For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

చెన్నై సూపర్ కింగ్స్ ఫెయిల్యూర్స్‌ను పవర్ కట్స్ మీదికి తోసేయలేం: చేజేతులా: ఓటమికి కారణాలివే

IPL 2022, CSK vs MI: 5 Reasons Why Chennai Super Kings lost the match against Mumbai Indians

ముంబై: ఐపీఎల్ 2022 సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ కథ ముగిసింది. ముంబై ఇండియన్స్‌పై ఓటమితో ప్లేఆఫ్స్ రేసు నుంచి తప్పుకొంది. 2020 సీజన్ నాటి పరిస్థితులే ఇప్పుడూ వెలుగులోకి వచ్చాయి. ఆ సీజన్ తరహాలోనే ఇప్పుడు కూడా ప్లేఆఫ్స్ ముఖం చూడకుండానే ఇంటిదారి పట్టింది ఎల్లో ఆర్మీ. కొద్దో, గొప్పో ఉన్న ప్లేఆఫ్స్ అవకాశాలు.. ఈ తాజా ఓటమితో ఆవిరయ్యాయి. అలాగని- ఈ విజయంతో ముంబై ఇండియన్స్‌కు ఒరిగేదేమీ లేదు. ఆ జట్టు కూడా నిండా మునిగింది.. ధోనీ సేననూ ముంచింది. ఈ రెండు జట్లు కూడా టోర్నమెంట్ నుంచి నిష్క్రమించనున్నాయి.

అరుదైన దృశ్యం..

అరుదైన దృశ్యం..

మోస్ట్ సక్సెస్‌ఫుల్ టీమ్స్ ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్- ప్లే ఆఫ్స్ రేసు నుంచి తప్పుకోవడం ఓ అరుదైన ఘటన. ఈ రెండు జట్లు లేని ప్లేఆఫ్స్‌ను మనం చూడబోతున్నాం. ఇలాంటి సందర్భం చోటు చేసుకోవడం ఐపీఎల్ చరిత్రలో ఇదే తొలిసారి. ముంబై లేదా చెన్నై- ఈ రెండు జట్లూ ప్రతి ప్లేఆఫ్స్‌లోనూ ఆడాయి. ఈ సీజన్‌లో మాత్రం ఈ రెండింటి స్థానాలను కొత్త జట్లు గుజరాత్ టైటాన్స్, లక్నో సూపర్ జెయింట్స్ ఆక్రమించుకున్నట్టే.

అంపైరింగ్..

అంపైరింగ్..

అంపైర్ల తప్పిదాలు మళ్లీ మళ్లీ పుట్టుకొస్తూనే ఉన్నాయి ఈ ఐపీఎల్ సీజన్‌లో. ముంబై ఇండియన్స్‌-చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్‌లోనూ కనిపించాయి. చెన్నై ఓటమిలో భాగస్వామ్యం అయ్యాయి. చివరి మూడు మ్యాచ్‌లల్లో మూడు అర్ధసెంచరీలతో దూకుడు మీదున్న సీఎస్‌కే ఓపెనర్ డెవాన్ కాన్వే ఎల్బీడబ్ల్యూలో అంపైరింగ్ తప్పిదం చోటు చేసుకుంది. పవర్ కట్స్ వల్ల దానికి రివ్యూ తీసుకునే అవకాశం కూడా లేని దుస్థితిని ఎదుర్కొంది చెన్నై. డీఆర్ఎస్‌ను ఆశ్రయించినా పవర్ కట్స్ వల్ల అది సాధ్యపడలేదు. ఫలితంగా- తొలి ఓవర్‌లోనే కాన్వే అవుట్ అయ్యాడు. ఆ తరువాత మిగిలిన బ్యాటర్లు వరుస కట్టారు.

29 పరుగులకే సగం జట్టు వెనక్కి

29 పరుగులకే సగం జట్టు వెనక్కి

డేనియల్స్ సామ్స్ వేసిన తొలి ఓవర్‌లోనే డేవాన్ కాన్వే, మొయిన్ అలీ డకౌట్‌గా వెనుదిరిగారు వీరిద్దరూ. రెండో ఓవర్‌లో రాబిన్ ఊతప్ప ఒక్క పరుగు చేసి అవుట్ అయ్యాడు. ఆ కొద్దిసేపటికే రుతురాజ్ గైక్వాడ్, అంబటి రాయుడు పెవిలియన్ చేరడంతో పవర్ ప్లేలోనే 29 పరుగులకు సగం జట్టును కోల్పోయింది చెన్నై. శివందుబే-10, డ్వేన్ బ్రావో-12, సిమర్‌జీత్ సింగ్-2, మహీష్ తీక్షణ-0, ముఖేష్ చౌదరి-4 పెవిలియన్‌కు క్యూ కట్టారు. నాన్ స్ట్రైకింగ్ ఎండ్‌లో ధాటిగా ఆడుతున్న కేప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి అండగా ఎవరూ నిలవలేకపోయారు.

ధోనీ ఒంటరిపోరు..

ధోనీ ఒంటరిపోరు..

వికెట్లు పడుతున్నా ధోనీ ఒంటరి పోరాటం చేశాడు. అతనికి తోటి బ్యాటర్ల అండ ఉండివుంటే పరిస్థితి మరోలా ఉండేది. ఎవ్వరూ కూడా పట్టుమని 10 నిమిషాలు కూడా క్రీజ్‌లో నిలదొక్కుకోలేకపోయారు. సీజన్ ఆరంభంలో మెరుపులు మెరిపించిన రాబిన్ ఉతప్ప.. అట్టర్ ఫ్లాప్ అయ్యాడు. మిడిలార్డర్‌లో అంబటి రాయుడు, శివందుబేల్లో నిలకడ లోపించింది. ఈ ఇద్దరు ఒకేతరహాలో అవుట్ అయ్యారు. రిలే మెరిడిత్ బౌలింగ్‌లో వికెట్ కీపర్ ఇషాన్ కిషన్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరారు.

షాట్ సెలెక్షన్స్..

షాట్ సెలెక్షన్స్..

గెలిస్తే.. ప్లేఆఫ్స్ రేసులోకి దూసుకొచ్చే మ్యాచ్ ఇది. అలాంటి కీలక గేమ్‌లో పూర్తిగా విఫలమైంది చెన్నై సూపర్ కింగ్స్. ఈ ఫెయిల్యూర్స్ అన్నింటినీ పవర్ కట్స్‌పైకి నెట్టేయలేని పరిస్థితి. పేలవ బ్యాటింగ్‌తోనే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో ఓటమిపాలైంది జట్టు. షాట్ సెలెక్షన్స్ కొంప ముంచాయి. అంబటి రాయుడు, శివందుబే, ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ ఒకే విధంగా అవుట్ అయ్యారు. కీపర్ ఇషాన్ కిషన్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరారు. గెలిచి తీరాల్సిన మ్యాచ్‌ను చేజేతులా పోగొట్టుకున్నట్టయింది.

పవర్ కట్స్..

పవర్ కట్స్..

డేనియల్ సామ్స్ వేసిన ఇన్నింగ్స్ ఫస్ట్ ఓవర్ రెండో బంతికే డేవాన్ కాన్వే వికెట్ల ముందు దొరికిపోయాడు. ఫీల్డ్ అంపైర్ ఔటివ్వగా.. స్టేడియంలో పవర్ కట్ కారణంగా డీఆర్‌ఎస్ కోరుకునే అవకాశం లేకుండా పోయింది. రెండో ఓవర్ నాలుగో బంతికి రాబిన్ ఊతప్ప సైతం ఎల్లీడబ్ల్యూగా వెనుదిరిగాడు. అప్పటికీ కరెంట్ రాకపోవడంతో డీఆర్‌ఎస్ తీసుకునే అవకాశం లేకపోయింది. అప్పటికి జట్టు స్కోర్ అయిదు పరుగులే. పవర్ కట్స్ లేకుండా డీఆర్ఎస్ అందుబాటులో ఉండివుంటే కాన్వే వికెట్‌ను చెన్నై సూపర్ కింగ్స్ కాపాడుకుని ఉండేది.

Story first published: Friday, May 13, 2022, 8:31 [IST]
Other articles published on May 13, 2022
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+