IPL 2022 CSK vs KKR Toss Update: టాస్ గెలిచిన కోల్‌కతా.. కెప్టెన్‌గా ఫుల్ జోష్‌లో జడేజా


వాంఖడే: క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2022 ప్రారంభమైంది. తొలి మ్యాచ్‌లో చెన్నైసూపర్ కింగ్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ తలపడుతుండగా.. కోల్‌కతా కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు. దీంతో చెన్నై సూపర్ కింగ్స్ మొదట బ్యాటింగ్ చేయబోతుంది. ఈ మ్యాచ్‌తో రవీంద్ర జడేజా కెప్టెన్‌గా కొత్త బాధ్యతలను మొదలుపెట్టాడు. అటు కేకేఆర్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కూడా చాలా కాలం తర్వాత మళ్లీ కెప్టెన్సీ బాధ్యతలను చేపట్టాడు.

శ్రేయస్ అయ్యర్ ఏమన్నాడంటే..
‘‘మేము ముందుగా బౌలింగ్ చేస్తాము. నేను చాలా ఉత్సాహంగా ఉన్నాను. ఈ జెర్సీని ధరించడం గొప్ప గౌరవం. కేకేఆర్ తరఫున ఆడుతున్న ఆటగాళ్లు రాణిస్తున్నారు. పిచ్ బెల్టర్‌గా ఉన్నట్లు అనిపిస్తుంది. మంచు తరువాత అది మెరుగవుతుంది. మేము ముగ్గురు విదేశీ ఆటగాళ్లతో బరిలోకి దిగుతున్నాం. సామ్ బిల్లింగ్స్, సునీల్ నరైన్ , ఆండ్రూ రస్సెల్ మ్యాచ్ ఆడుతున్నారు. ఓపెనర్‌గా వెంకటేశ్ అయ్యర్, అజింక్యా రహానే ఇన్నింగ్స్‌ను ప్రారంభిస్తారు.'' అని కేకేఆర్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ చెప్పాడు.

రవీంద్ర జడేజా ఏమన్నాడంటే..
‘‘కెప్టెన్‌గా కొత్త పాత్రలో కనిపించడం కోసం నేను సంతోషంగా, ఉత్సాహంగా ఉన్నాను. మేము నలుగురు విదేశీ ఆటగాళ్లతో ఆడబోతున్నాం. డేవాన్ కాన్వే, డ్వేన్ బ్రావో, ఆడమ్ మిల్నే, మిచెల్ సాంట్నర్ మా విదేశీ ఆటగాళ్లు. రుతురాజ్ గైక్వాడ్, డేవాన్ కాన్వే మా ఇన్నింగ్స్‌ను ప్రారంభిస్తారు.'' అని సీఎస్కే కెప్టెన్ రవీంద్ర జడేజా తెలిపాడు.

తుది జట్లు
కోల్‌కతా నైట్ రైడర్స్: వెంకటేష్ అయ్యర్, అజింక్యా రహానే, శ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్), నితీష్ రాణా, సామ్ బిల్లింగ్స్ (వికెట్ కీపర్), ఆండ్రీ రస్సెల్, సునీల్ నరైన్, షెల్డన్ జాక్సన్, ఉమేష్ యాదవ్, శివమ్ మావి, వరుణ్ చకరవర్తి.
చెన్నై సూపర్ కింగ్స్: రుతురాజ్ గైక్వాడ్, డెవాన్ కాన్వే, రాబిన్ ఉతప్ప, అంబటి రాయుడు, రవీంద్ర జడేజా (కెప్టెన్), శివమ్ దూబే, ఎంఎస్ ధోని (వికెట్ కీపర్ ), డ్వేన్ బ్రావో, మిచెల్ సాంట్నర్, ఆడమ్ మిల్నే, తుషార్ దేశ్‌పాండే.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications