధోనీ, ప్రిటోరియస్ మ్యాచ్‌ను మలుపు తిప్పారని అన్నాడు. ధోనీ ప్రశాంతతను ముందే అర్థం చేసుకున్నప్పటికీ.. అడ్డుకోలేకపోయామని రోహిత్ పేర్కొ్నాడు. పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉన్నప్పటికీ.. పరుగులను రాబట్టుకోవడంలో విఫలం అయ్యామని స్పష్టం చేశాడు. ఆరంభంలోనే వికెట్లను కోల్పోవాల్సి రావడంతో స్వేచ్ఛగా ఆడలేకపోయామని తేల్చేశాడు.


Click it and Unblock the Notifications












