Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

శివం దుబే నిర్వాకం: క్యాప్‌ను విసిరి కొట్టబోయిన జడేజా, నెత్తిపై చేతులు పెట్టుకున్న బ్రావో

IPL 2022, CSK vs GT: Ravindra Jadeja and Dwayne Bravo lost their cool to Shivam Dube during fielding

ముంబై: ఐపీఎల్ 2022 సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ మరో ఓటమిని చవి చూసింది. గుజరాత్ టైటాన్స్ చేతిలో అనూహ్యంగా ఓడింది. అంతా బాగానే ఉందనుకున్న స్థితి నుంచి అథఃపాతాళానికి జారిపోయింది. పాయింట్ల పట్టికలో తొమ్మిది స్థానం నుంచి కదల్లేకపోతోంది. ఆరింట్లో ఒక్క మ్యాచ్‌లోనే గెలిచింది. చెన్నై సూపర్ కింగ్స్ ఆ జట్టు ఖాతాలో ఉన్నవి రెండు పాయింట్లే. తన తదుపరి మ్యాచ్‌ను 21వ తేదీన ఆడనుంది. ముంబై ఇండియన్స్‌ను ఢీ కొట్టనుంది. అందులో గెలిచినా.. దాని వల్ల చెన్నై సూపర్ కింగ్స్ సాధించేది పెద్దగా ఉండకపోవచ్చు.

బ్యాటింగ్‌లో రాణించని శివం..

బ్యాటింగ్‌లో రాణించని శివం..

తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ 20 ఓవర్లలో అయిదు వికెట్ల నష్టానికి 169 పరుగులు చేసింది. ఓపెనర్ రుతురాజ్ చాలాకాలం తరువాత ఫామ్‌లోకి వచ్చాడు. భారీ ఇన్నింగ్ ఆడాడు. 48 బంతుల్లో అయిదు ఫోర్లు, అయిదు సిక్సర్లతో 73 పరుగులు చేశాడు. మరో ఓపెనర్ రాబిన్ ఉతప్ప, మొయిన్ అలీ, శివం దుబే తక్కువ పరుగులకే అవుట్ అయినా.. మిడిలార్డర్‌లో అంబటి రాయుడు, చివర్లో రవీంద్ర జడేజా ధాటిగా ఆడటంతో ఆ స్కోర్ సాధ్యపడింది.

వారిద్దరి వల్లే..

వారిద్దరి వల్లే..

గుజరాత్ టైటాన్స్‌ను మిడిలార్డర్ బ్యాటర్ డేవిడ్ మిల్లర్, స్టార్ స్పిన్నర్, ఈ మ్యాచ్‌కు కేప్టెన్‌గా వ్యవహరించిన రషీద్ ఖాన్ గెలిపించారు. 51 బంతుల్లో ఆరు సిక్సర్లు, ఎనిమిది ఫోర్లతో డేవిడ్ మిల్లర్ 94 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. రషీద్ ఖాన్ 21 బంతుల్లో 40 పరుగులు బాదాడు. ఇందులో మూడు సిక్సర్లు, రెండు ఫోర్లు ఉన్నాయి. ఈ ఇద్దరూ చెన్నై చేతుల్లో నుంచి మ్యాచ్‌ను లాగేసుకున్నారు. 18వ ఓవర్‌లో రషీద్ ఖాన్ 25 పరుగులను రాబట్టడంతో ఒక్కసారిగా మ్యాచ్ మొత్తం గుజరాత్ టైటాన్స్ వైపు మొగ్గు చూపింది.

మిల్లర్‌ను అవుట్ చేసే ఛాన్స్ దక్కినా..

మిల్లర్‌ను అవుట్ చేసే ఛాన్స్ దక్కినా..

డేవిడ్ మిల్లర్ 78 పరుగుల వద్ద ఉన్న సమయంలో అవుట్ అయ్యే ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్నాడు. 17వ ఓవర్ రెండో బంతికి ఈ సంఘటన చోటు చేసుకుంది. డ్వేన్ బ్రావో బౌలింగ్‌లో భారీ షాట్ ఆడిన మిల్లర్ టైమింగ్ మిస్ అయ్యాడు. బంతిని కనెక్ట్ కాలేకపోయాడు. గాల్లోకి లేచిన బంతి మిడ్ ఆన్‌లో ఫీల్డింగ్ చేస్తోన్న శివం దుబే వైపు దూసుకెళ్లింది. దాన్ని అందుకోలేకపోయాడు శివం దుబే. కనీసం ఆ ప్రయత్నం కూడా చేయలేదు. గాల్లోకి లేచిన బంతి.. శివం దుబే ఎదురుగా నేలపై వాలింది.

22 బంతుల్లో 50 పరుగులు చేయాల్సిన దశలో..

అప్పటికి గుజరాత్ టైటాన్స్ 22 బంతుల్లో 50 పరుగులు చేయాల్సిన దశలో ఉంది. దుబే- ఏ మాత్రం అప్రమత్తంగా ఆ క్యాచ్ అందుకుని ఉండే వాడే.. మిల్లర్ వెనుదిరిగే వాడే. అదే జరిగివుంటే మ్యాచ్ ఫలితం మరోలా ఉండేది. డేవిడ్ మిల్లర్ ఇచ్చిన లడ్డూలాంటి క్యాచ్‌ను కనీసం అందుకునే ప్రయత్నం కూడా చేయకపోవడం పట్ల శివం దుబేపై రవీంద్ర జడేజా, బౌలర్ డ్వేన్ బ్రావో అసహనాన్ని వ్యక్తం చేశారు. రవీంద్ర జడేజా తన క్యాప్‌ను నేలకు విసిరి కొట్టబోయి.. చివరి నిమిషంలో తమాయించుకున్నాడు. బ్రావో- ఇలా చేశావేంటంటూ నెత్తిపై చేతులు పెట్టుకున్నాడు.

Story first published: Monday, April 18, 2022, 12:06 [IST]
Other articles published on Apr 18, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+